‘రంగు’ మార్చిన ‘ఈనాడు’

ఈ రొజు ఈనాడు లొ ఏదొకొత్త తేడా కనిపించింది! ఏంటా అని మళ్ళీ తిరగేశా  చివరికి పట్టేశా ఎమి లేదు మనొడికి రంగులపిచ్హి పట్టినట్టుంది అన్ని పేజీలు రంగులతొ నింపేశాడు! కలర్ ఫొటొలు కాదులెండి శీర్షికలు మాత్రమే!!

ప్రకటనలు

5 thoughts on “‘రంగు’ మార్చిన ‘ఈనాడు’

  1. సాక్షి దెబ్బ ఎంతో కొంత తగిలింది అనుకుంటా. ఇంకో విషయం ఏమిటంటే ఇంతకు ముందు రామోజీ కి వ్యతిరేకంగా ఉండే ఏ వార్తా ఐనా ఈనాడు లో రాసేవాళ్ళు కాదు కానీ ఈరోజు “ఉషోదయా ఎంటర్ ప్రైజెస్” గురించి కొంత న్యూస్ ఉంది. అయినా రంగులు చూసి పేపర్ ఎవడైనా కొంటే అంతకన్నా మూర్ఖుడు ఎవడూ ఉండడు.

  2. అయితే మనమందరమూ గమనించవలసిన విషయం ఒకటుంది,సాక్షి పేపర్ పెట్టక ముందే ఈనాడు వాడు పేపర్ మొత్తం కలర్ గా కనిపించాలని విడిగాఇచ్చే వసుంధర ని మొత్తం పేపర్ లొ కలిపేశాడు !! అయితే ఇదొక ప్రయోగమేకాని దేనికొసమౌ చేసింది అని నేను అనుకొను ?
    అయితే chaks చెప్పినట్టు రంగులు చూసి పేపర్ ఎవడైనా కొంటే అంతకన్నా మూర్ఖుడు ఎవడూ ఉండడు ఈ విష్యం రామౌజీ కి కూడా తెలుసనుకుంటా!

  3. ఈ రంగుల గొడవేంటో!! అసలు, తెలుగులో ఆదివారం అనుబంధాలు, జిల్లా ఎడిషన్లు, రంగుల్లో ప్రచురణలు లాంటివి మొదలెట్టిందే ఈనాడు కదా. ఇరవయ్యేళ్ల క్రితమే ఆంధ్రజ్యోతి, ఉదయం ప్రతి శుక్రవారమూ సినిమా ప్రకటనలని రంగుల్లో ఇస్తుండేవి. అప్పట్లో ఈనాడు మొత్తం నలుపు-తెలుపు లో ఉండేది. 1988లో అనుకుంటా, హఠాత్తుగా ఈనాడుకి రంగు పడింది. వన్ ఫైన్ మోర్నింగ్, మొదటి, చివరి, సినిమా పేజీలు రంగుల్లో ముద్రించటం మొదలెట్టారు. ఇప్పుడు సాక్షి దాన్నే ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి అన్ని పేజీలూ రంగుల్లో వెయ్యటం మొదలెట్టింది. గమనించాల్సిందేమంటే, ఆంధ్రజ్యోతి – ఉదయం రంగుల దెబ్బ తట్టుకోటానికి ఈనాడు రంగుల ప్రచురణ మొదలెట్ట లేదు. నలుపు తెలుపుల్లో ఉన్నా ఈనాడు నంబర్ వన్ స్థానానికేమీ ఢోకా రాలేదు. వీళ్ళు రంగుల్లోకి దిగేసరికి ఉదయం రంగంలోనే లేకుండా పోతే, ఆంధ్రజ్యోతి బితుకు బితుకు మంటూ బండి లాగిస్తుంది. కాబట్టి, రంగులద్దినంత మాత్రాన పేపర్ అమ్మకాలు పెరగవని రామోజీకి ఎవరూ చెప్పాల్సిన పని లేదనుకుంటా.

    http://anilroyal.wordpress.com
    http://anilroyal.blogspot.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s