జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ _ తాపీ ధర్మారావు

leave a comment »

నేను పుస్తకం చూడగానే కధ ఏమైనా అయిఉంటుంది అని అనుకున్నాను , కాని రచయిత తాపీ ధర్మారావు పేరు చూడగానె చదవాల్సిన పుస్తకమే అని తీసుకున్నాను.
పుస్తకం మొత్తం మూడు రొజుల్లొ చదివాని రాత్రి పదుకునే ముందు , ఉదయం లేవగానే ఇలా … ఇలా చదవటం వల్లనే ఏమొ వంటబట్టినట్టుంది ;) .
నిజానికి సమాజంలొ బిచ్చగాళ్ళ మీద ఉన్న అభిప్రాయాని వళ్ళు పడే బాదలని , క్షొబని మరియూ నేపద్యాన్ని చాలా దగ్గర గా చూసి రాశారు.
దీనిలొ అడుక్కునేవాళ్ల గురించి , దానం చేసేవాళ్ళ గురించి మానసిక వ్యధతొ రచయిత రాసిన వ్యాసం.
లేని వాడే అడుక్కుంటున్నాడని వాళ్ళనే సమాజం బిచ్ఛగాళ్ళు గా చులకన గా  చూస్తొందని వాళ్ళు అలా తయారు కావడానికి  సమాజమే కారణమని కాని సమాజమే వాళ్ళని ఆదరించకుండ చీదరించుకుంటుందని రచయిత అబిప్రాయ పడ్డారు .
ఇక్కడ రచయిత సమాజంలొ కొన్ని వర్గాల్ని (దానాలు పుచ్ఛుకునేవాళ్ళని ) అడుక్కొవటానికి దానం అనే అందమైన పేరు పెట్టి లాబపడుతున్నారు , దానం ఇచ్చేవాళ్ళూ వాళ్ళకే దానం ఇవ్వడం వళ్ళ పాపాలు తొలగి పొతాయని , ఏదొ ఓరుగుతుందని అనుకుంటారని అన్నారు. దానాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నవాళ్ళకే ఇస్తారు కాని లేని వాడికి ఎవరు ఇవ్వరు .
సమాజంలొ మనం ‘కర్మ’ అనే  ఒక అందమైన దాన్ని శ్రుష్టించుకొని ప్రతిదానికి దాని మీదకే నెట్టివేస్తున్నాం అని వివరించారు , నాకు నచ్చిన వాటిల్లొ  ఇది ఒకటి !!
అడుక్కునే వాడు అలా అడుక్కొవడానికి ఎంతొ మానసిక క్షొభానుబవిస్తాడని ,ఆత్మగొరవం చంపుకొటాడని వేరే దారిలేక దయగల వారిని బిక్ష అడుగుతాడని బిచ్చగాళ్ళ  అంతరంగాన్ని దీనంగా వివరించారు. కాని ఈరొజుల్లొ ఉన్న బిచ్చగాళ్ళలొ ఇలా ఎంతమంది ఉన్నారన్నది నాకు అనుమానం ?
ఈ పుస్తకంలొ ఒక దగ్గర అవయువాలన్ని సరీగ ఉన్నవాడికి దానం చేయవద్దని కూడా అన్నారు !
రచయిత చివరిలొ కొన్ని నిజజీవితాలను వారి నేపద్యాన్ని పరిచయం చేశారు , ఇది నాకు నచ్చింది .

ఏది ఎమైనా నాకు ఈ పుస్తకం చదవదగ్గదని అనిపించింది , బిచ్చగాళ్ళ  విషయంలొ తప్పకుండా మనకు ఒక విదమైన అవగాహన కలుగుతుంది .

Written by కట్టా విజయ్

డిసెంబరు 23, 2011 వద్ద 3:10 అపరాహ్నం

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.