తెలుగు భాషకి మన ప్రభుత్వం ఏం చేసింది??? ఏం చేస్తుంది????

తెలుగు మనందరి మాతృభాష….ఈ తల్లి తెలుగు ఎన్నో ఏళ్ళు పరరాజుల పాలనలో మగ్గింది…..ఎన్నో పరభాషలు రాజభాషలుగా వెలిగి, మన భాషని కేవలం వాడుక భాషగా మిగిల్చాయి….మనదైన ఈ ప్రజాస్వామ్య రాజ్యం మనం కష్టపడి తెచ్చుకున్నాక, మనం పట్టం కట్టి కూర్చోబెట్టిన ఈ ప్రభుత్వాలు,ప్ర్జజాప్రతినిధులు చాలా మంది,మన తెలుగుతల్లికి అన్నిటా అగ్రతాంబూలం ఇస్తామని,ఇవ్వాలని ఎన్నో జీవోలు, మరెన్నో ప్రణాళికలు రూపొందించాయని వినికిడి……కానీ వాటిలో చాలా వరకు అసెంబ్లీ నాలుగ్గోడల మధ్యనే ఉండిపోయాయి….కొన్ని సచివాలయం దాకా వెళ్ళి ఫైళ్ళుగా మారి బీరువాల్లో మగ్గుతున్నాయి……నాకు తెలిసి తెలుగుకి అధికారభాషగా ఒక గుర్తింపు తెచ్చింది మన ఎన్టీయార్….ఆయన ఏం ప్రణాళికలు రూపొందించాడో, వాటిని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కి ఏ గంగలో కలిపాయో తెలియదు….నాకే కాదు, నేటి యువకులకి ఎవ్వరికీ తెలియదనుకుంటా…..

వాడుక భాషలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినప్పుడే, సమాచారం సగటు వ్యక్తికి సరిగ్గా చేరుతుంది….మాతృభాష వల్లే బుద్ధి వికాసం కలుగుతుందని విజ్ఞుల అభిప్రాయం…

పైగా పుట్టల్లా పెరిగిపోతున్న ఈ కార్పొరేట్ సంస్కృతిలో, మన తెలుగు భాషకి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ప్రతి తెలుగువాడూ నిలబడాలి…..కనుక పెద్దలు, విజ్ఞులైనవారు ఈ టపాకి స్పందించి, మన ప్రభుత్వం ఇంతవరకు  తెలుగు భాషాభివృధ్ధికి ఏఏ జీవోలు జారీ చేసింది, ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో సవివరంగా తెలియజేస్తే, మేం వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి, ఆ ప్రణాళికల అమలుకి మా వంతు ప్రయత్నం చేస్తాం….

ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ, మా వద్ద ఉన్న కొన్ని ప్రశ్నల్ని మీ ముందుంచుతున్నాం….వాటి ఆధారంగా మీరు మీకు తెలిసిన విషయాల్ని పంచుకుంటారని ఆశిస్తున్నాం….

౧) అధికార భాషా సంఘం అని ఒకటుంది…దాని విధులు ప్రణాలికలు ఏంటి?

౨)తెలుగు భాషా ప్రచార సమితి అనే ప్రభుత్వ అనుబంధ సంస్థ ఉందనుకుంటా? దాని గురించి….

౩) అసలు ఇంతవరకూ చాలా ప్రభుత్వాలు మారాయి..అవి చేసిన చిన్న,పెద్ద ప్రణాళికలు…???

౪)ప్రభుత్వ కార్యాలయాలన్నిట్లో ఉత్తర, ప్రత్త్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలని ఎన్టీయార్ ప్రభుత్వం జీవోలు జారీ చేసిన గుర్తు….దాని వివరాలు….

౫)ఇలా ఉత్తర, ప్రత్త్యుత్తరాలన్నీ తన కార్యాలయంలో, పూర్తిగా తెలుగులోనే జరిగేట్టు ఒక కలెక్టరుగారు చేస్తున్నారని వినికిడి……అలా ఆయన చెయ్యగలుగుతున్నపుడు రాష్ట్రం మొత్తం అలానే ఎందుకు చెయ్యకూడదు? దానికి ఆయన అనుసరిస్తున్న విధానాలు……..

౬) ఈ మధ్య “తెలుగు”కి  ప్రాచీన హోదా కల్పించామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హడావుడి చేశాయి….మన నాయకులు ఉపన్యాసాలు ఊదరగొట్టారు….మరి దానివల్ల “మన తెలుగు” కి ఎక్కువగా వచ్చే (ఒరిగే)దేంటి? దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంతెంత?…అసలేం చేస్తారు? మనమేం చెయ్యాలి?…..

ఇవండీ మాకున్న అనుమానాలు…..సహృదయులు, విజ్ఞులైన పెద్దలు ఈ విలువైన సమాచారాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకుంటారని ఆశిస్తున్నాం….పంచుకుని “మన తెలుగు” అభివృధ్ధికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాం…..

ధన్యవాదాలు……

జై తెలుగుతల్లి!! జై తెలుగుతల్లి!!!


ఈటపా  నా అభ్యర్ధన మేరకు  కౌటిల్య గారు తెలుగులొ స్రిప్ట్   రాసి పంపించారు ,

2 thoughts on “తెలుగు భాషకి మన ప్రభుత్వం ఏం చేసింది??? ఏం చేస్తుంది????

 1. అది వినికిడి కాదు… నిజమే! అవును, తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే ఏకైక జిల్లా ఇందూరు (ఉరఫ్ నిజామాబాద్)…

  ఈ అధికార భాషా సంఘం ఒకటుంది కాని ఉత్తుత్తిదే. అదొకటి ఉంది అనికూడా గుర్తుకురాదు ఈ పెట్టుబడీదారూలకు దాసోహమనే మన అప్రజాస్వామ్య పరిపాలకులకు మరియు వారి తొత్తులైన అధికారగణనికి.

  సమైఖ్య రాష్ట్రంలో తెలుగు భాషకు చాలా అన్యాయం జరిగింది. ఆంగ్లాంధ్ర పాలనా పెత్తనం – హుజూర్ తెలంగాణ గులామిగిరితో ఎవరూ పూడ్చలేని అగాధంలో పడిపోయింది తెలుగు భాష. ఇరువైపులా రాజిపడలేని స్పర్థల కారణంగా పర భాషలకు ఇచ్చే ప్రాధాన్యతలలో చాలా తేడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఉర్దూ ప్రాధాన్యం తగ్గించడమే పాలకుల ప్రథమ కర్తవ్యంగా వ్యవహరించే క్రమంలో ఆంగ్ల భాషకు దాసోహం అవుతున్న సంగతే మరిచారు. తెలుగు ఆస్థానకవి హోదాలో దాశరథి అధ్యక్షతన జరిగిన ఉర్దూ మంజరీ కార్యక్రమం ఆంగ్లాంధ్ర పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఆ తరువాత ఆస్థానకవి లేడు… నిధులూ లేవు… తూతూ మంత్రంగా తెలుగు భాషా సంఘం మూలుగుతూవస్తోంది. అసలుసిసలైన తెలుగు బ్రతికుంది ఒక్క తెలంగాణలోనే అని తన ఉర్దూ డైరీలో రాసుకున్నాడు దాశరథి.

  అసలైన భాషాపండితులకు సంపూర్ణ అధికారం ఇచ్చేరోజు రావాలని ప్రార్థిస్తూ… భాష ముసుగున జరిగిన తెలుగుకు జరిగిన వివక్షకు విలపిస్తూ…

  చివరగా కాలోజీ వాఖ్యతో…

  తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు భాషీయుల
  ‘సుహృద్భావన’ ఎంతని వర్ణించుట సిగ్గుచేటు
  వాక్యంలో మూడుపాళ్ళు ఇంగ్లీషు వాడుకుంటు
  తెలంగాణీయుల మాటలో ఉర్దూపదం దొర్లగానే హిహీ అని
  ఇగిలించెడి సమగ్రాంధ్ర వాదులను ఏమనవలెనో తోచదు.
  ‘రోడ్డని’ పలికేవారికి సడకంటె ఎవగింపు
  ఆఫీసని అఘొరిస్తూ కచ్చేరంటే కటువు
  సీరియలంటే తెలుగు సిల్సిల అంటే ఉరుదు
  సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు నమక్, షర్కర్, నాష్తంటే కొంప మునుగు
  టీ అంటే తేట తెనుగు చా అంటే ‘తౌరక్యము’
  పొయినడంటే చావు తోలడమంటే పశువు దొబ్బడమంటే బూతు
  కడప అంటే ఊరి పేరు త్రోవంటె తప్పు తప్పు దోవంటేనే దారి.

  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలుగుతల్లి!! జై తెలుగుతల్లి!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s