‘అనంతం’ చదివా !

అవును నీను అనంతం చదివాను , శ్రీశ్రీ  రాసిన అనంతం , చదువుతున్నంతసేపు అనంతం కుడా అనంతంలానే అనిపించింది . మొత్తానికి చాలా రొజుల తరువాత ఒక పుస్తకాన్ని మొత్తం చదివాను , నేను చివరిసారిగా మొత్తంగా చదివిన పుస్తకం నాయకురాలు నాగమ్మ .

యాద్రుచ్చికంగా ఇలా ఎందుకు జరుగుతుందొ నాకు అర్దం కాదు గాని  నాకు బాగా గుర్తు నేను నవొదయ పాఠశాలలొ చేరినతరువాత (పుస్తకాలు నేను బాగా చదివింది ఇక్కడే) మొదటగా తీసుకున్న పుస్తకం ‘మహాప్రస్థానం’ ,అప్పటికి నాకు శ్రీశ్రీ పేరె తెలుసుకాని ఇంకా ఏమి తెలెదు ! మహాప్రస్థానం కుడా పుస్తకంపేరు , శ్రీశ్రీ అనే పేరు చుసి తీసుకున్నాను తరువాతా మనం పెద్ద ఫ్యాన్ అనుకొడి , తరువాత మొదటగా బ్లాగింది శ్రీశ్రీ కవితనే  మళ్లీ ఇన్నాళ్లకు  ‘అనంతం’ తొ చదవటం మొదలెట్టాను .

అసలు విష్యానికొస్తే ఆదివారం లైబ్రరీలొ అరువు తీసుకున్న పుస్తకం ‘అనంతం’  , ఈ పుస్తకాన్ని ఇది వరకే ఒకసారి చదువుదామనుకున్నాను నా దురద్రుస్టం దాన్ని నదగ్గరనుంచి ఎవరొ దొంగిలించారు :(  అలా ఆగిన నా అనంత శొధన మళ్ళీ ఆపుస్తకం కనిపించడంతొ మొదలైంది , ఇంట్లొ కాలీ దొరికినప్పుడల్లా చదివాను అసలు సొమవారానికె ముగిద్దామని అనుకున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు .మొత్తానికి ఈ ఉదయం పూర్తి చేశాను , చదివిన తరువాత ఏదొ విజమం సాదించినవాడిలాగా విజయ గర్వంతొ ఊగిపొయాను , మొత్తాని ఏదొ తెలియని ఫీలింగ్ , నాకు శ్రీశ్రీ కి ఆలొచనా ధొరణిలొ   కొన్ని సరిపొయాయని నాఫీలింగ్  అందుకేనేమొ😉 .

ఈ ‘అనంతం’ లొ నాకు శ్రీశ్రీ కి నాకు తెలిసిన వారు ఉన్నారు (నాకు వాళ్ళతొ  పరిచయం లేదు అనుకొండి !!) వాళ్లు ‘వరవరావు ‘ ,’రంగనాయకమ్మ ‘ మరియు మా నియౌజకవర్గ మాజీ యం.యెల్.ఏ ,మాజీ ముఖ్యమంత్రి వెంగళరావు.

ఈ ‘అనంతం’ చదువుతున్నంతసేపు నాకు ఎక్కడ శ్రీశ్రీ అబద్దం చెప్పరని అనిపించలేదు !!
కాని అనంతాన్ని  నవల అన్నారు , శ్రీశ్రీ నే నవల అంటే కల్పిత కధ అని , ఎంత అందంగా అబద్దం చెప్తే అంతగొప్ప రచయిత అని అన్నారు  కాని తన అనంతాన్ని నవల అని ఏందుకన్నారొ  నాకు గొచరించలేదు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s