జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

అకాల”నష్టం”

with 2 comments

పంటచేతికి వచ్చే సమయానికి  ముంచుకొచ్చింది మాయదారి వాన…కష్ట ఫలంకొసం గంపెడు ఆశతొ ఉన్న రైతుకు గుక్కెడు కన్నీళ్ళు మిగిల్చింది!!
అటూ ఇటూ కాని వాన మొత్తం నాశనమైపొయినా బాగుణ్ను …సగం తడిసి  రంగుమారిన ధాన్యం ఇక వీటిని అమ్మటానికి రైతులు పడే కష్టం ఉంటుంది చూడండి…తడిసిన  ఓదెలను ఎండబెట్టి ఎలాగొలా కౌలుచేసి మార్కెట్టుకు తీసుకువస్తే అక్కడ రేటు ఉండదు ఇక రైతుకు మిగిలేది అప్పే!!

కూలీ,పురుగుమందులు ఖర్చులు కూడా రావు! అర్దరాత్రి మోటర్లు వేసి నానా తిప్పలు పడితేకాని  పంట ఒక దారికి రాదు ఆ సమయం లొ వచ్చే ఇలాంటి ప్రక్రుతివైపరిత్యాలకు  భగవంతుడిని నిందిస్తూ మౌనంగా భాధపడటం  తప్ప మనం  ఏంచేయగలం  ?

కాని మాన అధికారులు ఉన్నారే నాయకుల మెప్పుకొసం  దేనికైనావెనుకాడరు! నిన్న కురిసిన  బారివర్షానికి మా  మండలంలొనే సుమారు 40వేల ఎకరం పూర్తిగా నీళ్ళలు మునిగిపొతే మాజిల్లాకు నష్టం ఏమీ లేదని చెప్పేసి చేతులుదులుపుకున్నారు…నష్టం జరిగింది అంటే మళ్ళీ సర్వే చేయటానికి ఊళ్లకి,పొలాలకి వెళ్లాలి ఈగొలంతా ఎందుకు అసలు నష్టం జరలేదు అంటే పొలా!? అది మన అదికారులపని తీరు!

ముద్ద అన్నంపెట్టే రైతు గొడు పట్టించుకునే వాడే లేకపోయ!

Written by కట్టా విజయ్

నవంబరు 18, 2008 వద్ద 1:03 పూర్వాహ్నం

సమీక్ష లో రాసారు

2 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. అక్కడేమో అతివృష్టి, ఇక్కడ రాయలసీమలోనేమో అనావృష్టి. అక్కడ పడిన వర్షంలో పదిశాతం ఇక్కడ పడిఉంటే మేము బాగుపడేవాళ్ళం.

    చిలమకూరు విజయమోహన్

    నవంబరు 18, 2008 at 4:16 పూర్వాహ్నం

  2. నిజమే ప్రతిసారీ పంట చేతికి వచ్చే సమయానికి వరుణుడి ఆగ్రాహానికి (అనుగ్రహానికి అనాలా?) గురవుతున్నాడు రైతన్న

    laxmi

    నవంబరు 18, 2008 at 9:59 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము