జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

ఓ వినాయకా..!

with one comment

ఇంద్రాదిదేవతలచే కొలవబడుతూ
సర్వశక్తులను అందించే ఓ విఘ్నేశ్వరా
మా బ్లాగర్లకు
విజయాలను ప్రసాదించు.

త్రిమూర్తులను ప్రదమ పూజలతొ ఒప్పారే
ఓ ప్రమధగణాధిపతీ మా తెలుగు బ్లాగర్ల కు
మహొన్నతమైన యశస్సును అందించు.

మహర్షులచేత యజ్ఘ్నయాగాది ఫలాలను
అందుకునే ఓ వక్రతుండా  తెలుగు బ్లాగుల అబివ్రుద్ది కి సహకరించు
వారికి యశస్సు చేకూర్చు.

సర్వప్రాణికొటిచే నిత్యం అర్చించబడే
ఓ లక్ష్మీగణపతీ మా అబివ్రుద్దికి సహకరించు వారికి
ఐశ్వర్యాన్ని అందించు.

భక్తజనావళి శ్రేయస్సును కొరే ఓ గజముఖ
గణపతీ మా శ్రేయౌభిలాషులందరికీ
కోరిన కోరికలను ఒసగు.

వినాయకచవితి సందర్భంగా నిన్ను
కొలిచే మా పాటకదేవుళ్ళకు(బ్లాగు చదివేవారికి)  విఘ్నాలను
తొలగించి ఆయురారొగ్యాలను
అందించి అష్టైశ్వర్యాలను
ప్రసాదించవలసిందిగా ప్రార్దిస్తూ,

నీ భక్తుడు., 

విజయ కుమార్  కట్టా .

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 14, 2007 వద్ద 4:48 అపరాహ్నం

కవితలు లో రాసారు

ఒక స్పందన

Subscribe to comments with RSS.

  1. అన్నింటా విజయాలే కలగాలని ఆశిస్తూ
    ** వినాయక చతుర్ధి శుభాకాంక్షలు **

    Viswanath

    సెప్టెంబరు 15, 2007 at 5:53 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము