భార్గవి హత్యొధంతం పై tv9 వార్తా కధనశైలి

…ఒక సినీనటి భార్గవి  హత్య..మీడియా కవరేజీ….పొద్దుటినుంచి ఇదే మన తెలుగు మీడియా లొ ప్రదాన వార్త !

అన్ని  చానళ్ళకు ఈరొజు ఇదే ప్రదాన వార్త ! ఒక్కొకరిది ఒకొక్క శైలి, ఇప్పుడు నేను ఇక్కడ టి.వి 9 గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను.ఎందుకంటే వాళ్ళు చేసినహడావిడి అందరూచేశారు(tvల వాళ్ళు) కాక పొతే వీళ్ళు  తేడా కదా! నాకు అని పించినతేడాలేంటి అంటే..

వెనుక భాగం లొ ఒక చాయాచిత్రం పెట్టి దానికి ఒక దండ వేసి …హత్య పై తమదైన శైలిలొ విశ్లేషణలు …

ఇక వార్తకి వద్దాం ..

–>నగరం లొ ప్రముఖ సినీనటి దారుణ హత్యతొ సినీపరిశ్రమ ఉలిక్కిపడింది?(ఇక్కడ ప్రముఖ నటి ఎవరొ, దీనితొ పరిశ్రమ ఎలా ఉలిక్కిపడ్డ  దొ నాకు అర్దం కాలేదు?) అసలు సినీపరిశ్రమ ఉలిక్కిపడేంత సంఘటన అక్కడ ఏం జరిగిందని !!

–>ఇక రెండవది ఇది మన తెలుగువారందరికి మండే విషయం….ఆ మహాతల్లి  ఎవరొకాని , భార్గవి గురించి చెబుతూ ” ఈమె మంచి ప్రవర్తనతొ ఇప్పుడిప్పుడే పరిశ్రమలొ ఎదుగుతున్న ఆరు అణాల ….పదహారు అణాల తెలుగమ్మాయి” అని అంది!

–>ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందొ అక్కడ మావిలేఖరిని అడిగితెలుసుకుందాం అని వాళ్ళ విలేఖరిని  చూపించారు..ఇక పిచ్చొడి చేతికి రాయిచ్చినట్టుంది  అప్పుడు పరిస్థితి…అసలు సంభందమేలేని విషయాలు  చెబుతూ అసలు విషయాన్ని ఎటుంచి ఎటొ తీసుకెళ్ళింది వాళ్ళ ప్రతినిధి! ఇక్కడ చిన్న కొసమెరుపేంటంటే…ఒక సుమారుగా 3 నుంచి 4 నిమిషాలు విడివిగల చిత్రాన్ని(విలేఖరి మాట్లాడి నది) అదే మళ్ళీమళ్ళీ తిప్పుతూ వెనుకాలా వాయిస్ ని మార్చి అప్పుడు అక్కడ జరుగుతున్నదే చుపిస్తున్నట్టు  నమ్మించేప్రయత్నం  చేశారు ?

ఇక నాకు అప్పుడు అని పించిందేమిటంటే నిన్న పంది….ఈ రోజు ఈసంఘటన చాలు ఒక రేండు రొజులు పండగ చేసుకొవడానికి  …

ప్రకటనలు

13 thoughts on “భార్గవి హత్యొధంతం పై tv9 వార్తా కధనశైలి

 1. అప్పుడే ఏమయ్యింది..ఇంకొకరోజాగి చూడండి TV9లో క్రైం రిపోర్ట్ ప్రోగ్రాంలో మాంచి రసవత్తరంగా వివరిస్తారు భార్గవి ఎలా చనిపోయిందో..

  TV మీడియాలా ఇలాంటివిషయాలకు మన బ్లాగుల్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వుంటే బావుణ్ణు

 2. ఇలా అత్యుత్సాహం ప్రదర్శించటం మీడియా కు మాములేకాని ఇవాళ కాస్త అతిగా జరిగింది , మొదట tv9 లో భార్గవికి కుమరుడున్నట్లుగా కుడా చెప్పారు కాని దాని వుసు తరువాత లేదు

 3. I didnt see TV9 till a month back, all I used to listen from other sources about TV9.
  But I happen to see this channel online lately..
  I hate to find that they make peanuts of news into the coconuts..
  The lady anchor (I guess her name is Haritha) always uses very bad Telugu language to give an impression that she is a smart Telugu language expert.
  The new reports talks all BS (The holy KHOW’s Male version Thingy)… They repeat the really unrelated things to the context of the situation that they are talking about.
  This news reader reads and talks the same lines, before, after and in the middle of the remote news reporter crappy reporting..

  Coming to that Crime Reporter (I guess name is Harshavardhan).. My 3 years old baby cries to her lungs when this guy shows up on the screen. The good part is .. when my baby didnt drink her milk, I always scar her that I will put that Crime Report program on the screen. She runs into another room and drinks the milk ..:-) Thanks Harsha… for your crappy expressions (Telugu lo Dikkumaallina Haava Bhaavalu, Thokka loni Aaharyam.. etc.. )

 4. ఘనత వహించిన ఐడిల్‌బ్రెయిన్ వారు డిజిటల్ కెమెరా ఒహటి చేతిలో ఉంది కదా అని కనపడ్డ చెత్తంతా నొక్కి పారేసి వందలకొద్దీ ఫొటోలు వాళ్ల సైట్లోకెక్కించేస్తుంటారు. అదే పైత్యంతో వీరు భార్గవి మరియు ఆమె (మాజీ) ప్రియుడి మృతదేహాలని కూడా టపటపా ఫొటోల్లాగేసి అన్నిట్నీ యధాప్రకారం వాళ్ల పనిలేనిబుఱ్ఱలోకెక్కించి పారేశారు. దేన్ని చూపాలో దేన్ని కూడదో తెలీదు. ఇదీ మన జర్నలిజం.

 5. మరేమీ అనుకోకండి, పత్రికలలో ఈనాడు ఎంత ప్రమాదకరమైనదో, టీవీల్లో టీవీనైన్ అంతే ప్రమాదకరమైనది. చాలా జాగ్రత్తగా వుండకపోతే కొంపలు మునిగిపోతాయి. ముఖ్యంగా యువతీ యువకులు ఈ రెండింటినీ ఫాలో అవుతున్నపుడు మనం వారిని అపుడపుడూ హెచ్చరిస్తుండాలి. మరికొన్ని ఇతర మీడియాతో చెక్ చేసుకోమంటూ వుండాలి.

 6. ఈ ఛానెల్ కి ఏ వార్త దొరికినా దాన్ని పది రోజులు చూపించడం కొత్తేం కాదు! అందరి కంటే ముందు వార్తను చూపించాలన్న దురద వల్ల లేని పోని అబద్ధాలు ప్రచారమవుతున్నాయి. ముందేమో
  భార్గవి ఆత్మ హత్య….
  మరో ఐదు నిమిషాలకు “భర్త తో కలసి ఆత్మహత్య….”
  మరో ఐదు నిమిషాలకు “నాలుగేళ్ళ క్రితమే పెళ్ళయిన భార్గావికి ఒక కొడుకు”(కనీసం పోలీసులన్నా రాకముందే ఇన్ని విషయాలు కనిపెట్టారు)
  మరో ఐదు నిమిషాల్కు “అతడు భర్త కాదు, మేనమామ”
  మరి కాసేపటికి “మేనమామ కాదు ప్రియుడు…” అబ్బో, చెప్పలేం వీళ్ళ కళలు!

  చుట్టు పక్కల వాళ్ళని అడిగే ప్రశ్నలు చూడండి “భార్గవి ఎలాంటిది? ఆమె ఇంటికి మగవాళ్ళు వస్తుండే వారా? రాత్రి వేళ కూడా వస్తుండే వారా?”
  ఇలా…!
  ఈ ఛానెల్ చాలా చాలా ప్రమాదకరమైనది. కానీ చూడొద్దంటే కుదరదు. ఇలా తిట్టిపోసుకోడానికైనా చూడాల్సిందే!

  అంతకు ముందు వరాహ ప్రదక్షిణాన్ని, పాము ప్రహసనాన్ని కూడా హెడ్ లైన్స్ లో చూపి చంపేసారు రెండు రోజులు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s