సద్గురు సుభాషితం

ఇంతమంది దేవుళ్ళుండి,ఇందరు మహాత్ములు పుట్టీ ఆకలి ,బాద,రొగాలు అన్నీ ఇంకా ఎందుకు? ఈ దేశంలొని ఆకలి కీ,తిండి దొరక్కపొవడానికీ ఎవరు కారణం?ఏమాత్రం బాద్యత లేకుండా జనాబాను పెంచింది మీరా?దేవుడా?లెక్కాపత్రం లేకుండా పిల్లలని కనిపారేసి,’ దేవుడిచ్చాడు ‘ అని సిగ్గులేకుండా చెప్పకండి.బుద్దుడు,మహావారుడువంటివాళ్ళంతా జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు.తిండి పెట్టడానికి కాదు.మరి మీకు కళ్ళూ,కాళ్ళూ,చేతులూ ఎందుకు?వాటిని సరిగా చక్కగా సరిగా చక్కగా తెలివితేటలతొవాడు కుంటరనేకదా? దేవుడు అవన్ని అమర్చి మిమ్మళ్ళి భూమి మీదకు పంపించింది.   అంటే తప్పు మీదే కదా!మీరు మారేదాకా,ఏ భగవద్గీత వల్లాపలితం లేదు.ఏమతమూ మిమల్ని కాపాడలేదు?దేవుడికి దణ్నం పెడుతు ఆకాశంకేసి చూస్తూ నడిస్తే ,తెరచిఉంచిన మ్యాన్ హొల్ లొ పడాల్సివస్తుంది.
దయచేసి మీ జీవితాన్ని  మీ చేతులొకి తీసుకొండి,దేవునిచేతికి ఇవ్వకండి ? 

ఈవారం స్వాతి సంచికనుంచి “సద్గురు సుభాషితం

3 thoughts on “సద్గురు సుభాషితం

 1. ఆత్మ“సద్గురు సుభాషితం
  మీ జీవితాన్ని మీ చేతులొకి తీసుకొండి,దేవునిచేతికి ఇవ్వకండి ?
  శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన ఒక పురము. అందులో ఆత్మ ఉంటుంది. యోగులు ఆ ఆత్మఅమృతము అంటారు. ఆత్మ తత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. పండితుడు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు. గురువులను, పెద్దలను, పండితులను పూజించడము వలన లోభమును వదిలి వేస్తాడు. ఇంద్రియములను మనసు వాయివునిగ్రహించి జయిస్తాడు. యోగి దృఢమైన మనసుతో భయాన్ని జయిస్తాడు. ఏ ఒక్క ఇంద్రియము అదుపు తప్పినా యోగి యొక్క ప్రజ్ఞ మొత్తము నాశనం ఔతుంది. కనుక ఇంద్రియములమనసు అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి.
  ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు, లోభములను పక్కన పెట్టే నేర్పు, దృఢమైన విద్య వీటి వలన కూడా పురుషుడు బ్రహ్మ పదమును పొంద వచ్చుప్రయత్న మీద ఇంద్రియములను నిగ్రహించ వచ్చు. మనస్సును నిగ్రహిస్తే ఇంద్రియము పని చేయడము మానివేస్తాయి. అప్పుడు బ్రహ్మప్రాప్తి పొందడము సులువు. బుద్ధి మన కనిపించదు, వినిపించదు కాని బుద్ధివలన మనము పరమాత్మను చూడగలము తెలుసుకోగలము
  చరాచరజగత్తులో అన్ని జీవరాశుల అందు భగవంతుడు ఆత్మ స్వరూపుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ అందు అన్ని జీవరాశులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న వాడు పరబ్రహ్మపదమును పొందగలడు.
  శరీరము మృత్యువు పొంచి ఉంటుంది యోగి మాత్రమే తెలుసుకోగలడు అమృతము. మరాణానంరము పొందే స్వర్గ లోక అదియే అమృతము. పండితుడైన వాడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఈ లోకాలను కాలము శాసిస్తుంది. కాలమును జయించిన వాడు పరబ్రహ్మ పదమును పొందగలడు.
  అటువంటి గురువులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. గురువుగులు వాటిని వదిలి వేస్తారు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు.

 2. మనం ఎవరో తెలియక తికమక పడుతూ మన చుట్టూ వున్న వాటితో మనల్ని అన్వయించుకొని ఏకత్వం చెందుతూ అవే మనం అనుకుంటూ కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న మానవ జాతిని మేలుకొలిపి మానవుడు తన నిజ స్వరూపం తెలుసుకోవటం కోసం గురువు ఎంతో కరుణ గలిగి తనను తెలిసిన కొందరిని పంపుతాడు. వారికి, వారు వచ్చిన పని తెలిసి, పంపినదెవరో తెలిసి మానవుని అభ్యున్నతి కోసం శ్రమిస్తారు. శ్రమను మరచి జాతిని ముందుకు నడిపిస్తారు. వారిని అనుసరించిన వారికి జ్ఞానమును అందించి కర్మయోగ రహస్యములను తెలిపి తిరిగి వారు సేవా మార్గములో ఎలా తరించి తమను తెలుసుకొని దైవాన్ని చేరవచ్చో ఆచరించి తెలియ పరుస్తారు. వారే సద్గురువులు. దైవానికి, సాధకునికి మద్య ఒక వారధి వలే పనిచేస్తారు.ఇటువంటి స్థితి నుండి మనలను ఉద్ధరించి సత్యము వైపు నడిపించుటకు దైవమే గురువు

 3. మానవ జీవితంపై గురువు ప్రభావం
  నిన్ను నీవు తెలుసుకోకుండా
  . గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది.
  నిన్ను నీవు తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. నీ మనస్సు యొక్క ఫలితమే, ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకో. తర్వాత జగత్తును చూడు. అప్పుడు అది ఆత్మ కంటే అన్యంగా, భిన్నంగా , విడిగా లేదని తెలుసుకుంటావు”
  గురువులు చెప్పింది నీన్ను. నీవు తెలుసుకోవడమే ఆసలెన జ్ఞాన0• తన మనస్సు ద్వారానే తాను పరమాత్మస్వరూపమని తెలుసుకొని, తన్ను తాను తెలుసుకోవటమే పరమ ధర్మం గురువు ధర్మం

  ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే ప్రపంచమంతా మాయలతో నిండి ఉన్నది. అందులో నుంచి బయటపడి మాయాతీత స్థితిని సాధించాలంటే ముందుగా ఈ రెండింటిని అధిగమించాలని చెప్పిన మహనీయులలో జ్ఞాన మార్గమే ఆత్మ స్థితికి దారి తీయగలదని ఉద్బోధించిన ఆత్మ సత్యం ఒక్కటే అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో • మనసు పునీతం దైవం అంటే మరేదో కాదు, నీలో నిక్షిప్తమైన దైవ భావన, దేవుని ఆరాధన అంటే కేవలం దేవాలయాల్లో దైవాన్ని పూజించటమే కాదు, తన్ను తాను పూజించటమే• ఆధ్యాత్మిక జీవనం అంటే లౌకిక జీవనంలోని అవకతవకలను విడనాడి దేవుడు, జీవుడు వీరి అనుబంధం సక్రమంగా అర్థం చేసుకోవడమే.అయితే నేడు ఆధ్యాత్మికత అర్థం మారిపోయింది. గుళ్లు గోపురాలు దర్శించి, చెప్పింది వినటం మాత్రమే ఆధ్యాత్మికత అని భావిస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకొని అమాయక భక్తులను మోసగించే అనైతిక గురువులు స్వాములు కూడా బయలుదేరినారు.వీరు ఆధ్యాత్మికత ముసుగులో ఎన్నో దురాచారాలు చేసి, మన వేలుతో మన కన్ను పొడుస్తున్నారు. గురువులు
  గురువు జ్ఞాని అయినవరు. మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు.నిష్కామ కర్మమ భోదించిన ఇక్కడ కర్మ చేయడమా చేయకపోవడమా అనేది ముఖ్యం కాదు.కర్మ చేస్తున్నదెవరు అని నిరంతరం ప్రశ్నించుకోవాలి.కర్మ చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావనతో చేస్తే కర్మ ఫలితాలను తప్పక
  అనుభవించి తీరాలి.చేసే కర్తను నేను కాదు,ఒక దివ్య శక్తి తనరూపకంగా ఆపని చేయిస్తున్నదని స్వయంగా తెలుసుకున్నప్పుడు ,జ్ఞాని ఎంతటి కర్మ తనద్వార జరుగుతున్న నిశ్చలంగా ఉంటాడు. జ్ఞానం కలవాడే నిజమైన .కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు. అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు జ్ఞాని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. “ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది?” అని అడిగి కాదు అని తెలుసుకోని ముందుకుసాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన గురువు ని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు. అన్యములేవీ అతనికి అక్కరలేదు!పరమాత్మ సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. . గురువు అనుగ్రహం వచ్చింది పరమాత్ముని అమృతవాక్యాలు గురువు నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గురువు పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. గురువు భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి సాక్షాత్కరించాడు గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు. శిష్యుడైన “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s