జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

Archive for the ‘సమీక్ష’ Category

అకాల”నష్టం”

with 2 comments

పంటచేతికి వచ్చే సమయానికి  ముంచుకొచ్చింది మాయదారి వాన…కష్ట ఫలంకొసం గంపెడు ఆశతొ ఉన్న రైతుకు గుక్కెడు కన్నీళ్ళు మిగిల్చింది!!
అటూ ఇటూ కాని వాన మొత్తం నాశనమైపొయినా బాగుణ్ను …సగం తడిసి  రంగుమారిన ధాన్యం ఇక వీటిని అమ్మటానికి రైతులు పడే కష్టం ఉంటుంది చూడండి…తడిసిన  ఓదెలను ఎండబెట్టి ఎలాగొలా కౌలుచేసి మార్కెట్టుకు తీసుకువస్తే అక్కడ రేటు ఉండదు ఇక రైతుకు మిగిలేది అప్పే!!

కూలీ,పురుగుమందులు ఖర్చులు కూడా రావు! అర్దరాత్రి మోటర్లు వేసి నానా తిప్పలు పడితేకాని  పంట ఒక దారికి రాదు ఆ సమయం లొ వచ్చే ఇలాంటి ప్రక్రుతివైపరిత్యాలకు  భగవంతుడిని నిందిస్తూ మౌనంగా భాధపడటం  తప్ప మనం  ఏంచేయగలం  ?

కాని మాన అధికారులు ఉన్నారే నాయకుల మెప్పుకొసం  దేనికైనావెనుకాడరు! నిన్న కురిసిన  బారివర్షానికి మా  మండలంలొనే సుమారు 40వేల ఎకరం పూర్తిగా నీళ్ళలు మునిగిపొతే మాజిల్లాకు నష్టం ఏమీ లేదని చెప్పేసి చేతులుదులుపుకున్నారు…నష్టం జరిగింది అంటే మళ్ళీ సర్వే చేయటానికి ఊళ్లకి,పొలాలకి వెళ్లాలి ఈగొలంతా ఎందుకు అసలు నష్టం జరలేదు అంటే పొలా!? అది మన అదికారులపని తీరు!

ముద్ద అన్నంపెట్టే రైతు గొడు పట్టించుకునే వాడే లేకపోయ!

Written by కట్టా విజయ్

నవంబరు 18, 2008 at 1:03 పూర్వాహ్నం

సమీక్ష లో రాసారు

యువగర్జన లొ….గర్జించిన బాలాయ్య

with 6 comments

నందమూరి ముద్దుబిడ్డ…యువరత్న యువగర్జన లొ  తనదైనశైలిలొ గర్జించారు, ఉప్పొంగిన ఆవేశంతొ తెలుగు వాడి సత్తా ఏమిటొ తెలియజేశారు…

సభలొ ఆయన నేను ఎవరు ? అనేదానికి  వివరణ అద్భుతం

Written by కట్టా విజయ్

నవంబరు 7, 2008 at 1:11 పూర్వాహ్నం

రాజకీయం, సమీక్ష లో రాసారు

104 కి ఫొన్ చేస్తే వాచింది

with 4 comments

“104″ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరొగ్యసేవల సర్వీసు ఇది! మొన్న ఈమధ్య ఒక సారి దానికి కొంచం పని పడి ఫొన్ చేసాను , చేయగానే వెంటనే కలిసింది సంతొషం.

కాల్ కనెక్ట్ అవ్వగానే పేరు,ఎక్కడనుంచి ఫొన్ చేస్తున్నారు తదితర వీవరాల తరువాత ఒక నెంబరు ఇచ్చారు,తరువాత వేరే వళ్ళకి  కనెక్ట్ చేశారు,అక్కడ ఎవరొ లేడి ఎత్తింది అబ్బ ఆమె తెలుగు వింటుంటే   నాకు చిరెత్తుకొచ్చింది “మీకు ఏది కవలి” సినిమాల్లొ చూపిస్తారే తెలుగు అప్పుడప్పుడే నేర్చుకునేవళ్ళు మాట్లాడినట్టు మాట్లాడింది ఇక కాల్ అక్కడనుంచి ఇంకొకచొటికి మారింది! అక్కడ కాసేపు కొంచం దానితరువాత ఇంకొక చొటికి అక్కడ సమస్యకు సమాదానం దొరికింది!! ఇక అక్కడ నుంచి ఫైనల్ రౌండ్ మీకు టైం ఉంటే రెండు ముక్కలు చెబుతాం అన్నారు ….చెప్పమన్నాను ,భైర్రాజు ఫౌండేషన్ గురించి  చెప్పిందికాసేపు కాని తరువాత నాకు అనిపించిన విషయాలు ఏంటంటే అసలు సమాదానం కొసం ఇన్ని సార్లు వాడికి వీడికి  ఫొన్ కలపాలా! ఈలొపు రొగి పరిస్తితి ఏమిటి!
ఇంకొక విషయం సరే మాట్లాడిన తరువాత నాసెల్లు లొ బ్యాలెన్స్ తగ్గినట్టు చిపించింది! చుస్తే నిజంగానే తగ్గింది విష్యం  కనుక్కుందామని  కాల్ సెంటర్ కి ఫొన్ చేశాను మనొడు చావు కబురు చల్లగా సార్ అది ప్రీ సర్వీస్ కాదు సార్  3 రుపాయలు ప్రతినిమిషనికి చార్జ్ చేశాడు!

మొత్తం 8 నిమిషాలు !! ఇంకెప్పుడు ప్రభుత్వ సర్వీసులను   టెస్ట్ చేయకూడదని గట్టిగా నిర్నయించుకున్నాను.

Written by కట్టా విజయ్

నవంబరు 1, 2008 at 10:25 పూర్వాహ్నం

అనుభవాలు, సమీక్ష లో రాసారు

ఇప్పుడు హాట్ కేకులు బస్సు టిక్కెట్లు

with one comment

రానున్న దసరా సీజన్ కి ఇప్పటి నుంచే బస్సుటిక్కెట్లు బుకింగ్ ఊపందుకుంది,ఇంకా దసరా సుమారు ఇరవై రొజులకు పైగా ఉండగానే అందరు ముందు జాగ్రత్తగా అప్పటిరద్దిని ద్రుస్టిలొ పెట్టుకుని ఇప్పటినుంచే బుకింగ్ చేయించుకుంటున్నారు,ఇప్పటికే సగం అయిపొయినట్టున్నయి!దూరప్రయాణికులు అప్పుడు ఉరుకులు పెట్టే కన్నా ఇప్పుడే చేయించుకొవటం నయం ఇప్పుడు ముందుగా జాగ్రత్త పడక పొతే మాత్రం, ఇక ఆర్టిసి వాళ్ళు వేసే స్పెషల్ బస్సులు అవే మన సిటి లొ తిరిగే సిటి బస్సులు, పాత బస్సులు ఏమైనా ఉంటే వాటికి దుమ్ముదులిపి మన జేబులు చిల్లు లు పెట్టటానికి స్పెషల్ బస్సులపేరిట సిద్దం గా ఉంటాయి.
ఇక్కడ నిదానమే ప్రదానం” అనికూర్చుంటే కుదరదు  “ఆలస్యం అమ్రుతం విషం” అని గ్రహించాలి.
ఆల్ ద బెస్ట్.

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 16, 2008 at 1:35 పూర్వాహ్నం

సమాచారం, సమీక్ష లో రాసారు

e-తెలుగు హైదరాబాద్ సమావేశం మే-2008

with one comment

e-తెలుగు ఒక సంఘంగా ఏర్పడిన తరువాత జరిగిన మొట్టమొదటి సమావేశం ఇది!
ఈ సారి సమావేశం ఎప్పటకన్నా బిన్నముగా జరిగినది!సమయం ఇట్టేగడచిపొయినది, సమావేశం మొత్తం చాలా ఆశక్తిగా,చురుకుగా
సాగింది,కొత్తవ్యక్తుల పరిచయ కార్యక్రమాలు ముగుయగానే e-తెలుగు అధ్యక్షులు చదువరి గారు మొదటిగా సభనుప్రారంభించి e-తెలుగు గురించి వివరించారు,తరువాత పద్మనాభం గారు e-తెలుగు ఇంకా పారదర్శకముగా ఉండాలని అభిప్రాయపడ్డారు,చదువరి గారు
తెలుగు ఫాంట్లగురించి,అనువాదాలగురించి,డిక్షనరి గురించి వివరించి సభికుల అభిప్రాయాలు తేసుకున్నారు,
సి.బి.రావు గారు ఆంగ్లపద్యాల సంపుటి సభికులకు పంచారు నేను దానిపైన ఆటొగ్రాఫ్ తేసుకున్నాను.
చదువరిగారు e-తెలుగు అధికారిక వెబ్ సైట్ గా etelugu ను ప్రకటించారు!మధ్యమధ్యలొ  కొన్ని జొకులు పేలాయి,
తెలుగు బ్లాగులు e-తెలుగు లొ ఒక భాగమని అన్నారు, తెలుగు అనువాదాల గురించిన సమాచారం కొరకు తెలుగువికి లొ చూడమని వేవెన్ అన్నారు,లేఖిని,కూడలి అన్ని మనవే(e-తెలుగు) వారివే అని అన్నారు,కొత్తగా వచ్చిన కిరణ్ సభికులందరిని
ఒక ఫొటొ తేసుకుని ,తనుకూడా మాతొ  ఒక ఫొటొ దిగారు తరువాత చిన్నగా అందరం బయలు దేరాం! చిన్నగా కాసేపు పిచ్చాపాటి  మాట్లాడుకుంటూ బయలు దేరాం, ఈ సమావేశం నేను హాజరైనదానిలొ మరచిపొలేనిది!

ఇది నా అనుభవం మాత్రమే అని పాటకులు గ్రహించాలి,మేకు మరింత వివరణాత్మకమైన సమాచారం కొరకు సందర్శించండి
e-తెలుగు అధికారిక పేజి eతెలుగు

Written by కట్టా విజయ్

మే 11, 2008 at 10:14 అపరాహ్నం

తెలుగు, సమీక్ష లో రాసారు