e-తెలుగు హైదరాబాదు సమావేశం అక్టొబర్ 2007

ముఖ్యవిషయములు:
సమావేశస్థలం : క్రిష్ట్ణకాంత్ పార్క్ , యూసఫ్ గూడ.
సభ్యుల సంఖ్య : 13
నూతన సబ్యులు : 1
సమావేశం ప్రారంభం : 3 గంటల 10 నిముషాలు.
విషయములు:
నేను చేరుకునేసరికి అక్కడికి వీవెన్ గారు,దుర్వాసుల పద్మనాబం గారు,నల్లమౌతు శ్రీధర్ గారు,సి.బి.రావు గారు,రాజు సైకం (నూతన పరిచయం),దాట్ల శ్రీనివాసరవు గారు,చావా కిరగారు ఉన్నారు.అప్పుడు నేను(విజయ్ కట్టా) వచ్చిగుంపులొ కలిశాను,అప్పుడప్పుడే సమావేశం ప్రారంబం అవుతుంది..తెలుగుదనం.కాం గురించి తెలుగుదుకాణం.కాం గురించి చర్చ ప్రారంభం ,చావా గారి నెట్ కనెక్షన్ గురించి విచారం … రావ్ గారు సెల్ ఫొను యొక్క కొత్త మ్రుదులయంత్రం గురించి చెప్పారు.. అది మనం పంపకుండానే మన ఫొను నుంచి వేరొకరికి మెసేజ్ లు పంపవచ్చ్హట! ఒకవేళ వస్తే తను పంపినట్టుగా బావించవద్దని చెప్పారు! ఇంతలొ వెంకటరమణ గారు వచ్చారు, ఇంతలొ చావా గారు క్రికెట్ తాజా సమాచారం 52 బంతులకు 92 పరుగులు మనం చేయాలని.
సమయం 4 గంటల 15 నిముషములు ఇంతలొ సుధాకర్ గారి రాక.సాహితి.అర్గ్ గురించి చర్చ, సుధాకర్ గారి క్రెడిట్ కార్డ్ టపాగురించిన చర్ఛ,ఇంతలొ రావు గారు త్వ్రరలొ రాయబొయే టపా “జల్లెడ జాలయ్యతొ ఇంటర్వు గురించిన” గురించి మాట్లాడారు,ఈ-తెలుగు.ఆర్గ్ ని చావా కిరణ్ మరియూ కందర్భ క్రిష్ట్నమౌహన్ ల కామెంట్,అప్పుడేఅనుకుంటా కందర్భ క్రిష్ట్నమౌహన్ గారు ,త్రివిక్రం గారు ,జాన్ హైడ్ కనుమూరి గారి రాక!
సమయం 4 గంటల 30 నిముషాలు మనం కూడా ఈ-తెలుగుకి జెండా తయారుచెయాలని చావా గారు ప్రతిపాదన దానిగురించిన చర్చ,ఊరికొకబ్లాగు ఉండాలని సుధకర్ గారు అబిప్రాయపడ్డారు! కవిత్వం గురించిన చర్చ,కవి ఇంటిమీద కాకి కూడా కవిత్వం చెబుతుందని చావా కిరణ్ గారు సామెతతొ చమత్కరించారు!కాసేపు చావా కిరణ్ గారు కవా కాదా అనె విషయం మీద చర్చ జరిగింది రావు గారు కిరణ్ గారికి ధైర్యం చెప్పారు!
ఇంగొళం అంటే ఎమిటి fueltank or fuel cell అని చర్చ జరిగింది.
సమయం 4 గంటల 41 నిముషాలు అంతా మాట్లాడుకుంటున్నారు..జాన్ హైడ్ కనుమూరి గారు పద్మనాభం గారు మౌనముగాఉన్నారు.
సమయం 4 గంటల49నిముషాలు అప్పుడు సుదాకర్ గారు “బ్లాగర్ల పొటి” ని చర్చకు పెట్టారు రావు గారి సూచన..చివరికి వర్గీకరణలు రాజకీయం,కవిత్వం,కామెడీ,జీవితం గా విభజన ఇంతలొ రావుగారి software గురించిన చర్చ,కామెంట్లను పరిగణలొ కి తీసుకొవాలని,ఏ భాషలొ నైనా రాయవచ్చునని తీర్మానం.బ్లాగులకు మార్కులు ఎలాఇవ్వాలనేదానిపైఅ చర్చ.
సమయం 5 గంటల 05నిముషములు నూతనపరిచయం రాజు గారిచే,వీరు విజయవాడ నుంచి ఈ-తెలుగు సమావేశములలొ పాల్గొనడానికి వచ్చారు,వీరు “నారాతలు” అనేబ్లాగు రాస్తూ ఉంటారు http://raju.net.in.
తరువాత domain name search గురించి eenaDu.com,airtel.com అని శొదిస్తే vodafone.com రావటం గురించిన చర్చ జరిగింది!
సమయం 5 గంటల 24నిముషములు “తెలుగు వారం” అనేగుంపు ప్రారంబించ బొతున్నట్టు చావా కిరణ్ గారి ప్రతిపాదించారు,కిరణ్ గారి కవిత్వం గురించిన చర్చ జరిగింది!
సమయం 5గంటల57నిముషాలు “తెలుగుబ్లాగర్లడే” అని కిరణ్ గారు ప్రతిపాదించారు దాని మీద చర్చ అనంతరం డిశంబరు రెండవ ఆదివారం అని అనుకున్నాం మరి కాసేపు సమావేశస్తలం గురించినచర్చ కొనసాగింది .సమయం 6గంటల10నిముషాలు అందరం చిన్నగాలేచి క్యాంటీన్ కు వెళ్ళాం అప్పుడు చావాకిరణ్ గారు అందించిన బజ్జి,చాయ్ తాగి చిన్నగా 6 గంటల 49నిముషములకు అందరం బయలుదేరాం.
ఈసారి సమావేశానికి హాజరయిన వారు:
1.వీవెన్
2.పద్మనాభం దుర్వాసుల
3.సుధాకర్
4.శ్రీధర్ నల్లమౌతుల
5.వెంకటరమణ
6.సి.బి.రావ్
7.రాజు సైకం (నూతన సబ్యులు)
8.శ్రీనివాసరాజు దాట్ల
9.చావా కిరణ్
10.జాన్ హైడ్ కనుమూరి
11.త్రివిక్రం
12. కందర్భ క్రిష్ట్నమౌహన్
13.విజయ్ కట్టా

ప్రకటనలు

3 thoughts on “e-తెలుగు హైదరాబాదు సమావేశం అక్టొబర్ 2007

 1. చిన్న సవరణలు, చేర్పులు
  > ఈ తెలుగుకు జెండాను రూపకల్పన చెయ్యాలన్న చావా ప్రతిపాదనకు స్పదించి సుధాకర్ జెండాకంటే ఊరికొక బ్లాగరైనా వుండటం ముఖ్యమని అన్నారు.

  > విజయవాడ, గుంటూరు ప్రాంతాలనుండి బ్లాగర్లు పెరగాలంటే ఏమిచెయ్యాలి అనేప్రశ్న.

  > మొదటి వీడియో బ్లాగు ఏది అనే మీమాంశ.
  –> వీడియో బ్లాగు అంటే నిర్వచించాల్సిన అవసరాన్ని బట్టి ఏది మొదటిది అనే ప్రశ్న వస్తుంది
  శ్రీధర్ బ్లాగు మొదటి వీడియో బాగు అవుతందని సుధాకర్ సమర్థన

 2. దయచేసి నన్ను కూదా మీ గ్రూపులోనికి ప్రవేశించేలా చేస్తారా…నేను హైదరాబాద్ లో
  ఉంతాను.నాకు సాహిత్యం అంటే అభిమానం ఎక్కువ.
  నా పేరు శ్రీనివాస్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s