అకాల”నష్టం”

పంటచేతికి వచ్చే సమయానికి  ముంచుకొచ్చింది మాయదారి వాన…కష్ట ఫలంకొసం గంపెడు ఆశతొ ఉన్న రైతుకు గుక్కెడు కన్నీళ్ళు మిగిల్చింది!!
అటూ ఇటూ కాని వాన మొత్తం నాశనమైపొయినా బాగుణ్ను …సగం తడిసి  రంగుమారిన ధాన్యం ఇక వీటిని అమ్మటానికి రైతులు పడే కష్టం ఉంటుంది చూడండి…తడిసిన  ఓదెలను ఎండబెట్టి ఎలాగొలా కౌలుచేసి మార్కెట్టుకు తీసుకువస్తే అక్కడ రేటు ఉండదు ఇక రైతుకు మిగిలేది అప్పే!!

కూలీ,పురుగుమందులు ఖర్చులు కూడా రావు! అర్దరాత్రి మోటర్లు వేసి నానా తిప్పలు పడితేకాని  పంట ఒక దారికి రాదు ఆ సమయం లొ వచ్చే ఇలాంటి ప్రక్రుతివైపరిత్యాలకు  భగవంతుడిని నిందిస్తూ మౌనంగా భాధపడటం  తప్ప మనం  ఏంచేయగలం  ?

కాని మాన అధికారులు ఉన్నారే నాయకుల మెప్పుకొసం  దేనికైనావెనుకాడరు! నిన్న కురిసిన  బారివర్షానికి మా  మండలంలొనే సుమారు 40వేల ఎకరం పూర్తిగా నీళ్ళలు మునిగిపొతే మాజిల్లాకు నష్టం ఏమీ లేదని చెప్పేసి చేతులుదులుపుకున్నారు…నష్టం జరిగింది అంటే మళ్ళీ సర్వే చేయటానికి ఊళ్లకి,పొలాలకి వెళ్లాలి ఈగొలంతా ఎందుకు అసలు నష్టం జరలేదు అంటే పొలా!? అది మన అదికారులపని తీరు!

ముద్ద అన్నంపెట్టే రైతు గొడు పట్టించుకునే వాడే లేకపోయ!

ప్రకటనలు

నా ఫొటొతొ చిన్న ప్రయౌగం…

ఈ నాఫొటొ లని చూడండి…………..

photofunia_1e68

photofunia_485a

photofunia_24987

ఇంకా ఇలాంటివి చాలాచేశాను ..ఇక్కడ చూడండి..http://www.flickr.com/photos/9085936@N08/

మీరూ మీ ఫొటొలను పైవాటి లాగా మార్చుకొవచ్చు….ఇక్కడ నొక్కండి http://www.photofunia.com పండగచేసుకొండి

నవంబర్23న ఖమ్మంలో “మనకోసం-తెలుగుదేశం” సదస్సు

తెలుగుదేశంకి మద్దతుగా పోరాటాల ఖిల్లా “ఖమ్మం” జిల్లాలో జిల్లాలో యువ ఇంజనీర్లు మరియు స్టూడెంట్స్ ఆద్వర్యం లో “మనకోసం-తెలుగుదేశం” సదస్సు……..
రాష్ట్రంలో జరుగుతున్న ముందు చూపులేని అవినీతి ,బంధుప్రీతీ ,రాక్షస పాలనతో విసుగు చెందిన యువత,మనవీయకోనంలో ఆర్ధిక సంస్కరణలను అమలుపరిచి ,ప్రజాపాలనను ప్రజల ముందు నిలిపిన చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన వేత్త అధికారంలోకి రావాలని యువత కోరుకుంటుంది. తమవంతు కృషిగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబు గారి నాయకత్వానికి స్వచ్చందంగా మద్దతు తెలియచేయుటకు మరియు యువతని చైతన్య పరుచుటకు , ఖమ్మం జిల్లాలోయువ ఇంజనీర్లు మరియు స్టూడెంట్స్ ఆద్వర్యం లో “మనకోసం-తెలుగుదేశం “పేరుతో “మేలుకో యువత–కాపాడుకో రాష్ట్ర భవిత “నినాదంతో నవంబర్23న “ఖమ్మం”లో ఒక సదస్సు నిర్వహించ దలచినాము.

ఖమ్మం జిల్లాలో జరుపుటకు తలపెట్టిన ఈ మనకోసం-తెలుగుదేశం సదస్సు నిర్వహణలో పాలుపంచుటకు ఉత్సాహం వున్నా యువతి , యువకులు , manakosamtelugudesam@gmail.com కి మెయిల్ చేయగలరు .

మరియు , ఈ మనకోసం తెలుగుదేశం సదస్సుల సమాచారంని, రాష్ట్రం లోని ప్రతి కాలేజి లో వున్నా మన స్నేహితులు , బందువులకు పంపవలసినదిగా మనవి చేస్తున్నాము.
రండి….తరలిరండి
పోరాటాలకు గుమ్మం మన “ఖమ్మం” లో యువశక్తి ని చాటుదాము ……

వేదిక:
ఒయాసిస్ గార్డెన్సె ,
ఖమ్మం.

సమయం: 2:00 pm నుంచి

యువగర్జన లొ….గర్జించిన బాలాయ్య

నందమూరి ముద్దుబిడ్డ…యువరత్న యువగర్జన లొ  తనదైనశైలిలొ గర్జించారు, ఉప్పొంగిన ఆవేశంతొ తెలుగు వాడి సత్తా ఏమిటొ తెలియజేశారు…

సభలొ ఆయన నేను ఎవరు ? అనేదానికి  వివరణ అద్భుతం

యువగర్జన – ఖమ్మం – ర్యాలి

నామా నాగేశ్వరరావు గారి ఆద్వర్యములొ ఖమ్మం నుంచి సుమారు 3000 పైచిలుకు ద్విచక్ర వాహనాలు బయలు దేరాయి ,మాజిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు,మార్గం  మధ్యలొ వైరా,మధిర,మధ్య గ్రామాలలొ ఇంకాకొన్ని వాహనాలు వచ్చి చేరుతాయి!

ర్యాలి ప్రారంభ వీడియొ ఇక్కడ

104 కి ఫొన్ చేస్తే వాచింది

“104” రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరొగ్యసేవల సర్వీసు ఇది! మొన్న ఈమధ్య ఒక సారి దానికి కొంచం పని పడి ఫొన్ చేసాను , చేయగానే వెంటనే కలిసింది సంతొషం.

కాల్ కనెక్ట్ అవ్వగానే పేరు,ఎక్కడనుంచి ఫొన్ చేస్తున్నారు తదితర వీవరాల తరువాత ఒక నెంబరు ఇచ్చారు,తరువాత వేరే వళ్ళకి  కనెక్ట్ చేశారు,అక్కడ ఎవరొ లేడి ఎత్తింది అబ్బ ఆమె తెలుగు వింటుంటే   నాకు చిరెత్తుకొచ్చింది “మీకు ఏది కవలి” సినిమాల్లొ చూపిస్తారే తెలుగు అప్పుడప్పుడే నేర్చుకునేవళ్ళు మాట్లాడినట్టు మాట్లాడింది ఇక కాల్ అక్కడనుంచి ఇంకొకచొటికి మారింది! అక్కడ కాసేపు కొంచం దానితరువాత ఇంకొక చొటికి అక్కడ సమస్యకు సమాదానం దొరికింది!! ఇక అక్కడ నుంచి ఫైనల్ రౌండ్ మీకు టైం ఉంటే రెండు ముక్కలు చెబుతాం అన్నారు ….చెప్పమన్నాను ,భైర్రాజు ఫౌండేషన్ గురించి  చెప్పిందికాసేపు కాని తరువాత నాకు అనిపించిన విషయాలు ఏంటంటే అసలు సమాదానం కొసం ఇన్ని సార్లు వాడికి వీడికి  ఫొన్ కలపాలా! ఈలొపు రొగి పరిస్తితి ఏమిటి!
ఇంకొక విషయం సరే మాట్లాడిన తరువాత నాసెల్లు లొ బ్యాలెన్స్ తగ్గినట్టు చిపించింది! చుస్తే నిజంగానే తగ్గింది విష్యం  కనుక్కుందామని  కాల్ సెంటర్ కి ఫొన్ చేశాను మనొడు చావు కబురు చల్లగా సార్ అది ప్రీ సర్వీస్ కాదు సార్  3 రుపాయలు ప్రతినిమిషనికి చార్జ్ చేశాడు!

మొత్తం 8 నిమిషాలు !! ఇంకెప్పుడు ప్రభుత్వ సర్వీసులను   టెస్ట్ చేయకూడదని గట్టిగా నిర్నయించుకున్నాను.