అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ లు లూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ
త ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స
హ ళ క్ష ఱ
నెల: సెప్టెంబర్ 2007
ఆశ………….!
ప్రతి పరాజయం మళ్ళీ ప్రయత్నించటానికి ఒక కొత్త అవకాశం కలిపిస్తుంది.
నిన్నటి గురించి మర్చిపో.
నీకు తగిలిన గాయాలు ,అపజయాలు నీ మదిలోకి రానివ్వకు .
నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు.
ధైర్యంగా కలలు కను , ధైర్యంగా ప్రయత్నించు.
ఈ రోజు అందరికంటే గొప్పగా వుండటానికి ప్రయత్నించు.
మనమే నెంబర్ 1
కిడ్నాపులు,దొమ్మీలు,హత్యలు,భుతగాదాలలొ,కౌంటర్ రాజకీయా లలొ మనకిప్పుడు ప్రత్యెకస్థానం కొంచం ఒపికపడితే మనమే మనమే నెంబర్ 1.
మరిన్ని వివరములకొసం శనివారం ఈనాడు ఎడిటొరియల్ చదవండి !
ఈరొజు ఈనాడు లొ తెలుగు బ్లాగర్లు
శనివారం ఈనాడు “ఈతరం” లొ తెలుగు బ్లాగర్ల గురించి రాశాడు..వినాయకునికి నీను రాసిన ప్రార్ధన చదివినట్టున్నాడు నా బ్లాగు పేరు కూడా వచ్చింది!! నేను చాలా హ్యాపీస్..
ఓ వినాయకా..!
ఇంద్రాదిదేవతలచే కొలవబడుతూ
సర్వశక్తులను అందించే ఓ విఘ్నేశ్వరా
మా బ్లాగర్లకు
విజయాలను ప్రసాదించు.
త్రిమూర్తులను ప్రదమ పూజలతొ ఒప్పారే
ఓ ప్రమధగణాధిపతీ మా తెలుగు బ్లాగర్ల కు
మహొన్నతమైన యశస్సును అందించు.
మహర్షులచేత యజ్ఘ్నయాగాది ఫలాలను
అందుకునే ఓ వక్రతుండా తెలుగు బ్లాగుల అబివ్రుద్ది కి సహకరించు
వారికి యశస్సు చేకూర్చు.
సర్వప్రాణికొటిచే నిత్యం అర్చించబడే
ఓ లక్ష్మీగణపతీ మా అబివ్రుద్దికి సహకరించు వారికి
ఐశ్వర్యాన్ని అందించు.
భక్తజనావళి శ్రేయస్సును కొరే ఓ గజముఖ
గణపతీ మా శ్రేయౌభిలాషులందరికీ
కోరిన కోరికలను ఒసగు.
వినాయకచవితి సందర్భంగా నిన్ను
కొలిచే మా పాటకదేవుళ్ళకు(బ్లాగు చదివేవారికి) విఘ్నాలను
తొలగించి ఆయురారొగ్యాలను
అందించి అష్టైశ్వర్యాలను
ప్రసాదించవలసిందిగా ప్రార్దిస్తూ,
నీ భక్తుడు.,
విజయ కుమార్ కట్టా .
వినాయక చవితి శుభాకాంక్షలు.
నా మిత్రులకు,శ్రయౌభిలాషులకు,ప్రత్యేకముగా తెలుగు అభిమానులకు,పాటకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
సద్గురు సుభాషితం
ఇంతమంది దేవుళ్ళుండి,ఇందరు మహాత్ములు పుట్టీ ఆకలి ,బాద,రొగాలు అన్నీ ఇంకా ఎందుకు? ఈ దేశంలొని ఆకలి కీ,తిండి దొరక్కపొవడానికీ ఎవరు కారణం?ఏమాత్రం బాద్యత లేకుండా జనాబాను పెంచింది మీరా?దేవుడా?లెక్కాపత్రం లేకుండా పిల్లలని కనిపారేసి,’ దేవుడిచ్చాడు ‘ అని సిగ్గులేకుండా చెప్పకండి.బుద్దుడు,మహావారుడువంటివాళ్ళంతా జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు.తిండి పెట్టడానికి కాదు.మరి మీకు కళ్ళూ,కాళ్ళూ,చేతులూ ఎందుకు?వాటిని సరిగా చక్కగా సరిగా చక్కగా తెలివితేటలతొవాడు కుంటరనేకదా? దేవుడు అవన్ని అమర్చి మిమ్మళ్ళి భూమి మీదకు పంపించింది. అంటే తప్పు మీదే కదా!మీరు మారేదాకా,ఏ భగవద్గీత వల్లాపలితం లేదు.ఏమతమూ మిమల్ని కాపాడలేదు?దేవుడికి దణ్నం పెడుతు ఆకాశంకేసి చూస్తూ నడిస్తే ,తెరచిఉంచిన మ్యాన్ హొల్ లొ పడాల్సివస్తుంది.
దయచేసి మీ జీవితాన్ని మీ చేతులొకి తీసుకొండి,దేవునిచేతికి ఇవ్వకండి ?
ఈవారం స్వాతి సంచికనుంచి “సద్గురు సుభాషితం“