తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి

నాకు జనాలు  తెలంగాణ ఎందుకు కావాలనుకు కావాలొ వివరిస్తారా ! సొది చెప్పకుండా  అంటే  …

1.మనం వెనక బడ్డాం  కాబట్టి

2.మాతెలంగాణ మాకు కావాలి

3. మీము మీతొ కలిసి ఊండం

4.మావనరులు మాకే

ఇలాంటి సొల్లు కాకుండా , శాస్త్రీయంగా ఎవరైనా వివరిస్తారేమొనని చుస్తున్నా.

తెలంగాణా వాళ్ళే చెప్పాలని ఏంలేదు … ఆంద్రాలొను తెలంగాణా కు మద్దతుతెలిపే వారెవరైనా చెప్పొచ్చు. నాకు నిజంగా తెలంగాణా ఎందుకు కావాలొ తెలియడంలేదు … ఒక తెలంగాణా వాడినై ఊండి విచారం వ్యక్తం చేస్తునాను .

70 thoughts on “తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి

 1. తేరగా మేము అభివృద్ధి చేస్తే తిని కూర్చుంటున్నారు, అని అంధ్రా వాళ్ళు అంటుంటే ఎందుకు పడాలి ?అందుకే మా తెలంగాణా మాకు కావాలి అంటున్నారు. 60 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు వింటేనే కోపం వస్తోంది , అందరం తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి “తెలంగాణా” కావాలి.
  ఇక మీదట తెలంగాణా వారు పాలించాలి… ఆంధ్రా వారు తిని కూర్చోవచ్చు.
  దళితుడు, మాదిగ అంటూ కులాల ఆధారం గా కాకుండా తెలంగాణా లో పుట్టిన వారై ఉండి, పోస్టు గ్రాడ్యుయేట్ అయి వుండి, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండి , 25 సంవత్సరాలు తెలంగాణాలో నివాసం కలిగి ఉండి, ఇరువైపులా సమానంగా చూడగలిగిన వారెవరైనా ముఖ్యమంత్రిగా రావాలి.

  ముఖ్యం గా మార్పు తప్పనిసరిగా కావాలి, రావాలి.

 2. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణా రాదు. ఇందాక నేను IDBIకి వెళ్ళి వస్తున్నప్పుడు మా పక్కింటాయన దారిలో కనిపించి బండి ఎక్కించాడు. మాట్లాడుతూ మధ్యలో ఇంతకీ తెలంగాణా వస్తుందంటావా అని అడిగాడు. కాంగ్రెస్ నాయకుల బొమికలు విరగ్గొడితే వస్తుంది అని చెప్పాను. నిజమే, తెలంగాణా ఇవ్వడం ఇష్టం లేనిది కాంగ్రెస్‌వాళ్ళకే అని ఆయన అన్నాడు. కాంగ్రెస్‌కి తెలంగాణా ఇవ్వడం ఇష్టం లేదు అని కోస్తా ఆంధ్రలో ఉండే అతనికే తెలిసినప్పుడు తెలంగాణాలో ఉన్నవాళ్ళకి ఇంకా బాగా తెలిసుండాలి కదా. రాష్ట్రపతి పాలన వస్తే అప్పుడు ప్రత్యేక తెలంగాణా వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణా అవసరమా, కాదా అనే ప్రశ్నకి వద్దాం. మన దేశంలో రాష్ట్రాల సరిహద్దులు ఎన్ని సార్లు మారలేదు? చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం ఒకప్పుడు నిజాం రాష్ట్రంలో ఉండేది. తరువాత బ్రిటిష్‌వాళ్ళు దాన్ని బస్తర్ సంస్థానానికి అప్పగించారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, వెంకటాపురం ప్రాంతాలు ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉండేవి, తరువాత గోదావరి జిల్లాలోకి వెళ్ళాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే ఖమ్మం జిల్లాలోకి వెళ్ళాయి. ఖమ్మం, మధిర ప్రాంతాలు అప్పట్లో వరంగల్ జిల్లాలో ఉండేవి, కృష్ణా జిల్లాలోని మునగాల ప్రాంతం ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో ఉండేది. ఇలా మ్యాప్‌ల మీద గీసిన గీతలు ప్రజల సమైక్యతని నిర్దేశిస్తాయని అనుకోలేము. కనుక ప్రత్యేక తెలంగాణా వచ్చినా రాష్ట్ర సమైక్యతకి ఏర్పడే నష్టం లేదు. ఆంధ్ర ప్రదేశ్ కంటే జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ చిన్నవైన దేశాలు చాలా ఉన్నాయి కదా. రాష్ట్రాన్ని విభజించేయండి. కొట్టుకుంటూ కలిసి ఉంటే అది సమైక్యత అవ్వదు కదా.

  • @ ప్రవీణ్ ,
   ఈ భారతం అంతా తెలిసిందే.
   నేను అడిగిందేమిటి … నువ్వు చెప్పిందేమిటి ! నాకు తెలంగాణా ఎందుకు కావాలొ వివరణ కావాలి ,
   అన్యదా భావించవద్దు… చర్చ అనవసరమైన విష్యాలమీదకు పొకూడదని గుర్తుచేస్తున్నాను,

   • తెలంగాణ ఎందుకు కావాలి అంటే జంప్ జిలానీ ప్రవీణ్ చెప్పేదంతా శ్రద్ధగా వినాల్సిందే. విన్నాక ఏమైనా డౌట్లుంటే మళ్ళీ ప్రవీణే చెబుతారు. మొదటిరౌండ్లోనే మీకు విరక్తి పుట్టి, ఈ పీకుడుకన్నా తెలంగాణ ఇచ్చుడే బెటరని పిస్తుంది. రెండో రండ్లో కళ్ళు బైర్లు కమ్ముతాయి. మూడోరౌండ్లో తారే జమీన్ పర్ కనిపిస్తాయి. నాలుగో రౌండ్లో జీవితేచ్చ నశించి తెలంగాణ ఇచ్చి, హిమాలయాలకు వెళ్ళి కూలింగ్ అవుదామని అనిపిస్తుంది.

  • బాగా చెప్పావు. తుర్రెబాజ్ ఖాన్ విగ్రహం ఎందుకు పెట్టలేదో, కొమురం భీం పై 1951లోనే సినిమా ఎందుకు తీయలేదో నిలదీయ్. షేక్ బడే గులాం అలీఖాన్ చక్‌ముఖ్‌జంగ్ విగ్రహం అసెంబ్లీ మీద ఎందుకు లేదని దులిపేయ్, నేనున్నా నీకు బ్యాకింగు. మావో చరిత్ర చెప్పడం మరిచేవు. కరీమ్నగర్లో నీవు చేసిన ఇంటర్వ్యూలన్నీ చెప్పేయ్, ఎవరు అడ్డోస్తారో నేను చూస్తాను. ఇలాన్ అడిగి రోట్లో తలపెట్టేవాళ్ళు ఎప్పుడోగాని దొరకరు. ఈరోజు సావో రేవో తేలిపోవాలి.

   • Two comments from same person with different names. Good joke. ఇక్కడ తుర్రెబాజ్ ఖాన్ గురించి ఎవరడిగారు? దాని గురించి అడక్కుండానే సమాధానం చెప్పావంటే కోస్తా ఆంధ్రవాళ్ళకి తెలంగాణావాళ్ళ విగ్రహాలు పెట్టడం ఇష్టం లేదు అని డైరెక్ట్‌గా ఒప్పుకున్నట్టే కదా. నేను దొంగతనం చెయ్యలేదు అని చెప్పి నిజంగా దొంగ అనే అనుమానం వచ్చేలా చేసినవాడినా మాట్లాడుతున్నావు.

  • @కనుక ప్రత్యేక తెలంగాణా వచ్చినా రాష్ట్ర సమైక్యతకి ఏర్పడే నష్టం లేదు
   తగుదునమ్మా అని ప్రతి టపాలో దూరిపోయి నీ మిడి మిడి జ్ఞానం ప్రదర్శించుకోకపోతే నీకు నిద్రపట్టదనుకుంటా.ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత ఇక రాష్ట్ర “సమైక్యత” ఏంటి? బుర్ర వాడి కామెంటు పెడతావా లేక కేవలం సీమాంధ్ర వాళ్ళని విమర్శించడానికి కామెంటు పెడతావో అర్ధం కాదు. అసలు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అంటూ వర్గీకరించటమే పెద్ద అయోమయం.మరల ప్రత్యేక తెలంగాణా వచ్చినా రాష్ట్ర సమైక్యతకి ఏర్పడే నష్టం లేదు అంటూ అతితెలివి కామెంటు ఒకటి. నీకు చేయడానికి పని లేదో లేక తీరికెక్కువో కాని ఇప్పటికయినా నువ్వు సమాజానికి ఏమైనా కాస్త ఉపయోగాపదాలనుకుంటే తెలుగు వికీపీడియాకి వెళ్లి పనికొచ్చే వ్యాసాలు వ్రాయి, లేదా కనీసం అచ్చుతప్పులు అయినా సరిదిద్దు. తెలంగాణ+సీమాంధ్ర ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారు.ఎప్పటికి ఇలాగే ఉండనిద్దాం.

   ఉన్నారు,ఇప్పటికే తమరు చేసిన బ్లాగుకాలుష్యం

  • @కనుక ప్రత్యేక తెలంగాణా వచ్చినా రాష్ట్ర సమైక్యతకి ఏర్పడే నష్టం లేదు
   తగుదునమ్మా అని ప్రతి టపాలో దూరిపోయి నీ మిడి మిడి జ్ఞానం ప్రదర్శించుకోకపోతే నీకు నిద్రపట్టదనుకుంటా.ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత ఇక రాష్ట్ర “సమైక్యత” ఏంటి? బుర్ర వాడి కామెంటు పెడతావా లేక కేవలం సీమాంధ్ర వాళ్ళని విమర్శించడానికి కామెంటు పెడతావో అర్ధం కాదు. అసలు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అంటూ వర్గీకరించటమే పెద్ద అయోమయం.మరల ప్రత్యేక తెలంగాణా వచ్చినా రాష్ట్ర సమైక్యతకి ఏర్పడే నష్టం లేదు అంటూ అతితెలివి కామెంటు ఒకటి. నీకు చేయడానికి పని లేదో లేక తీరికెక్కువో కాని ఇప్పటికయినా నువ్వు సమాజానికి ఏమైనా కాస్త ఉపయోగాపదాలనుకుంటే తెలుగు వికీపీడియాకి వెళ్లి పనికొచ్చే వ్యాసాలు వ్రాయి, లేదా కనీసం అచ్చుతప్పులు అయినా సరిదిద్దు. తెలంగాణ+సీమాంధ్ర ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారు.ఎప్పటికి ఇలాగే ఉండనిద్దాం.ఇప్పటికే తమరు చేసిన బ్లాగుకాలుష్యం చాలు !

 3. @ ప్రవీణ్ శర్మ ,
  నీకే నాయనా చెప్పింది .. topic కి related గా మాట్లాడమని .
  @ సుమ
  మీరు నేను ఇచ్చిన రూల్స్ లొ రెండవ దాన్ని అతిక్రమించారు ! ఎందుకు కావాలొ చెభితే సంతొషిస్తాం.

 4. భారత దేశం లొ అనేక పరిశ్రమలు, స్థాపించి,
  రైల్వె లైన్లు, విమానాశ్రయాలు , ఓడరేవులు , ఆనకట్టలు నిర్మించి
  ఎంతో అభివ్రుధ్ధి పరుస్తున్న ఆనాటి బ్రిటీషు వాళ్ళని ఎందుకు వెల్లగొట్టారొ,
  ఏం సాధించారొ నాకూ ఎమి అర్ధం కావడం లేదు .
  అసలు భారత దెశానికి స్వాతంత్ర్యం ఎందుకు,
  ఆ స్వాతంత్ర్యం ఎవరిని ఉధ్ధరించిందొ ఎవరైనా వివరించండి .
  సొల్లు చెప్పకుందా సూటిగా ,
  శాస్త్రీయంగా చెప్పండి.

 5. తెలుగు మాట్లాడేవాళ్ళు బలవంతం గా కలసి వుంటేనే దేశ సమగ్రతకి మేలా ??
  ఏం, తెలుగు మాట్లాడేవాళ్ళూ అరవం మాట్లాడే వాళ్ళూ ఒకే రాష్ట్రం గా ఎందుకు కలసి వుండకూడదు?
  అది దేశ సమైక్యతకు మరింత బలాన్ని ఇచ్చేది కదా.
  గతం లో కలసి లేరా? మరి ఎందుకు విడిపోయారు?
  ఎం శాస్త్రీయ ప్రాతిపదిక వుంది>

  గతం లో వేరు వేరు గా వున్నా రాష్ట్రాలని (Andhra , Hyderabad states)
  ఒక్క ఐదు సంవత్సరాలు ఆగి జనరల్ ఎలెక్షన్లు జరిగి
  తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ లో మూడింట రెండు వంతుల మంది విలీనానికి అనుకూలంగా వుంటే
  అప్పుడు రెండు రాష్ట్రాలని కలపండి అని మొదటి ఎస్ ఆర్ సి (ఫజల్ అలీ )కమిషన్
  ఎంతో శాస్త్రీయంగా చెప్పినా ఎందుకు వినిపించుకోలేదు
  బలవంతంగా, ఆదరాబాదరాగా ఎందుకు రెండు రాష్ట్రాలను దొంగ పెద్ద మనుషుల వోప్ప్లండం తో, దొంగ హామీలతో కలిపి తన్నుకు చచ్చేలా చేసారు?
  ఈ ప్రశ్నలకి తెలిసి కూడా సమాధానం చెప్పక పోయారో వారి తల వేయి వక్కలవుతుంది!

 6. ఏంది మల్లా మొదటికొచ్చినవ్,మేమెవ్వలం జెప్పిన వినం.మా తెలంగాణా మాగ్గావాలె.అంతే! లేదంటే అడ్డంగా నరుకుతం.సమజయిందా.మేము అభివృద్దిలో శానా వెనకబడినం మా “కచరా”అన్న జెప్పిండు.73% అదాయం మా తెలంగాణా నుండే వస్తుంది వస్తుంది.మా “కచరా”అన్న జెప్పిండు.మా పొలాలన్ని చూస్తే బీడుపడి ఏడుస్తున్నయ్. అయినా వరి పంట విస్తీర్ణం పెరిగిందంటే మా తెలంగాణా రైతుల పెతిబే కాని ఇంకేమి కాదు. అసలు చుక్క నీళ్ళు లేకపొయినా ఇంత సాధించినం. ఇక తెలంగాణా వస్తే దానెమ్మ ఇక ద్రాచ్చా,యాపిల్స్,జీడి,పుచ్చ,వెరుసెనగ,ఆక్రూట్,అరటి,కర్జూరం,అల్లం,కంది,పైనాపిల్,సపొటా,తులిప్ పూలు,దనియాల చెట్లు అన్ని పండిస్తం.ఇతర దేశాలకు ఎగుమతిగూడా జేస్తం, ఒక్క సీమాంధ్రకు తప్ప. మా “కచరా”అన్న జెప్పిండు. ఇక యీ నెలాకరుకంత బంగారు తెలంగాణా రబోతుంది ప్రపంచములోనే ఎక్కువ అభివౄద్ది చెందబోతుంది కనుకనే ఆ అమెరికా వాడు కూడా వాల్ల ఎంబసి రాయబార ఒఫీసుని హైదరబాదులో బెట్టిండు. సమజైందా! అందుకని ఎక్కువ కిరికిరి జేయద్దు. యీ సీమాంధ్ర సీఎం తప్పుడు నివేదికలు డిల్లీకి పంపొద్దు, పంపేముందు మా పొన్నాల ప్రభాకరన్నకు జూపించి పంపాలే. ఎమైనా కాని ఈ నెలాకరుకు తెలంగానా బిల్లు పార్లమెంటులో బెట్టాలె.మా “కచరా”అన్న జెప్పిండు. మీకు సిసలైన నిజాయితీ సమాచారం గావలంటే “నమస్తే తెలంగాణా” దిన పత్రిక చదువు, “టి న్యూస్” చానెల్ జూడు బై. ఇంగ దిస్కషన్ వొద్దు. పాకిస్తాన్ జిన్న జెప్పినట్లు “తెలంగాణా”కోసం ఇంక వందేండ్లైనా పొరాడుతం.మా “కచరా”అన్న జెప్పిండు,కెటీఆర్ జెప్పిండు,హరీషన్న జెప్పిండు, మా కవితక్క కూడా ఇదే జెపుతుంది.

 7. బందులు, రాస్తా రోకోలు, రైల్ రోకోలు, ఆటోలు కూడా దొరక్కుండా అలమటించకుండా సకల జనులూ సుఖంగా బతకడం కోసం తెలంగాణా కావాలి.
  మనశ్శాంతిగా నిద్రపోవడంకోసం తెలంగాణా కావాలి.
  బయటికి వెళ్ళిన భర్త క్షేమంగా ఇంటికి వస్తాడో రాడో తెలియని దుస్థితి నించీ బయట పడటానికి తెలంగాణా కావాలి.
  రాజకీయ ప్రయోజనాలకోసం పిల్లలని బలి పెట్టే సెంటిమెంట్ నించీ బయట పడటానికైనా తెలంగాణా కావాలి.
  తెలంగాణా అనేది స్వార్ధ రాజకీయ నాయకుల రాజకీయ పునరావాసానికి ఒక నిచ్చెనలా ఉపయోగపడకుండా వుండటానికయినా తెలంగాణా కావాలి.
  మనలా పనీ పాటూ లేనివాళ్ళంతా చర్చల పేరుతో సమయం వృధా చెయ్యకుండా వుండటం కోసమయినా తెలంగాణా కావాలి.
  ఇవి చాలా ?
  ఇంకా చాలా కావాలా ?

  • సమైక్యవాదులు ఏదో అహింసావాదులైనట్టు మాట్లాడడం ఎందుకు? సమైక్యవాదులు కిరాయి మనుషులని పంపి ఎంత హింస చేశారో నేనూ చూశాను. మేడ మీది ఫ్లోర్‌లో ఉన్న షాప్‌కి కొన్ని రోజులు లోపలి నుంచి షటర్లు వేసి కంప్యూటర్‌లో పని చేసుకున్న అనుభవం ఉంది కదా. ఎందుకో అర్థం కాలేదా? షాప్‌ల అద్దాలు బద్దలగొట్టేవాళ్ళు రోడ్ల మీద వీర విహారం చేస్తే వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలాగే చేస్తారు.

 8. అయ్యా ప్రవీణు గారు, తమరు ఇప్పుడే ఎదో ఇతర గ్రహం నుండి ఇప్పుడే వచ్చిన వాడిలాగా మాట్లాడవద్దు.తమరు ప్రతి బ్లాగులో ఎలా ఎంత త్వరగా తమరికొక్కరికి మాత్రమే సాధ్యమయ్యేతీరులో కామెంటుతారో అందరికీ తెలుసు. అమాయకత్వం నటించొద్దు? సరే మా తెలంగాణా ప్రఖ్యాతిగాంచిన కవితలు చదివితే తమరికి కొంత జ్ఞానం రావచ్చు. దయచేసి లింకులు దర్శించి మీ జీవితాలని పుణీతం చేసుకొనండి. మా తెలంగాణా కోటి బూతుల వీణ అని తప్పక ఒప్పుకుంటారు.

  ‘సింగిడి’ ( తెలంగాణా రచయితుల సంఘమట! ) వారి శ్రావ్యమైన బూతు కవితలు http://tinyurl.com/3j9dxuf
  చదివి వినిపించి తరించండి
  బూతులను కవితల రూపంలో అల్లడం ఒక అపురూపమైన కళ
  మరి విద్వేషం అనే విషాన్ని పేజీలపై చిమ్మడమనేది అందరు కవులకు సాధ్యపడదు

  • కోస్తా ఆంధ్రవాళ్ళకి బూతులు రావా? ఇరవై ఏళ్ళ క్రితం, తెలంగాణా ఉద్యమం బలంగా లేని రోజుల్లో ఈ సామెత వినిపించేది “చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి తెలంగాణా పోరీల గుడిసెలు” అని. ఇక్కడ సామెతని మార్చేసి దొమ్మరి, బోగం కులాల పేర్లు కాకుండా తెలంగాణా ప్రాంతం పేరు ఉపయోగించారు.

   • ఇరవై ఏళ్ళ క్రితం, తెలంగాణా ఉద్యమం బలంగా లేని రోజుల్లో ఈ సామెత వినిపించేది “చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి తెలంగాణా పోరీల గుడిసెలు”. సన్నాసొచ్చి బైరాగి గెడ్డాన్ని చూసి నవ్వితే ఎలా ఉంటుందో కోస్తా ఆంధ్రులు తెలంగాణావాళ్ళని విమర్శిస్తే అలాగే ఉంటుంది.

  • >>>>>
   మా తెలంగాణా కోటి బూతుల వీణ అని తప్పక ఒప్పుకుంటారు
   >>>>>
   మన కోస్తా ఆంధ్ర కోటి మోసపు మాటల మూట అని మనమూ ఒప్పుకోవాలి. ఆ బూతు కవితలు నేను చదివాను. ప్రాంతీయ అభివృద్ధి కంటే కేవలం ఒక నగర అభివృద్ధే గొప్పది అని ప్రజలని నమ్మించడానికి ప్రయత్నిస్తున్న లగడపాటి & కొని పచ్చి బూతులు తిట్టడంలో తప్పేమీ లేదు.

 9. కృష్ణ కుమారి గారు! 😦
  మీరు చెప్పింది నిజమే! అందుకోసమయినా తెలంగాణ కావాలి
  తెలంగాణ కావాలి అనడానికి, పెద్ద గా కారణం అంటూ ఏమీ లేదు.
  ఏ మాటాకామాట చెప్పుకోవాలి.రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం ఈ కచర నోరుమెదపలేదు.మంత్రి వర్గం లో ఉన్నప్పుడు వీణ అవసరం అనిపించలా… తర్వాతా తీరిగ్గా చేతికెత్తుకున్నాడు
  రతనాల వీణ కూడా మూల బెట్టేసి, తాగి సమాధి లో పడున్నవాడు,ఎపుడయితే అడ్డు తొలగి పోయిందో, విచ్చలవిడీ గా విజృంభించాడు.ప్రజల మనసులో విషబీజాలు వెయ్యబడ్డాయి. అంధ్రులు అంటేనే, విషం చిమ్మే పరిస్తితి కి తీసుకొచ్చారు. పదవి,ధన వ్యామోహం తప్పిస్తే ప్రత్యేక కారణాలంటూ లేవు.
  అంత మాత్రాన తెలంగాణాలో ఏ సమస్యలు లేవు అని అనుకొవడం లేదు.ఉన్నాయి. కాని సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల తీరిపోయే వాటిని, సమస్యలు తీరనీకుండాఅ చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఇప్పుడు సాక్షాత్తు కచర యే దిగి వచ్చి అంధ్రులు మంచివాళ్ళే అని చెప్పినా వినిపించుకోనే పరిస్తితి లో తెలంగాణ ప్రజలు లేరు.అంతటి అజ్నానం వీళ్ళది. నిజమేంటో తెలుసుకొనె ప్రయత్నమే చెయ్యరు… పోనీ తెలంగాణ ఇచ్చిన సుఖా శాంతులతో ఉంటారా అన్నది అనుమానమే. కచర దోచినంత దోచెసి, పక్క రాష్త్రాల తో చెయ్యి చాపే పరిస్తితి రాదని గ్యారెంటీ ఏముంది.అప్పుడూ దోచెయ్యడం మరీ ఈజీ కదా… అంతా చేసేసి అంధ్రుల మీద తోసెయ్యొచ్చు.

  ఒక్కటి మాత్రం నిజం.వీరందరి వల్ల పుణ్యమా అని రాష్ట్ర అభివృద్ధి యాభయి ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది.మళ్ళీ మొదట్నించి నిర్మించుకోవడం….మనల్ని చూసి నరేంద్ర మోడీ సాధించాడు గుజరాత్ లో. అలాంటిది, హ్ మ్…. ఆంధ్ర రాష్త్రం, బీహర్ చత్తీస్ ఘడ్, జార్ ఖండ్ ల సరసన చేరిపోయింది.

 10. >>తండ్రి ఎవరొ తెలియదేమౌ ,ఏమైనా చింతిస్తున్నాను !

  కట్టా విజయ్, తండ్రి ఎవరో చింతిస్తున్నావా? ఆయనే నీ తండ్రేమో అడుక్కో.( నోరు అదుపులో పెట్టుకో తమ్మీ )

  • @ కట్టా యాద్గిరి
   ఇప్పటివరకు ఎక్కడొ చిన్న ఆశ కాని ఈదెబ్బతొ … అది కాస్త తీరిపొయింది ! ఇక ఆ వ్యాఖ్యకి అర్దం ఏమిటొ నువ్వె అలొచించుకొ …!
   నానొరు ఎక్కడ పెట్టుకొవాలొ నాకు తెలుసు ముందు నువ్వుతెలుసు కొవాలసినది నువ్వు తెలుసుకొ !

   పేరుని బట్టి ఆడొ,మగొ చెప్పొచు అసలు పక్కొడి పేరుతొ వ్యవహరిస్తే వాడికి పేరు లేదని వ్యవహరించి మాడా గా పరిగణించాల్సిఉంటుంది.

   నానొరు అదుపులొ పెట్టు కుంటాలే కాని నాటపాకి సమాదానం చేతనైతే చెప్పు , చేతనైతే … ఈసారీయినా నీ వ్యవహారిక పేరు తొ మాట్లాడు .
   నీకన్నా రెండాకులు ఎక్కువే చదివా …సింగపూర్ లొ ఉన్నాను ఏంచేయలేననుకున్నావేమౌ ….. తిక్కదెంగిందంటే బిడ్డా నీకు సుప్రబాతమే !!

   • నాకెందుకో మీరు కూడా తండ్రి అనే మాట తెచ్చి తప్పుచేశారేమో అనిపించింది. కొంచెం ప్రొఫెషనల్ గా మాట్లడాల్సింది.

 11. ప్రవీణ్ నువ్వు అర్జంటుగా సైక్రియాట్రిస్ట్ ని సంప్రదించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంకా ముదిరిపోతే చుట్టుపక్కల వాళ్ళే నిన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. జాగ్రత్త నాయనా. ఈ రోజుల్లో పిచ్చి ఈజీగా తగ్గిపోతుంది. ఒక్కసారి చూపించుకో

 12. అయ్యా ప్రవీణ్ గారు, నేను నా వాదనకి బలంగా ఒక లంకె ఇచ్చాను,(తమరు తప్పక చదివి మీ సందేహాలు తీర్చుకుని వుంటారు, అవునా ) బూతులు అందరూ తిడతారు, అందరికి వచ్చు. ఇక్కడ సమస్య ఎమిటంటే ఎవరిని,ఎందుకు,ఎలా,ఎంత సాంద్రతతో, ఎందుకు తిట్టరన్నదే పాయింటు. నిచ్చయంగా సీమాంద్రులు మనకంటే గట్టి బూతులు తిడతారంకుందాం, కాని ఎవరిని ఎప్పుడు ఎలా తిట్టరన్నది వాస్తవంగా అదారాలతో కావాలి బాబూ, సమజయిందా!!! ఇక మనవాళ్ళ నైపుణ్యత” సింగిడి కవితల రూపంలో ఎంత సృజనాత్మకంగా వైవిధ్యముతో రాసారో గమనించారా! అద్గదీ మన పెతిభ. వూరికే అదార రహితంగా మాట్లాడితే ఈ దుర్మార్గపు సీమాంధ్రులు మనలని ఉతికేస్తారు( కామెంట్ల రూపములో) కావున, తమరు అర్జంటుగా మన తెలంగాణాని, మన భాషని, మన కవులని తిట్టిన సీమంద్రుల కవితలని సేకరించి పుస్తక రూపములో వెలువరించి ఒకవేళ ఇప్పటికే పుస్తక రూపములో వుంటే దయచేసి లంకెలు, వివరాలు ఇచ్చి పుణ్యంకట్టుకొ రాదే. వూరికె గాలి మాటలొద్దు.ఇప్పటికే ఒకాయన గాలి మాటలు, పనులు చేసి ఇక్కడ వున్నారో తెలుసుగా 🙂

  • సమజయిందా అని ఉర్దూలో చెప్పక్కరలేదు. అర్థమైందా అనే పదం ఏ ప్రాంతంవాళ్ళకైనా అర్థమవుతుంది. బూతు కవితలు వ్రాసేవాళ్ళ కంటే ఆత్మాహుతి దాడులు చేస్తామనేవాళ్ళు గొప్పవాళ్ళా? ఆ కవితలు నేను చదివాను. అవి నిజంగా బూతు కవితలే. కేవలం ‘హైదరాబాద్ అభివృద్ధి చెందింది, ఆ హైదరాబాద్ తెలంగాణాలో ఉంది‌’ అని చెప్పి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నారు సమైక్యవాదులు. మర్డర్లు చేసినవాడు రేప్‌లు చెయ్యలేదని చెప్పి జస్టిఫై చెయ్యాలా? కేవలం హైదరాబాద్ కోసం లేని సమైక్య భావన ఉన్నట్టు నటిస్తున్నవాళ్ళు బూతులు వ్రాయలేదని చెప్పి వాళ్ళని నమ్మాలా?

 13. ఎందుకు కావాలో కన్నా, ఎందుకు వస్తున్నాయో వ్రాసాను ఓపిగ్గా చదవండి.

  ఒకప్పుడు దేశంలో రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు కొత్తల్ల్లో సరిగా అతకక, ఎవరికివారు తాము అమాయకులమనీ, కలిసిన వాళ్ళు తమని ఎదో అన్యాయం చెసేస్తున్నారనీ, ఇలా అనేక అపోహలతో… తమకి మాత్రమే ప్రత్యక పేకేజీ ప్రకటించి{దేశంలోని మిగిలిన ప్రజలెవ్వరికీ లేని విధంగా} తమని రక్షించాలనో..కాపాడాలనో అప్పట్లో ప్రత్యక ఉద్యమాలు నడిచాయి. క్రమంగా అవగాహన పెరిగి అవి తగ్గు ముఖం పట్టాయి.

  అయితే రాజకీయ పార్టీల స్వార్ధ కొద్దీ మరిచిపొయిన వాటిని తిరగ తోడుతున్నాయి. వీటికి కారణం కొత్త రాజకీయ పార్టీలు పుట్టటం, అభివృధి కేంద్రి కరణే కారణం కావచ్చును.

  కొత్త రాజకీయ పార్టీల వలన అప్పటి దాకా అధికారాన్ని అనుభవించిన పార్టీలకి అధికారం పోవటంతో అవి దిక్కు తోచక ప్రజలు క్రమంగా మరచి పోతున్న వేర్పాటు భావనే అజెండాగా మళ్ళీ ప్రజలని రెచ్చగొట్టి కొత్తగా వచ్చిన పార్టీలను ఇరుకున పెట్టి తిరిగి పూర్వ వైభవం పొందాలని చూడటం వలన ఈ వేర్పాటు వుద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ఉదాహరణకు కాశ్మీరులో లోకల్ పార్టీని దెబ్బతీయటానికి కుట్ర ఎకంగా ప్రత్యేక దేశ డిమాండుకు దారి తీసింది, పంజాబులో అకాలిదల్ ను దెబ్బకొట్టతానికీ అకాలీ ఉద్యమం, అస్సాంలో లోకల్ పార్తీని దెబ్బకొట్టతానికి బొడో లాండ్, రాజస్తానులో గుల్జర్ల ఉద్యమం, బెంగాలులో గూర్ఖా లాండు మరియు ఈశాన్య భారతంలో జరిగే అల్లర్లు ఇలా ఒకటేమిటి అనేకం రాజకీయ పార్టీల వలన జరుగుతున్నాయి. కేవలం ప్రధాన మత్రి పదవి కోసం దేశాన్నే విభజించిన ఈ రాజకీయ పార్టీలకి స్వంతంగా బుద్ధి రావటం జరగదు. కాబట్టి ప్రజలే జాగరూతలై ఇలాంటివాటికి దూరంగా వుండాలి.

  ఇక అభివృధి కేంద్రికరణ వలన: ఈ వేర్పాటువాద “ఉద్యమాలు” సామాన్యంగా పెద్ద సిటీలు కలిగి వున్న ప్రదేశాలలోనే వస్తున్నాయి. ఉదాహరణకు ముంబైలొ హిందీ వారి మీద దాడులు, హైదరాబాదు కలిగి వున్న తెలంగానా ఇంకా విశాఖ నగరం కలిగి వున్న ఉత్తరాంధ్ర………. ఇలా ఎందుకు….????

  ప్రజలలో మనమంతా ఒకే దేశం అనే భావన లేక పొవటమూనూ…….మన నాయకులకి బుద్ధి లేక పోవటం వల్లనూ, అత్యధిక స్వార్ధం వల్లనూ జరిగుండచ్చు…

  ఎందుకంటే రాజకీయ నాయకుల ఆస్థులను ఎక్కడో ఒక చోట పెట్టుకొని పెంచుకోవాలి కదా…[ఉదాహరణకు మన రాష్ట ఎం.పి లకు మరియు ఎం.ఎల్.ఎ లకు వారి స్వంత గ్రామాలలో కన్నా హైదరాబాదు లోనే ఎక్కువ ఆస్థులున్నాయి] అందుకోసం కేవలం ఒక ప్రదేశాన్నే ఎంచుకొని అక్కడ వారు భూములు కొని వాటి విలువ పెంచడానికి అక్కడే పరిశ్రమలను, యూనివర్సిటీలు, పెద్ద ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి చాలా రకాల ఉద్యగ అవకాశాలున్నవి మరియు ప్రజోపయొగానికి చెందినవి ఒకే చోట వచ్చేటట్లు చేసారు.

  దీని వలన దేశం మరియు రాష్టం లోని ప్రజలు తమ బ్రతుకు తెరువు కోసం ఇలాంటి ప్రాంతాలకు వలస రావటం సహజం. కాని ఇక్కడ లోకల్ గా వున్నవారికి ఇది ఇబ్బంది గా మారుతుంది. లోకల్ వారికంటే నాన్-లోకల్ వారే అధికంగా వుండటం జరుగుతుంది. ఎందుకంటే ఈ పరిశ్రమలకి గానీ మిగిలిన వాటికి గానీ కావాల్సిన టాలెంట్ వున్న పనివారు ఒక్క ప్రాంతం లోనే దొరకటం కష్టం కదా…

  దీనితొ లోకల్ మరియు నాన్-లోకల్ అంటూ యుద్ధాలు మొదలవుతాయి. ఎక్కడినుండో వచ్చిన వారు తమ కళ్ళ ముందే ఎదిగి పోవటం లోకల్ గా వున్నవారికి సహజంగా అసహనం కలిగిస్తుంది. అది పెరిగి పెద్దది అయి దేశంలో వేర్పాటువాద ఉద్యమాలుగా రూపొందుతున్నాయి.

  .
  వీరు, బ్రతుకు తెరువు మాయలో పడటం వలన వచ్చిన వారు కూడా మన దేశం వారే కదా అనే విషయం మరుగున పడిపోతుంది. అంతే కాకుండా ఈ ఓటు రాజకీయాల వలన ఎందుకు పనికిరాని రాజకీయ నాయకులకి ఈ ఇష్యు మాంచి పండు లాగా దొరుకుతుంది. మాములుగా ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే చాలా ప్రజోపకరమైన పనులు చేయాలి. ఈ అసమర్ధ నాయకులకి అది చాలా కష్టం.
  వేర్పాటు వాద ఉద్యమాలు అంటూ ప్రజలని రెచ్చగొట్టే ప్రతి రాజకీయనాయకుడి గత చరిత్ర చూస్తే మనకే అర్ధమవుతుంది. వారు ప్రజలకి పనికొచ్చే పని ఒక్కటి కూడా చేసి వుండరు. కనీసం ఉద్యమం నడుస్తున్నప్పుడైనా సామాన్యుల సమస్యల గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఈ వేర్పాటు ఉద్యమాలకి కావల్సింది పనులు కాదు “ద్వేషం”…. ఇది రగిలిస్తే చాలు అక్కడ వున్న లోకల్ ప్రజల అంతరంగానికి ఆసరా దొరుకుతుంది. అసలు బాగా వున్న ప్రాంతాలని వదిలి బాగాలేని ప్రాంతానికి ఎందుకు వలస వస్తారూ అనే చిన్న విషయం ఈ అమాయక ప్రజలకి తోచక దిక్కుమాలిన రాజకీయ నాయకుల మాటల వలలో పడి పొట్టకూటి కోసం వచ్చిన వారిని ద్వేషిస్తారు. ఇది తప్పు అని చెప్పే వారే “దీని కోసం ఏదైన చెయ్యచ్చు” అని చెప్పటంతో వేర్పాటు[పొట్టకూటి]ఉద్యమాలకి అమాయక జనం కలిసి వస్తారు. వీరి ఆసరాతో పనికి మాలిన రాజకీయ నాయకులే పెద్ద ఉద్యమ నాయకులుగా మారతారు.

  వీరు అనేక రకాలుగా ప్రజలని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారు. అవి నమ్మిన అమాయక ప్రజలు తమ సాటి వారితో విడి పోతే ఏదో కలిసి వస్తుందని నమ్ముతారు. దానికోసం ప్రాణలనే బలిస్తారు. నాయకులు మాత్రం తమని, తమ పిల్లలని ఈ త్యాగాల నుండి మినహాయించుకుంటారు…ఉదాహరణకి చూడండి ఈ మధ్య కాలం లో జరిగిన ఉద్యమాలలో నాయకులు గానీ, నాయకుల పిల్లలు గానీ, మేధవులని చెప్పుకొనే వారు కానీ, ఈ మేధావుల పిల్లలుగానీ చనిపోయిన దాఖలాలు లేవు. కాని ఈ అమయక ప్రజలెవ్వరు ఇది గమనించరు. ఈ నాయకులు తమకు రావాల్సినంత రాజకీయ ప్రయోజనం వచ్చేవరకు ఇలాగె ప్రజలని వాడుకొని, తమ పని అవగానే ప్రజలని ఉద్యమాలని వదిలి ప్రజలని వెర్రి వాళ్ళని చేస్తారు.

  అందుకని, ఇంత గొడవ లేకుండా అభివృధిని రాష్ట్రమంతా దేశమంటా పంచుకునేట్లు జరగాలేగాని ఒకే చోట కేంద్రీకృతం కారాదు. దేశమంటే దేశ రాజధాని ఒక్కటే కాదు, అలాగే రాష్టమంటే రాష్ట రాజధాని ఒక్కటే కాదు అని మన స్వార్ధ పూరిత నాయకులు గమనించి నప్పుడే ఈ వేర్పాటు{పొట్టకూటి} ఉద్యమాలకి ప్రజలు లోబడరు. అలాగే రకరకాలుగా బలహీనులనుకునే వారికి రిజర్వేషన్ల ద్వారా బ్రతుకు తెరువు కల్పించాలి. ఇలాంటి బలహీనులందరూ కలిసి ఒకే ప్రాంతం లోనే వుండరు కదా….

  ఒక దేశలోని ప్రజలు ఎక్కడైనా బ్రతకచ్చని ఉన్నప్పుడు ప్రత్యేక విభజన ద్వారా ఏమి సాధిద్దామనీ? ప్రాంతాలని విభజిస్తే సామాన్య ప్రజలకి ఒరిగేదేమిటి అన్ని రకాల మంత్రులు ఒకరికి ముగ్గురో నలుగురో అవటం తప్ప………కాబట్టి, ప్రాంతాలని విభజించకుండా అన్ని ప్రాంతాలలో వున్న ప్రజలలో బలహీనులను గుర్తించి వారికి బ్రతుకు తెరువు కల్పిస్తే ప్రజాసామ్యంలో అందరికీ సమ న్యాయం చెసినట్లు అవుతుంది. ఒక రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్ని ముక్కలు చేసినా పర్వాలేదు. కానీ, ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతానికి వస్తున్నారనో లేక ఒక ప్రాంత ప్రజల అహంకారానికో తలొగ్గి మాత్రం ఎలాంటి విభజన చెసినా అది దేశ సమగ్రతకు ముప్పు తెస్తుంది. ఎందుకంటే ఈ దేశం అందరిదీ, ఏప్రాంత ప్రజల సొంతమో కాదు. అందరూ సెటిలర్సే ఎవరూ శాశ్వతం కాదు. ఇక్కడే పాతుకు పోవటానికి.

  అసలు ప్రజల మేలు కొరే వారెవరు కూడా ఈ పనికి మాలిన ఉద్యమాలంటూ కూర్చోరు…. ఉదాహరణకి టాటా, బిర్లా, బజాజ్, జిందాలు, అంబానీలు ఇలా ఒకరేమిటి ఇలంటి వారి వలన అనేక లక్షలు… అనేకన్న కోట్ల మంది ప్రత్యక్షంగా పరొక్షంగా బ్రతుకుతున్నారు.

  కానీ మన పనికి మాలిన రాజకీయ నాయకుల వలన ప్రత్యక్షం గా ఎంతమంది బ్రతుకుతున్నారు?….మేధావులమనే చెప్పుకునే వారి వలన ఎంతమంది బుద్ధి కలిగి పెళ్ళాం బిడ్డలను పోషించుకుంటున్నారు??విప్లవ గీతాలంటూ కుర్రాళ్ళను చెరిపే వారివల్ల సమాజానికి ఎమైనా లాభం వున్నదా…ఒకరి మీద ఒకరికి ద్వేషం తప్ప. వీరేదో గొప్పవాళ్ళమని సమాజ శ్రేయస్సు కోరేవారమని చెప్పుకొనే ఈ నీచుల వలన సమాజానికి శాంతి భద్రతల సమస్య తప్ప ఎమైనా లాభమున్నదా??? ఎవడి మీదో కోపం లేకుండా గానీ లేక ఏ ఇజానికో బందీ అయి కాకుండా స్వేచ్చగా ఆలోచించి చూడంది.

  • రాధ కృష్ణ గారూ అద్భుతం ,మీరు చెప్పిందతా అక్షరాలా నిజం,మరో విషయమేమిటంటే , తెలంగాణా ఆంధ్రలో కలసినప్పటి నుంచే తెలంగాణలో ఎం ఎల్ ఎ ,ఎం ఎల్ సి ,ఎం పి లు అందరు తెలంగాణా వాళ్ళు నిలబడుతున్నారు,గెలుస్తున్నారు,మరి ఇన్ని సంవత్సరాలు వీరి ఏలుబడి లోనే తెలంగాణా vunnadi మరి veeru enduku daanini develop chesukoleka poinaaru? samme chesthe thama telangaana prajale nasta pothaarane, thema telangaana rogule chani pothaarani,telantaana prayaanikule kasta padathaarani,telangaana bhaveshyatthe naasanam avuthundani, kaneesa parignaanam kala o saamaanyudainaa telusukontaade? mari ee telangaana naayakulake theliyaka povadam entha rotho kadaa? mari veerini nammi gelangaana saadhisthe daani paristhithi emity? ee vedhavalakiu( naayakulaku) ika evaripai nepam pedathaaru? telangaana vaaru andhra vaipu vasthe evaru addukonnaaru? ee telangaana naayaka vedhavalu kadaa? veerini telangana sodarulu kshamincharadu, eekalam brathuku deruvu kosam e praantham vaarainaa desaale vadili pothunnaaru,.em telangaana vaaru ithara desaalaku velladam ledaa? deenini kooda rajakeeyam chesthe elaa? koopastha mandookaallaa telangaana vaaru vundaalani telangaana nayakulu korukunte vaariki gorrella thaloopadam koodaa thappe ani veeriki teliyaka povadam chaalaa vichaarakaram. kcr dhoortha kutumbham mayalo padakunda veeriki aa bhagavanthudu telive prasaadinchaalani korukundaam.

 14. మీ కడుపు సల్లంగుండా, మంచిగ జెప్పినవ్ సారూ, అయినా మా తెలంగాణా మాగ్గావాలే! మా”కచరా” దొర జెప్పిండు. ఈ ఉపొధ్గాతాలు, మంచి మాటలు,చర్చలు ఇవన్ని సీమాంద్రుల కుట్ర.

 15. అయ్యా ప్రవీణ్ గారు,ఇదిగో ఇలాగే మనం సీమాంద్రులముందు బకరాలయ్యేది. ఎదైనా వాదనకి అదారాలు చూపించి చేస్తే బలంగా ఉంటుంది.టాపిక్ ఏమిటనేది ముందు తెలుసుకు తరవాత వ్యాఖ్యానించు బై! ఎవరు ఎలా తిట్టరనడానికి నేను అదారాలు చూపించాను. డొంక తిరుగుడు సమాధానాలు వద్దు. సూటిగా అదారాలు చూపించు అంతే! అడ్డగోలు వాదనలొద్దు.రాజకీయ నాయకుల మాటలు,సమర్ధనలు వాదనలు ఎంత అవకాశవాదంగా ఉంటయో అందరికి తెలుసు. కనీసం మనమైనా కూసింత విచక్షణతో ఉందాం,కామెంటుదాం 🙂

 16. First of all let me appreciate you for raising such an authentic question.Due to some false propaganda useless slogans are being highlighted like u mentioned above.And i would like to tell you that giving one line answers are not possible for any question.The same thing applies to this problem also.As per my knowledge i have given some thoughts about T demand. And i hope you will more than good answers than me.
  good luck.
  But…..the thing is…. i am sorry being indians we are injecting poison ourselves and becoming enemies.This is not good for our country.

   • 1) I am sorry your objection to my answer in not clear.Tell me what have you agreed not what not.Let me clarify you that for larger problem the solution should be mixture of everything.Even though you do not agree go through history.
    2) OK let me put it to you in another way,All kind of feelings have included in this movement. Calm,angry,emotion,intelligent,hate,peace. It is very unfortunate that you are looking in emotional way. That is why you are struck in understanding real picture.

 17. నువ్వు ఏమి చేసినా నాకు నష్టం లేదు. కానీ నేను వ్రాయని విషయాలు నేను వ్రాసానని అబద్దం చెపితే మలకపేట రౌడీకీ & ఆలమూరు సౌమ్యకీ ఇచ్చిన ట్రీట్మెంట్ నీకూ ఇవ్వగలను. నా సంగతి నీకు తెలిసినట్టు లేదు.

  • ఏం బెదిరిస్తున్నావా ! ఏంటి నువ్వు నాకు ఇచ్చేది , నీగురించి నాకే తెలియాలేం … ముందు నాగురించి తెలుసుకొ తరువాత మాట్లాడు ముందు ఓళ్ళు దగ్గరపేట్టుకొ , నువ్వేదైనా ఉద్దరించుకొవాలంటే నీ బ్లాగులొ రాసుకొ నా బ్లాగులొ గెలకొద్దు .

   • గెలకడం కాదు, నా కండకావరం ఎంత శక్తివంతమైనదో నీకు తెలిసినట్టు లేదు. ఈ రాత్రి ట్రైన్‌కి బస్తర్ వెళ్తున్నాను. కొన్ని రోజులు తిరిగొచ్చిన తరువాత చూస్తానులే.

 18. 1.arey baboo telangana enduku kavalante aha na kodukuliki baga devolope ayina prantham kabbatti. a adee gaka hyderabadlo per day ki 100 crores revenue vastundi.

  2.koncham bga alochiste ardham avutundi. prethi desaniki (every country) ki rajadhanulu (capitals) rendu undali. did u know that. manadesaniki north india lo new delhi unnate south india lo okati kavali kabatti adi south ki centerlo unna hyderabad ke aha chance undi kabatti adi second capital ayite dani meda vache revenu kcr&ko bokkachu.

  3.atika telitealu unaavariki dout ravachu south lone yenduku ante east, west lo antha space ledu west lo unna adi yekkuva prantham vistarinchi ledu kavuna south lo tappa mari ekkada chance ledu.

  4. water is the main issue. telangana nundi water vastayi kani telangana ku water levu antaru nijame kani water down ki veltayi kani highet lo ki vellavu ani telusukovali. present two dams kadutunnaru vatini sagam katti apesaru, akkada unna prajalu chepputo kcr ganni kotti nuvvu mundu dam katti raa ani cheppamanandi, telangana ante hyderabad okate kadu.migilina pranthalanu drustilo unchukuni adagali.

  5. odata karnata kalo kattina katta botunna dam lanu apamanu apakapote migiledi yendipoyina bedu bhume tappa yemi ledu.

  6. kabatti telanga prajalara sorry mundu manamantha indians taruvate telangana, costal andhra, rayalasema. what ever we don’t want the hesitation wright.

  7. telangana vachina rakapoyina normal people rata emi maradu kcr annattu andariki govt.joblu ravu aha vishayam meku kuda telusuga. so think logikally.

  8.potta kuti kosam puttina urini perigina place ni vadili vacharante entha bhada lo unte vastaru vakkasari alochinchandi. example: meru local edi ayina godava ayite batch to velli kodataru, adi akkadi nundi vachina vallu tappu valla vipu unna vedine kodataru.
  so alochinchu kondi

  9. south india lo unna ati pedda state andhra danini vidagodite vache labam evariki think ur self

  10. evarinina ibbandi pettina ratalu unte nannu kshminchandi. sorry

  annatu naa peru meku cheppaledu kada my name is suresh from hyd.

 19. కూర వండెటపుడు కూరగాయలు ఎందుకు తరుగుతారో తెలుసా??
  పోట్లకాయ సరిగా తోందరగా ఉడకాలంటె ముక్కలు చేయాలి

  ఒకే ఇంట్లొ గదులు ఎప్పుడు కట్టల్సిన పరిస్తితి వస్తుండి
  ఒక అల్మారా లో అరలు ఎందుకు
  ఒకే కంచం లో అందరూ తినగలరా?

  రాష్ట్రం కేవలం పరిపాలనా సౌలభ్యం
  పరిపాలన అందరికి చేరాలంటే జనాభా ని బట్టి పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలి
  ముప్పై రెండు కోట్లున్న అమెరికా లో యాభై రాష్ట్రా లుండగా నూటా ఇరవై కోట్లు ఉన్న భారతదేశం లో నురు రాష్ట్రా లు ఉండాలి

  రండి మన రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రా లు గా విభజిద్దాం
  తెలంగాణా వస్తే మనకొచ్చే నష్టమేదీ లేదు …జగన్,లగటపాటి,కిరణ్,చిరంజీవి,బాబు ల రాజకీయ కంట్రోల్స్ పోతాయి అంతే

   • అమ్మ వేరు నాన్న వేరు…..అయితే పిల్లలు పుట్టరు కదా?
    ఒకటి అయ్యక పిల్లలొచ్చారు
    ఆంధ్రా తెలంగాణా అమ్మ నాన్న ల్లా కాదు అన్నా తమ్ముల్లా భరతమాత బిడ్డలు గా కలిసి పెరిగారు…కుటుంబం సైజు పెరిగింది
    అందుకే ఒక గది ఇంట్లో కట్టల ని చిన్న తమ్ముడు కోరుతున్నాడు,,,పెద్దాడు అర్థం చేసుకొని ఇంకొ గది కట్టుకోమనాలే కాని సమైక్యం అంటె తమ్ముడి కాపురం ఏమి కాను ???

 20. నాకు ఒక తెలంగాణ ఫ్రెండుచెప్పినవిషయం.అసలు తెలంగాణకోసం కె.సి.ఆర్ ఇవన్నిచేయడం లేదు.ఇక్కడ సీమాంద్రనుంచి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విజయవాడలోనో,వైజాగ్ లోనొ భూములు తక్కువరేటుకు కొంటారు.తర్వాత కె.సి.ఆర్ దగ్గరకువెళ్ళి మీరు ఉద్యమం చెయ్యండి,తెలంగాణ తొందర్లోనే వస్తుందని ఒక డేట్ చెప్పండి అని కొంతడబ్బు(10 కోట్లు)ఇస్తారు.తర్వాత కె.సి.ఆర్ ఉద్యమాన్ని ఉద్రుతంచేస్తారు,ఫలానా తేదిలోపల తెలంగాణ వస్తుందని ప్రకటిస్తారు.కె.సి.ఆర్ అలా ప్రకటించగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ్ వస్తుంది ఆంద్రారాజధానిగా విజయవాడ లేదా వైజాగ్ అవుతుందని ప్రచారం చేస్తారు.ఇంకేముంది వీళ్ళుకొన్న భూములకు రెక్కలొస్తాయి.ఈ భూముల్ని ప్లాట్లు వేసి భారీలాభాలకు అమ్ముకుంటారు.వీరికి 30,40 కోట్లు మిగులుతాయి.తర్వాత కె.సి.ర్ ఉద్యమాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేస్తారు.ఎవరైనా అడిగితే వ్యూహాత్మక మౌనం అంటారు.

 21. ఏ దిక్కుమాలిన న్యూస్ చానెల్లోనొ ఎదో ఆశించి చేసిన ఇంటర్వ్యూ కాదు. సూటిగా వాస్తవాలని నిజాయీతీగా, తెలంగాణా వస్తే ఏమి జరుగుతుందో మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పిన ఒక స్వాతంత్ర సమరయోధురాలి బంగారమంటి మాటలు-తూటాలు.దయచేసి విడియో పూర్తిగా చూడండి.

 22. Naku appudu ardam kaledandi, kani eppudu telesindhi.
  Inka AP lone undi unte, Kaleshwaram project pundhulu kuda padha niche vallu kadu, Telangana topography valla electricity costs ye ekkuva untai ani namminche vallu.

  Dani tho patu
  Jai రైతు బంధు
  Jai రైతు భీమా
  24 గంటల ఉచిత విద్యుత్
  జై రైతు రుణమాఫీ
  Jai కొత్త గిడ్డంగులు
  Jai గురుకులాలు
  Jai సన్నబియ్యం
  జై కల్యాణ లక్ష్మీ
  Jai శాదిముభారక్
  జై జై ఆసరా
  జై కేసీఆర్ కిట్
  జై govt హాస్పిటల్స్ లో మెరుగైనా వైద్య సేవలు
  Jai అమ్మ ఓడి
  జై ఇంటింటికి నల్లా నీళ్లు
  Jai మిషన్ కాకతీయ
  Jai 102000 పోస్టులకు అనుమతులు నోటిఫికేషన్
  జై గొర్రెల పంపిణీ
  జై పశువుల పంపిణీ
  జై కంటి వెలుగు
  65% పూర్తి అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్
  జై మన నీళ్లు మనకే అన్న నినాదం అందులో భాగంగానే ప్రాజెక్టులకు అధిక నిధులు….

  CHEPPUKUNTA పోతే చాలా పథకాలు ఉన్నాయి.

  2004 – 2014 i.e in 10 years 1,07,000 crores were spent in Telangana
  2014-2018 in < 4 years 1,19,000 crores are spent in Telangana just because of KCR.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s