సమాచార హక్కు చట్టం

సమాచారహక్కు చట్టం …ఇదిమన పాలకులు శాసనము చేసి సుమారు రెండు సంవత్సరములు దాటినా
(12th అక్టొబరు,2005)సరి అయినావగాహన కల్పించకపొవడంవలన ఎవరికొ కొంతమంది
మాత్రమే ఈచట్టన్ని సరీగా ఉపయోగించుకున్నారు,కొంతమందికి ప్రశ్న సరీగాలేదని తిప్పి పంపారుకూడా..!
ఈట్టాన్ని ఎలా ఉపయౌగించుకొవాలి దాని పై అవగాహనతొపాటు గా అందరికి చేరువచేసి మనపాలకులతొ
పాటుగా ప్రభుత్వయంత్రాంగాన్ని నిలదీయటానికి ‘ఈనాడు’కొద్ది రొజుల నుంచి సమాచార హక్కు చట్టం పై
ప్రజలలొ అవగాహన కలిపించటానికి ప్రయత్నిస్తున్నది.
‘ఈనాడు’ వచ్హేనెలలొ దీనికొసం ప్రత్యెకముగా ఒక వెబ్ సైట్ పెట్టబొతున్నారు? దీనిలొ నమూనాప్రశ్నలు,
ధరకాస్తు ఫారములు,సహాయకార్యక్రమములు మొదలగున్నవి ఉంటాయి.
 మనకు ఈనాడు పేపర్ బాయ్ దగ్గర  లేదా పేపరు అమ్మేవాళ్ళ దగ్గర దొరకుతాయి,వీరు జిల్లాకి ఒక సహయ
కేంద్రాన్ని పెట్టబొతున్నారు అక్కడ మనకు ప్రశ్న తయారు చేయడం దగ్గరనుంచి ధరకాస్తు నింపడంవరకు
సహాయ పడతారు..మరిన్ని వవరములకు ఇక్కడ సంప్రదించండి!
Head office :084152469999
హైదరాబాద్ లొ ఒక ఆఫీస్ కూడా ఉన్నది మూసాపేట లొ ఉన్న ఈనాడూ ఆఫీస్ లొ ఇప్పటికే ప్రారంభం అయినది
phone :040-23440309/23440339

సమాచారాహక్కు చట్టం పై పూర్తి సమాచారం కొరకు ప్రభుత్వవెబ్ సైట్ ఇక్కడ చూడండిhttp://www.persmin.nic.in/RTI/welcomeRTI.htm

ప్రకటనలు

ఈ-తెలుగు హైదరబాద్ సమావేశం ఏప్రిల్ 2008 నా అనుభవం.(ఫొటొలతొ)

ఈ ఎండకి ఏంవెళ్తాం అని పడుకున్నాను కాని ఎందుకొ పడుకొని చేసేది ఎముంది అని బయలుదేరాను,నేను ఆటొదిగేసరికి అప్పుడే లొనికి
వెళ్తూ కనిపించారు,చిన్నగా వెళ్ళి వళ్ళ లొ చేరాను వళ్ళలొ ఇద్దరు కొత్తవాళ్లున్నారు.

వీళ్ళే ఆకొత్తవాళ్ళు(స్వాతి గారు,చక్రవర్తి గారు)

అందరం వెళ్ళి వ్రుత్తాకారముగా కూర్చున్నాం.
ఈ సారి పెద్దగా ఎవరురాలేదు అనిపించింది,ఇంతలొ చక్రవర్తి గారు వారి బ్లాగుపేరు చెబుతుంటే నొట్ చేసుకుంటున్నాను పక్కనే వీవెన్
గారు ఈసారి కూడా నన్నే సమావేశవివరములు రాయమన్నారు సరే నని ఒప్పుకున్నాను.


కందర్బ క్రిష్ణమౌహన్ గారి పాప..

సి.బి.రావ్ గారు ‘తెలుగుబ్లాగ్ పుస్తకం’పై చర్చించారు,అందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను రాసుకుంటూకూర్చున్నాను.
ఈసారి రావ్ గారు ఎందుకొ వెనుకపడ్డారు అనిఅనిపించింది,ఈసారి మాత్రం పద్మనాభం గారిహవా కనిపించింది సమావేశం మొత్తం
మాట్లాడుతూనే ఉన్నారు ముందుగానే ప్రిపర్ అయివచ్చారనిఅని పించింది.

 

యుద్దానికి ముందు పద్మనాభం గారు శ్రీధర్ గారి తొ

చాలా మాట్లాడారు,etelugu ఒక organisation గా ఏర్పడాలని గట్టిగా వినిపించిన ఒక అంశం.
etelugu ముఖ్యఉద్దేశం గురించి చర్చించారు ప్రచారానికి కళాశాలలకు,విశ్వవిద్యాలయాల లకు వెళ్ళాలని అన్నారు సరే
హైదరబాద్ అయితే వెళ్దాం అనిఅనుకున్నాను.

 

ఫొటొ లొ మాతలకాయలపైన పేర్లు ఉన్నాయి గా చదువుకొండి

రావ్ గారిని సమాచార హక్కుచట్టం గురించి అడిగాను,భలే గా  ఈరొజు ఈనాడు పేపర్ లొ వచ్హిందికదా ఇక వళ్ళని పట్టుకొవచ్హులే అనుకున్నాను.
ఎప్పటినుంచొ సమాచార హక్కుచట్టం ఉపయూగించాలని ఒక చిన్నకొరిక.
చిన్నగా సమావేశం అనంతరం బయలుదేరి టీ తాగి బయటపడ్డాం,చావా కారు లొ front seat లొ కూర్చుని ఈ హైదరబాద్ ట్రాఫిక్ లొ నానా ఇబ్బంది పడి భరత్ నగర్ లొ దిగి వెళ్ళి పొయాను!ఈ సమావేశపూర్తివివరములు http://etelugu.org లొ రాయటం జరిగినది ఇది నాసొంత అనుభవం అని గ్రహించాలి.