కేసీఆర్ … "నీకు గోరికడతాం కొడక" … నీ (క్రాంతి) – సేకరణ

ఇప్పుడు సమాధులు మాట్లాడుతున్నై…!,
రాత్రికిరాత్రి తెలంగాణ నిద్రలేచి
కాళ్ళ కింద గతాన్ని తోవ్వు కుంటాండి,
సాయుధ పోరాట గమనాన్నీ గుర్తుకు తెచ్చు కున్తన్ది !
ఒక "బద్మాశ్ గాడి మాట" మృతవీరుల
ఆత్మని తూట్లు తూట్లు జేస్తన్నది..!
ఇప్పుడు నేను చరిత్ర తెలియనోని నాల్కను గొసకపొయి
కామ్రెడ్ "రావి నారాయణ రెడ్డి" సమాధి ముందు బెట్టాల..
బానిసల్ని జేసినోని బూజానెక్కి "ఓటు" కోసం
నీతిమాలిన మాటలో డి కంట్లో వరంగల్లు కారం జల్లాల..!
ఈ గద్ద ముక్కొడికి
గెరిల్లా యోధుల గుండె మంటలేం దెల్సు?
అరె.. గుండెలు మండిపోతున్నైరా.. ఎలా తట్టుకునేదీ మాటలు
ముఖ్దూంసాబ్, బద్దం ఎల్లా రెడ్డి, చాకలి అయిలమ్మ, తమ్మారపు గోవిందు
మళ్లీ చంప బడ్డార్రా…. బిడ్డ
వాడిని క్షమించొద్దు..!
నీ "బాన్చనన్నా" బతుకులు కూల్చబడ్డది,
నీ "కాల్మోక్థ" అన్నా చెరచబడ్డ ఆడది
వాడికేం తెల్సు????
పోరాటం కోసం బతుకుని బుల్లెట్లకు దారాబోసినోళ్ళు,
ఆజాదీ కోసం గుండెల్లో గుళ్ల వర్షం కురిపిచ్చుకున్నొళ్ళు,
మాతాత పక్కతెముకలు కుప్ప చేసిన బూట్లదెబ్బలు,
గిరిప్రసాద్ రొమ్ము చీల్చిన బుల్లెట్ సంగతి,
చిట్యాలలో నర మేధం..
వాడికేం తెల్సు???
వోరేయ్ శవ సంభోగి……
నీ మాటలు విన్నాక కాటికి కాల్జాపిన మా జేజి "కాంద్రించి ఉమ్మింది",
పక్షవాతంలోనూ మాతాత "పళ్ళు గొరికిందు" ,
"నిజాం (నిరంకుశత్వాన్ని) ని వెయ్యిసార్లు పోగుడ్థా" అన్న నీ ఫోటో ఉన్న పేపర్ మీద
మా పిలగాడు "ఉచ్చ బోస్తన్నాడు"
ఉద్యమ నేత ముసుగ్గప్పుకున్న తాగుబోతొన్ని, బుధ్ధిహీనున్ని,
మా గుండెల మీద తీవ్రంగా ఎగిరే "ఎర్ర జెండాని" ఒక నిమిషం చూసే ధైర్యం లెనొన్ని
ఇంతకన్నా ఎం శిక్షించగలం ??????
"క్రాంతి" ("నీ")
( మహొజ్వలిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఇంటి చరిత్రగా భావించే మా కుటుంబం, ఉద్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా కుటుంబం లో పుట్టి.. ఒక నర హంతకుడైన "నిజామ్ని" తెలంగాణ నిర్మాత, గొప్పోదు, వెయ్యిసార్లు కీర్తిస్తా అన్న కేసీయార్ మాటలు.. విని రక్తం మరిగి పోయినప్పుడు..)

 

Source : http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=23418282&tid=2580887713393553711&start=1

26 thoughts on “కేసీఆర్ … "నీకు గోరికడతాం కొడక" … నీ (క్రాంతి) – సేకరణ

  1. అన్న మంచిగ రాసినవ్

    కె సి అర్ ను ఇంత తిట్టు తిట్టిన మగోడు లేడు

    టివి 1 నుంచి 10 కి, హెం ఎం వాడికి ముఖియ ఎడిటర్లుకు పంపించిరాదె.
    వాల్లు కెసీఅర్ పేరు చెపితే ఉచ్చ పోసుకుంటన్నారు

    అలాగె, సిద్ధాంతకర్తకి,కోదండరాంకు డిట్టొరామ్రెడ్డికి పంపించరాదె

  2. పుచ్చలపల్లి సుందరయ్య వీర తెలంగాణా విప్లవ పోరాటం పుస్తకం ద్వారా తప్ప మరే విదంగానూ తెలంగాణా సాయుధ పోరాటం గురించి తెలియని నాకే కే సీ ఆర్ నిజాం గాడిని పొగుడుతుంటే ఆవేసం వచ్చింది.మరి ఆ యొధులు నడిచిన నేలలో తిరిగె వారికి ఇంకెంత ఆవేశం వస్తుందో తేల్లిగ్గా అర్ధం చేసుకొగలను. కవిలో వున్న ఆవేశం, ఆ ఆవేశం వెనుక వున్న ఆక్రోశం చాలా బాగా వ్యక్తీకరించబడ్డాయి.

  3. మొత్తం తెలంగాణాకే గోరి కడ్తున్నరు కొడుకా!

    కేసీఆర్‌ను పక్కన పెట్టి
    జరసేపు తెలంగాణ పల్లెల్ని చూడు తమ్మీ!
    జీవనదులు గలగల బిరబిరా పారుతున్నా
    పంటలు ఎట్ల ఎండిపోతున్నయో,
    రైతులు ఎట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నరో
    ఎన్ని గోరీలు లేస్తున్నయో కండ్ల పడ్తది.
    వరంగల్లు లో తాగనీకి కూడ నీళ్లు లేక
    నాల్రోజులకోసారి నల్లాల దగ్గర జరిగే
    గెరిల్లా యుద్ధం కండ్లార చూడొచ్చు.

    విశాలాంధ్ర అంటే ఆంధ్రుల హృదయం
    మా లావు ”ఇషాలం” అనుకున్నం గని
    ఇంత విషముంటదనుకున్నమా?
    నాటి దొరలు, జమిందార్లు, జాగిర్దార్ల కంటె అన్నాలంగ
    మన నీళ్లను, పొలాలను, ఉద్యోగాలను
    ఇట్ల దోచుకు తింటరనుకున్నమా?
    తిన్నింటి వాసాలను కాలబెడ్తరనుకున్నమా?

    పోలీసు చర్య ఎవర్ని ఉద్దరించింది?
    అధికారాన్ని ఏ పోరాట యోధులకు అప్పగించింది?
    మన ఆడోళ్లను బరిబాత బతుకమ్మలాడించినోళ్లకే కదా!
    నిజాముకు ”రాజప్రముఖ్‌” బిరుదునిచ్చి,
    ”రాజభరణం” మంజూరు చేసి వాడు చచ్చేదాన్క
    కాపలా కాసింది ఎవరు కేసీఆరా?
    తెలంగాణా సమరయోధులకు ఇప్పటికీ
    స్వాతంత్ర సమరయోధుల పింఛన్లు రాకుండా
    అడ్డుకుంటున్నది ఈ అర్భకుడేనా?

    తెలంగాణా చరిత్రకు, తెలంగాణా సంస్కృతికి
    పాఠ్య ప్రణాళికలో సముచిత స్థానం దక్కకుండా
    తెలంగాణా మూలవాసులు తెలంగాణాలోనే
    కాందీశీకుల్లా ఇతర్ల దయాదాక్షిణ్యాలపై
    ఆధారపడి బతికే దౌర్భాగ్యం నీకు కనబడటంలేదా?

    కే సీ ఆర్‌ స్థానంలో నాటి కామ్రెడ్లే వుంటే
    తెలంగాణా చరిత్ర మరో మలుపు తిరిగేది కాదా
    ఆంధ్ర నేతల వల్లనే కదా ఎర్రజండా కూడా
    వలసవాదుల కొమ్ము కాస్తోంది.
    అసలు వాస్తవాల్ని గమనించకుండా
    చారిత్రక తప్పిదాలు చేస్తూ ప్రజలకు
    ఇంకా దూరం కాకు
    జై తెలంగాణా అనడానికి ఇప్పటికైనా వెనుకాడకు.

  4. కే.సి.ఆర్.. హైదరాబాద్ లో వున్నా ముస్లిం ఓట్ల ప్రాపకానికి నిజాంను చాలా రోజులనుండి పోగుడుతున్నాడు. ఇది అందరం ఖండించాల్సిన విషయం. రజాకార్ల దుర్మార్గాలను మరిచిపోలేదిమ్కా ఎవరూ. అవి తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పోడుస్తుమ్ది. మీరన్న పక్షవాతం వచ్చిన తాతయ్యకు కూడా పళ్ళు నూరే కోపం వస్తుంది. ఇదంతా బాగానే వుంది. కాని నాటి ఎర్ర ఝె౦డాను కప్పుకున్న సిపిఎం నాయకులు తమదే నాటి వారసత్వం అన్నవారు ఈనాడు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విశాలాంధ్ర అంటుంది. దీనికి మీ జవాబే౦టి? కెసిఆర్ తాగుబోతైనా, తిరుగుబోతైనా ఉద్యమం కొనసాగి౦చడ౦లో తనదైన బాణిలో పోతున్నాడు. ఆయన ఉనికిని ప్రజలే నిర్ణయిస్తారు.

  5. ఇప్పుడు తెలంగాణవాదులు ఆంధ్రప్రాంతీయుల్ని తిడుతున్న తిట్లూ, చేస్తున్న నిరాధార ఆరోపణలూ, కల్పనలూ వింటుంటే – “పాపం, చివఱి నిజామ్ నిజంగా వీళ్ళు చెబుతున్నంత దుర్మార్గుడు కాదేమో, ఇప్పుడు ఆంధ్రప్రాంతీయుల్ని బద్నామ్ చేస్తున్నట్లే అతన్నీ అన్యాయంగా బద్నామ్ చేశారేమో”నని నాకు తొట్టతొలిసారిగా అనుమానం కలుగుతోంది.

  6. 1. KCR is a disgrace to Telangaana, the movement would have been better off under any other leader.
    2. Blaming “andhra” for everything doesn’t hold good forever
    blame yourself and your leaders for the poor state of Telangana now
    3. may be you guys didn’t see andhra region, there are worse regions/places in andhra than in T- region

    • Suresh, the phrase “politically unemployed” has really become fashionable in the samaikya crowd. Why did no one use it for YSR, Babu, Chiranjivi etc. when they supported Telangana? All parties except CPM & MIM supported Telangana in the all party meeting on December 7 but no one called them names.
      Do you consider samaikya champions like Lagadapati, Jagan, JCD, Anam, Nannapaneni, Somireddy etc.? Are they “happily employed politicians” in your thinking? Do you count MIM as a “religion parasite”?
      Apart from TRS, BJP, CPI & JIH, most dalit leaders, human rights activists, Maoists (from all regions) are supporting Telangana. Intellectuals like Dr. Cinare, Dasaradhi, IIT Ramiah, Chilkur Soundarajan, former DGP Ramulu, Justice Sardar Ali Khan, Prof. Hara Gopal etc. all support Telangana. Many cultural icons & artists support Telangana. None of them are in politics nor are they caste/religion fanatics.

  7. తమ్మీ జాబిల్లీ ! జర నీ ఎన్నెల యీసంట భీ పడనీ రాదె? నా బ్లాగ్ల నేన్రాసిబెట్టినుంటి “అది మీ విచక్షణకే”
    జరసూబ్బెట్రాదె? గా పోస్టుకొచ్చిన కామెంట్లు భీ,సూడాలె తమ్మి. యీడ కామెంట్లేసినోల్లందరుభీ జరయీడనో సూపు బెట్టున్రి. http://www.nutakki.wordpress.com …..

    శాన మంచిగజెప్పినవ్ తమ్మీ యెన్నెల్లు బర్సినవ్ పో….. అభినందనలు…..నూతక్కి

  8. Hyderabad had a good infrastructure already built by the nizam govt. In contrast andhra govt. was running in tents at Kurnool. Mentioning this truth is not the same as praising the former king.
    You ask your kids to piss on KCR photo because you think he praised the nizam. What will you do to the leaders who made Osman Ali Khan governor and gave him MP seat? What will you do to the people of Kurnool & Anantapur who voted for him?
    My family participated both in the Telangana sayudha poratam & the 1969 telangana udyamam. I feel disgusted when some andhra politicians call the sayudha poratam as “vishalandhra poratam”.

Leave a reply to Krishna Reddy స్పందనను రద్దుచేయి