తెలంగాణ-ఆంధ్ర (ఒక ప్రేమ కధ)

 

గమనిక : ఇది నాకు ఫార్వర్డ్ మైయిల్ ద్వారా వచ్చింది , ఇది నా స్వంతం కాదు గమనించగలరు.

ఇది ఒక వింత ప్రేమ కధ
అనగనగా ఒక అమ్మాయి.పేరు తెలంగాణతిలోత్తమ. నిజాం ఆమె మేనమామ. బలవంతంగా తన కొడుకు కి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఇష్టం లేని పెళ్ళి. దానికి తోడు అనుమానాలు, అవమానాలు! బలవంతపు పెళ్ళి కి ప్రతిఫలం కొడుకు హైదర్. మనవడిని చాలా ప్రేమ గానే చూసుకునేవాడు నిజాం.తెలంగాణతిలోత్తమ రక్త స్వేదాలు కూడా పిండి, మనవడి ముద్దు ముచ్చటలు తీర్చే వాడు.తన ప్రాణాలు తోడే సేటంతగా మామ గారికి తన కొడుకు మీద అంత ప్రేమ అని ఆనందించాలో , లేక ఈ నరకం నుండీ బయట పడటానికి తన ప్రాణాలే తీసుకోవాలో తెలిసేది కాదు తెలంగాణతిలోత్తమ కి. ఎలా అయినా అక్కడ నుండి విముక్తి పొందాలని అనుకుంది.ఒక రోజు ఆమె బయటకి వచ్చేసింది.
ఆంధ్రా ఆనందం ఆ యువకుని పేరు. తమిళ తంబి కి సవతి తమ్ముడు. తనకి వ్యాపారం లో సరైన స్థానం ఇవ్వలేదు అని తమిళ తంబి తో తెగతెంపులు చేసుకుని బయటకి వచ్చేసాడు. ఒక కొత్త జీవితం మొదలు పెడదామని బయలుదేరిన అతడికి వూరి బయట శివాలయం ఎదురుగా తెలంగాణతిలోత్తమ కనిపించింది.ఒకరి కష్టాలకు ఒకరు ఓదార్పు చెప్పుకున్నారు. శివాలయం పూజారి వారిని భార్యాభర్తలగా పొరబడి దీవించాడు. ఆంధ్రాఆనందంకి కూడా అప్పటి వరకు లేని ఆలోచన కలిగింది, తెలంగాణతిలోత్తమని పెళ్ళి చెసుకుందామని! కాని అప్పటికే నిజాం కొడుకు తో విఫలమైన వివాహం వలన తెలంగాణతిలోత్తమ వెనుకంజ వేసింది. ఒంటరిగా వుండటమే తనకి ఇష్టం అంది. కాకపోతే కొంతసేపు ఆలోచించి కొన్ని షరతులు పెట్టింది. తన పుట్టినింటివారికి తోడ్పాటు అందులో ఒకటి. తన కొత్త వ్యాపారం లో తన వారికి భాగస్వామ్యం, ఇంకా తన వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడడానికి ఏమైతే అవసరం అవుతాయో అవన్ని కలిపించమని అడిగింది. ఆంధ్రాఆనందం ఒప్పుకున్నాడు ఆనందం గా?
కొత్త కాపురం కొన్నాళ్ళు వరకు బాగానే వుండేది. హైదర్ ని కూడా చాలా బాగా చూసుకునేవాడు. “హైటెక్” ఇంఫర్మేషన్ టెక్నాలజి చదివించాడు. అయితే పెళ్ళి కొత్తలో తెలంగాణతిలోత్తమ కి ఒకసారి ఆంధ్రాఆనందం మీద కోపం వచ్చింది. పుట్టినింటికి వెళ్ళిపోతాను అంది. కారణం: తన పుట్టినింటివారు ఇంకా వారి కాళ్ళ మీద నిలబడలేదు అని, అయినా ఆంధ్రాఆనందం తోడ్పాటు ఇవ్వడం ఆపేసాడు అని ఆమె ఆరోపణ. మరి ఆంధ్రాఆనందం చెప్పేదేమిటంటె ఇలాంటి తోడ్పాటు వారి క్షమతని తగ్గించివేస్తుంది, వారి బాగు కోసం, వారు సొంతంగా ఎదగాలని ఎవరి మీద ఆధారపడకూడదని తాను డబ్బు పంపడం మానేసాడు అని. కాని ఆమె మన్సులో ఒక అనుమానపు బీజం! నిజంగా తనని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడా? తన వాళ్ళ బాగు పట్టించుకునే వాడేనా? ఏమయితేనెమి? ఇద్దరు సద్దుమణిగి సంసారం సాగించారు. అయితే…….
నడి వయసు కి వచ్చిన వారిద్దరి సంసారం లో చిచ్చు పెట్టేటందుకు వచ్చిన విలన్ మాయల ఫకీరు ముక్కు చంద్రం. తెలంగాణతిలోత్తమ కి మేనమామ తరపు బందువు. ఆమెకి కూడా ముక్కు చంద్రం అంటే ఏ రోజు మంచి అభిప్రాయం లేదు. వాడు పరమ స్వార్ధపరుడు అని ఆమె కి తెలుసు. ఆమె కి ఆంధ్రాఅనందం మీద లేనిపోని అనుమానాలు రేకెత్తించేవాడు. వారు విడిపోతె ఆమె పంచన చేరి ఆమె సంపద కొల్లగొడదామని వాడి ప్లాను. శేఖరం అనే పెద తాత వున్నంత కాలం మాయల ఫకీరు ముక్కు చంద్రం మంత్రాలు పారలేదు.కాని శేఖరం తాత మేడ మీద నుండి పడిపోయి చనిపొయాడు.
శేఖరం తాత చనిపొయాక ఆంధ్రాఆనందం ఇంట బయట పరిస్థితులు చాలా మారిపోయాయి. కలత చెందిన అతడు కొంచెం ముభావం గా వుండేవాడు. ఇదే అదను గా ముక్కు చంద్రం కుట్ర పన్నాడు.తెలంగాణతిలోత్తమ మన్సు విరిచేసాడు. తెలంగాణతిలోత్తమ పిన్ని పిల్లల్ని సివిల్స్ చదివించినా, ఆంధ్రాఆనందం తరపు వాళ్ళకి చదివించిన ఇంజనీరింగ్ మాత్రమే గొప్పని వూదరగొట్టెవాడు ముక్కు చంద్రం. సంపాదించినదంతా వాళ్ళ చుట్టాలకే పెడుతున్నాడని బాదపడెవాడు.మన జాతి ఏంటి ,కులం ఏంటి? వాళ్ళ జాతి కులం ఏంటి అని విభేదాలు కలిపించేవాడు. నీ నగలు నట్రా అంతా అమ్మి ఇంత వ్యాపారం పెంచగలిగాడని అబద్దాల తో చెవి తినేవాడు.
అవును నిజమే! వ్యవసాయానికి అనువు కాని చోట ఎవరు పొలం దున్నరుగద!తన వాళ్ళకి మట్టి పిసకడమె వచ్చు. అందుకె వాళ్ళకి పొలాలు, సాగు నీటి సాయం చేసాడు. లెక్కలు వచ్చు కనుక ఇంజినీరింగ్ చదివించాడు.అలాగే తెలంగాణతిలోత్తమ చుట్టాల పిల్లలికి సివిల్స్ కోచింగ్ ఇప్పించాడు.ఆంధ్రాఆనందం ఆమె తరపు వాళ్ళని తన వాళ్ళగా భావించి చేపల చెరువులు కట్టించి ఇచ్చాడు.
కాని మాయల ఫకీరు ముక్కు చంద్రం మంత్రాలు పని చెసాయి.తెలంగాణతిలోత్తమ కి ఇప్పుడు ఆంధ్రాఆనందం మీద నమ్మకం లెదు.విడిపోదాము అనుకుంటుంది. కొడుకుగా హైదర్ మీద పూర్తి హక్కు తనదే అంటుంది!వారి సంసారం లో చోటు చేసుకున్న అపోహలు దూరం చెయ్యగలరా ఎవరైనా? మీరేమైనా ఆమె కి సలహా ఇవ్వగలరా?…………

ప్రకటనలు

వీళ్ళు ఏ రకం అమ్మాయిలు……!

పాటకులకు,

ఇక్కడ  ఇంతకముందు ఒక వీడియౌ ఉంచాను , అది నలుగురు తెలుగు అమ్మాయిలు కలిసి బీరు తాగుతున్నారు అది విషయం.

కొంతమంది అభిప్రాయం మేరకు దాన్ని తొలగించడమైనది!

కాని కొంతమంది వ్యాఖ్యలు నాకు చాల భాధ కలిగించాయి…! అమ్మాయిలు తాగటం తప్పుకాదట! వెనుకేసుక్కొచ్చారు … మరి వీళ్ళు తాగే వాళ్ళు వాళ్ళ సొంతవాళ్ళైతే ఏం చేస్తారొ మరి .. వళ్ళకేతెలియాలి.

అమ్మాయిలు తాగటం అనెది మన సాప్రదాయం కాదని నా భావన , అలాగని  మగవాళ్ళే తగాలని కాదు !
అంతెందుకు ఒక ఇంట్లొ మగాడు తాగితే  నలుగురు నవ్వు కుంటారు …. అదే పని ఒక ఆడది చేస్తే  ఊస్తారు .

ఇంకా మన సమాజం  ఆడవాళ్ళు కుడా తాగితే పర్లేదులే అనుకునే స్తాయికి దిగజారలేదు … అందుకే ఇలా అన్నాను .
కాని సొదరులు కొందరు తమ తమ హీరొ యిజాన్ని చూపించటానికి అదేదొ తప్పు కాదు అని మాట్లాడారు  , కాని నేను దేని గురించి  మాట్లదుతున్నానొ కుడా గుర్తించలేకపొయారు! నేను తాగుతూ అలా వీడియొ తీస్తు చేసె సెకలకి పెడితే , వీళ్ళే మొ నేనేదొ వీళ్ళని  తిడుతున్నట్టు ఫీలైపొయారు.

దయచేసి వ్యాఖ్య రాసేముందు ఒకసారి అసలు టపా దేనిగురించొ చూసుకొని రాయండి, అంతగా మీ హీరొయిజం చూపించుకొవాలనుకుంటే మీ బ్లాగులొ రాసుకొండి.

చిత్తగించవలయును!

కేసీఆర్ … "నీకు గోరికడతాం కొడక" … నీ (క్రాంతి) – సేకరణ

ఇప్పుడు సమాధులు మాట్లాడుతున్నై…!,
రాత్రికిరాత్రి తెలంగాణ నిద్రలేచి
కాళ్ళ కింద గతాన్ని తోవ్వు కుంటాండి,
సాయుధ పోరాట గమనాన్నీ గుర్తుకు తెచ్చు కున్తన్ది !
ఒక "బద్మాశ్ గాడి మాట" మృతవీరుల
ఆత్మని తూట్లు తూట్లు జేస్తన్నది..!
ఇప్పుడు నేను చరిత్ర తెలియనోని నాల్కను గొసకపొయి
కామ్రెడ్ "రావి నారాయణ రెడ్డి" సమాధి ముందు బెట్టాల..
బానిసల్ని జేసినోని బూజానెక్కి "ఓటు" కోసం
నీతిమాలిన మాటలో డి కంట్లో వరంగల్లు కారం జల్లాల..!
ఈ గద్ద ముక్కొడికి
గెరిల్లా యోధుల గుండె మంటలేం దెల్సు?
అరె.. గుండెలు మండిపోతున్నైరా.. ఎలా తట్టుకునేదీ మాటలు
ముఖ్దూంసాబ్, బద్దం ఎల్లా రెడ్డి, చాకలి అయిలమ్మ, తమ్మారపు గోవిందు
మళ్లీ చంప బడ్డార్రా…. బిడ్డ
వాడిని క్షమించొద్దు..!
నీ "బాన్చనన్నా" బతుకులు కూల్చబడ్డది,
నీ "కాల్మోక్థ" అన్నా చెరచబడ్డ ఆడది
వాడికేం తెల్సు????
పోరాటం కోసం బతుకుని బుల్లెట్లకు దారాబోసినోళ్ళు,
ఆజాదీ కోసం గుండెల్లో గుళ్ల వర్షం కురిపిచ్చుకున్నొళ్ళు,
మాతాత పక్కతెముకలు కుప్ప చేసిన బూట్లదెబ్బలు,
గిరిప్రసాద్ రొమ్ము చీల్చిన బుల్లెట్ సంగతి,
చిట్యాలలో నర మేధం..
వాడికేం తెల్సు???
వోరేయ్ శవ సంభోగి……
నీ మాటలు విన్నాక కాటికి కాల్జాపిన మా జేజి "కాంద్రించి ఉమ్మింది",
పక్షవాతంలోనూ మాతాత "పళ్ళు గొరికిందు" ,
"నిజాం (నిరంకుశత్వాన్ని) ని వెయ్యిసార్లు పోగుడ్థా" అన్న నీ ఫోటో ఉన్న పేపర్ మీద
మా పిలగాడు "ఉచ్చ బోస్తన్నాడు"
ఉద్యమ నేత ముసుగ్గప్పుకున్న తాగుబోతొన్ని, బుధ్ధిహీనున్ని,
మా గుండెల మీద తీవ్రంగా ఎగిరే "ఎర్ర జెండాని" ఒక నిమిషం చూసే ధైర్యం లెనొన్ని
ఇంతకన్నా ఎం శిక్షించగలం ??????
"క్రాంతి" ("నీ")
( మహొజ్వలిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఇంటి చరిత్రగా భావించే మా కుటుంబం, ఉద్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా కుటుంబం లో పుట్టి.. ఒక నర హంతకుడైన "నిజామ్ని" తెలంగాణ నిర్మాత, గొప్పోదు, వెయ్యిసార్లు కీర్తిస్తా అన్న కేసీయార్ మాటలు.. విని రక్తం మరిగి పోయినప్పుడు..)

 

Source : http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=23418282&tid=2580887713393553711&start=1