e-తెలుగు హైదరాబాద్ సమావేశం మే-2008
మే 11, 2008 ద్వారా జాబిల్లి
e-తెలుగు ఒక సంఘంగా ఏర్పడిన తరువాత జరిగిన మొట్టమొదటి సమావేశం ఇది!
ఈ సారి సమావేశం ఎప్పటకన్నా బిన్నముగా జరిగినది!సమయం ఇట్టేగడచిపొయినది, సమావేశం మొత్తం చాలా ఆశక్తిగా,చురుకుగా
సాగింది,కొత్తవ్యక్తుల పరిచయ కార్యక్రమాలు ముగుయగానే e-తెలుగు అధ్యక్షులు చదువరి గారు మొదటిగా సభనుప్రారంభించి e-తెలుగు గురించి వివరించారు,తరువాత పద్మనాభం గారు e-తెలుగు ఇంకా పారదర్శకముగా ఉండాలని అభిప్రాయపడ్డారు,చదువరి గారు
తెలుగు ఫాంట్లగురించి,అనువాదాలగురించి,డిక్షనరి గురించి వివరించి సభికుల అభిప్రాయాలు తేసుకున్నారు,
సి.బి.రావు గారు ఆంగ్లపద్యాల సంపుటి సభికులకు పంచారు నేను దానిపైన ఆటొగ్రాఫ్ తేసుకున్నాను.
చదువరిగారు e-తెలుగు అధికారిక వెబ్ సైట్ గా etelugu ను ప్రకటించారు!మధ్యమధ్యలొ కొన్ని జొకులు పేలాయి,
తెలుగు బ్లాగులు e-తెలుగు లొ ఒక భాగమని అన్నారు, తెలుగు అనువాదాల గురించిన సమాచారం కొరకు తెలుగువికి లొ చూడమని వేవెన్ అన్నారు,లేఖిని,కూడలి అన్ని మనవే(e-తెలుగు) వారివే అని అన్నారు,కొత్తగా వచ్చిన కిరణ్ సభికులందరిని
ఒక ఫొటొ తేసుకుని ,తనుకూడా మాతొ ఒక ఫొటొ దిగారు తరువాత చిన్నగా అందరం బయలు దేరాం! చిన్నగా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బయలు దేరాం, ఈ సమావేశం నేను హాజరైనదానిలొ మరచిపొలేనిది!
ఇది నా అనుభవం మాత్రమే అని పాటకులు గ్రహించాలి,మేకు మరింత వివరణాత్మకమైన సమాచారం కొరకు సందర్శించండి
e-తెలుగు అధికారిక పేజి eతెలుగు
e-తెలుగు సంఘంగా ఏర్పడిన సందర్భంగా నా శుభాకాంక్షలు.
e-తెలుగు, తెవికీ, లేఖిని, కూడలి అన్నీ మనవే. తెలుగు మనదే. తెలుగు మాట్లాడే ప్రతివాడు మనవాడే. పేలిన జోకులేవో మాకు కూడా చెప్పవచ్చు గదండీ!