Archive for the ‘అనుభవాలు’ Category
నా ఫొటొతొ చిన్న ప్రయౌగం…
104 కి ఫొన్ చేస్తే వాచింది
“104″ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరొగ్యసేవల సర్వీసు ఇది! మొన్న ఈమధ్య ఒక సారి దానికి కొంచం పని పడి ఫొన్ చేసాను , చేయగానే వెంటనే కలిసింది సంతొషం.
కాల్ కనెక్ట్ అవ్వగానే పేరు,ఎక్కడనుంచి ఫొన్ చేస్తున్నారు తదితర వీవరాల తరువాత ఒక నెంబరు ఇచ్చారు,తరువాత వేరే వళ్ళకి కనెక్ట్ చేశారు,అక్కడ ఎవరొ లేడి ఎత్తింది అబ్బ ఆమె తెలుగు వింటుంటే నాకు చిరెత్తుకొచ్చింది “మీకు ఏది కవలి” సినిమాల్లొ చూపిస్తారే తెలుగు అప్పుడప్పుడే నేర్చుకునేవళ్ళు మాట్లాడినట్టు మాట్లాడింది ఇక కాల్ అక్కడనుంచి ఇంకొకచొటికి మారింది! అక్కడ కాసేపు కొంచం దానితరువాత ఇంకొక చొటికి అక్కడ సమస్యకు సమాదానం దొరికింది!! ఇక అక్కడ నుంచి ఫైనల్ రౌండ్ మీకు టైం ఉంటే రెండు ముక్కలు చెబుతాం అన్నారు ….చెప్పమన్నాను ,భైర్రాజు ఫౌండేషన్ గురించి చెప్పిందికాసేపు కాని తరువాత నాకు అనిపించిన విషయాలు ఏంటంటే అసలు సమాదానం కొసం ఇన్ని సార్లు వాడికి వీడికి ఫొన్ కలపాలా! ఈలొపు రొగి పరిస్తితి ఏమిటి!
ఇంకొక విషయం సరే మాట్లాడిన తరువాత నాసెల్లు లొ బ్యాలెన్స్ తగ్గినట్టు చిపించింది! చుస్తే నిజంగానే తగ్గింది విష్యం కనుక్కుందామని కాల్ సెంటర్ కి ఫొన్ చేశాను మనొడు చావు కబురు చల్లగా సార్ అది ప్రీ సర్వీస్ కాదు సార్ 3 రుపాయలు ప్రతినిమిషనికి చార్జ్ చేశాడు!
మొత్తం 8 నిమిషాలు !! ఇంకెప్పుడు ప్రభుత్వ సర్వీసులను టెస్ట్ చేయకూడదని గట్టిగా నిర్నయించుకున్నాను.
నాకు నా దేశం లొ స్వేచ్చకావాలి…..!
రాజధాని లొ మళ్ళీ బాంబులు పేలాయి ౨౦ మంది చనిపొయారు ౧౦౦ మంది గాయపడ్డారు ఇది నిన్నటి సంగతి,అంత ముందు దేశం లొ అక్కడక్కడ బాంబులు పేలుతున్నాయి ఎంతొ మంది చనిఫొతున్నారు ఇన్నిజరుగుతున్నా ఎవరికి పట్టదు అధికారం లొ వున్నవాళ్ళకు గాని ,ప్రతిపఖా లలొ ఉన్నవళ్ళకు గాని పట్టదు అందరు బాంబు దాడి తీవ్రం గా కండించేవళ్ళేకాని ఒక్కడు కూడా గట్టిగా పట్టించుకొరు!
ఇలా మనదగ్గరే ఎందుకు జరుగుతున్నాయి,ఎవరు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు,ఇంత బరితెగించి ఎలా చేయగలుగుతున్నారు ఇవన్ని అందరికి తెలుసు కాని ఎవరుపట్టించుకొరు?
ఎందుకు పొయినవళ్ళకొసం ఒక వర్గం ఓట్లను వొదులుకొలేరుకదా!
ఇక మన ప్రధానమంత్రి ఈరొజు బాంబులు పేలాక సహనం గా ఉండాలి అని పిలుపు ! ఎంటి ఉండేది ఎందుకు ఉండాలి , ఎంతొమందిని చంపేస్తుఉంటే ఎందుకు ఊరుకొవాలి,
లిన్గు లిన్గు మంటు రెండేళ్ళు ఊపుకుంటూ ఏడవలేక నవ్వుకుంటూ తిరిగితే సరిపొతుందా , పార్లమెంటుమీద దాడి చేసినావాడిని ఇంకా ఉరితీయకుండా ఎందుకు కాలయాపన
చేస్తున్నట్టు,మన పార్లమేంటుమీద దాడి చేసిన వాడి ని శిక్శ్ఃంచక పొతే ఉగ్రవాదులకి ఏం మేసేజ్ వెళుతుంది,అక్కడే దొ కొంపలు మునిగిపొతున్నట్టూ ఉరుకూ పరుగుల మీద
అణుఒప్పందం కుదుర్చుకొచ్హారు ఇప్పుదు ఏమైంది సరీగా సెంటర్ చేసి అందరిముందు వొగొబెట్టాడు సరి పొయిన్ది!
ప్రతిననేలా ఎక్కదొ ఉక చొట బాంబులు పేలుతున్నయి …అయినా ఎవరికి ఎమిపట్టదు,అధికారం లికి రాగానే ఎదొ కొంపలు మునిగొపొతున్నట్టు పొటాని రద్దు చేయాల్సిన అవసరం ఎమొచ్హ్హింది,అన్నింటికి గేట్లు బార్లా తెరిచారు….
ఇప్పుడూ బయటికి వెళ్ళాలంటే భయం,తిరిగి వస్తామొ లేదొనని , నాకు ఈరొజై తె ఇంటి దగ్గరనుంచి ఒకటే ఫొన్ లు మానాన్న గారు ,మా అమ్మ గారు ఒకటే ఫొన్లు ఏమి లేదు
బయటికి ఎటూ వెళ్ళవద్దట!
నాకు ఒకటే భాధ నాదేశం లొ నేను స్వతత్రంగాతిరగటానికి నాకేంటా భాధా అని అది రాత్రి పూటకుఉడ కాదు పగలు , ఈ రాజకీయనాయకులకి రైళ్ళలొ చెంబులకి ఉండే గొలుసులగురించి
కొట్తుకొవటానికి టైంఉంటుందికాని ప్రజాసమస్యలు గురించి చర్చించటానికి టైంఉండదు!
వాళ్ళంతటికి వళ్ళూ వచ్హి చంపుకుంటూ పొతునే ఉంటారు వేళ్ళు మాత్రం కండిస్తుఉనే ఉంటారు,వీళ్ళకేం వీళ్ళు మన సొమ్ముతొ లలొ బాగానే తిరుగుతారుమరి సామాన్యుడి పరిస్తితి
ఏంటని!
పక్కనొ డేవడొ వొచ్హి ఏక్కడొ బాంబు పెడతాడని భయపడుతూ చావాలా!ఈ స్వతంత్రదేశం లొ ప్రశాంతం గా భతకలేమా.
మనం ఇక ప్రజాస్వామ్య పద్దతిలొ పొతే లాభం లేదు వీళ్ళు మాట వినరు మనకి ఒక హిట్లర్ లాంటి నిజంత కావాలి ,ఎక్కడొడిని అక్క తొక్కితేకాని మాటవినరు,
ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు నడచినన్నాళ్ళూ ఈదేశం బాగుపడదు!
రాహుల్ పర్యటనలొ జరిగిన ఒక అనుభవం
ఇది మాఫ్రెండ్ ఒకడు కాలేజి బంక్ కొట్టి మరీ వెళ్తె జరిగిన అనుభవాన్ని నాకు పంపాడు ,
“ నేను ఈరోజు రవీంద్ర భారతి లో అణు ఒప్పందం పై చర్చ కు వెళ్ళా, మా
ప్రశ్నలకు రాహుల్ గాంధి సమాధానాలు ఇచ్హారు అన్ని ప్రశ్నలకూ ఒకటె సమాధానం.
నేను అనుకోకుండా ఎర్ర చొక్కా వేసుకొని వెళ్ళా నన్ను ప్రశ్న అడగనివ్వలేదు,
ఈ ఒప్పందం కేవలం నయకుల ప్రయొజనాల కోసం అని నా అభిప్రాయం. గాంధీల
గొప్పతనాన్ని పొగడడమే వారి ధ్యేయం, వాళ్ళు తప్ప ఇంకెవరూ ఈ
దేశాన్నిపాలించకూడదు అని వారి ఉద్దేశం.-ఫణి కొడాలి”
ఈ-తెలుగు హైదరబాద్ సమావేశం ఏప్రిల్ 2008 నా అనుభవం.(ఫొటొలతొ)
ఈ ఎండకి ఏంవెళ్తాం అని పడుకున్నాను కాని ఎందుకొ పడుకొని చేసేది ఎముంది అని బయలుదేరాను,నేను ఆటొదిగేసరికి అప్పుడే లొనికి
వెళ్తూ కనిపించారు,చిన్నగా వెళ్ళి వళ్ళ లొ చేరాను వళ్ళలొ ఇద్దరు కొత్తవాళ్లున్నారు.

వీళ్ళే ఆకొత్తవాళ్ళు(స్వాతి గారు,చక్రవర్తి గారు)
అందరం వెళ్ళి వ్రుత్తాకారముగా కూర్చున్నాం.
ఈ సారి పెద్దగా ఎవరురాలేదు అనిపించింది,ఇంతలొ చక్రవర్తి గారు వారి బ్లాగుపేరు చెబుతుంటే నొట్ చేసుకుంటున్నాను పక్కనే వీవెన్
గారు ఈసారి కూడా నన్నే సమావేశవివరములు రాయమన్నారు సరే నని ఒప్పుకున్నాను.

కందర్బ క్రిష్ణమౌహన్ గారి పాప..
సి.బి.రావ్ గారు ‘తెలుగుబ్లాగ్ పుస్తకం’పై చర్చించారు,అందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను రాసుకుంటూకూర్చున్నాను.
ఈసారి రావ్ గారు ఎందుకొ వెనుకపడ్డారు అనిఅనిపించింది,ఈసారి మాత్రం పద్మనాభం గారిహవా కనిపించింది సమావేశం మొత్తం
మాట్లాడుతూనే ఉన్నారు ముందుగానే ప్రిపర్ అయివచ్చారనిఅని పించింది.

యుద్దానికి ముందు పద్మనాభం గారు శ్రీధర్ గారి తొ
చాలా మాట్లాడారు,etelugu ఒక organisation గా ఏర్పడాలని గట్టిగా వినిపించిన ఒక అంశం.
etelugu ముఖ్యఉద్దేశం గురించి చర్చించారు ప్రచారానికి కళాశాలలకు,విశ్వవిద్యాలయాల లకు వెళ్ళాలని అన్నారు సరే
హైదరబాద్ అయితే వెళ్దాం అనిఅనుకున్నాను.

ఫొటొ లొ మాతలకాయలపైన పేర్లు ఉన్నాయి గా చదువుకొండి
రావ్ గారిని సమాచార హక్కుచట్టం గురించి అడిగాను,భలే గా ఈరొజు ఈనాడు పేపర్ లొ వచ్హిందికదా ఇక వళ్ళని పట్టుకొవచ్హులే అనుకున్నాను.
ఎప్పటినుంచొ సమాచార హక్కుచట్టం ఉపయూగించాలని ఒక చిన్నకొరిక.
చిన్నగా సమావేశం అనంతరం బయలుదేరి టీ తాగి బయటపడ్డాం,చావా కారు లొ front seat లొ కూర్చుని ఈ హైదరబాద్ ట్రాఫిక్ లొ నానా ఇబ్బంది పడి భరత్ నగర్ లొ దిగి వెళ్ళి పొయాను!ఈ సమావేశపూర్తివివరములు http://etelugu.org లొ రాయటం జరిగినది ఇది నాసొంత అనుభవం అని గ్రహించాలి.





