ఒక్క ఒరలొ రెండు కత్తులు

గెలిచింది ఒక్క స్థానమే అయినా రాష్ట్ర నాయకత్వం మొత్తం హడావిడి ఇంతా అంతాకాదు ! ఇది ఉపఎన్నికల్లొ బీ.జె.పి సాధించిన విజయం.ఈ విజయం ఏం అంత సామాన్యమైనది ఏమీ కాదు ..ఇది బీ.జె.పి కి కొఉస్తాహాన్ని ఇచ్ఛింది ఇప్పుడు బీ.జె.పి రాయకీయ వ్యూహాలు మారాయి.తెలంగాణా వాదం దాని మీద నెట్టు కొచ్చే ఏకైన పార్టీ టి.ఆర్.యస్ ని కాదని అక్కడ పాగావేయడం నిజంగా అభినందించ దగిన విషయమే !
రాజకీయం గా ఇప్పుడు తెలంగాణా వాదాన్ని బలంగా ప్రజలలొకి తీసుకొని వెల్తూ టి.ఆర్.యస్ కి తెలంగాణా లొ మరొక ప్రత్యమ్నాయం గా మారుతుంది ఇప్పుడు తెలంగాణా ప్రజలు బీ.జె.పీ ని కుడా తెలంగాణా కు బీ.జె.పీ ఛిత్తశుద్దితొ ఉందని విశ్వశిస్తారు అని నా నమ్మకం.ఇప్పటికే తెలంగాణా ప్రజలు టి.ఆర్.యస్ మీద చాలా అసహనం గా ఉన్నా వేరే గత్యంతరం లేక ఆ పార్టీ నే నమ్ముకున్నారు ,  ఇప్పుడు వాళ్ళకు బీ.జె.పీ ఒక ప్రత్యమ్నాయం ..అందులొనూ ఈ విజయం బీ.జె.పీ కి ఎంత  ఉత్సాహాన్ని ఇచ్చిందొ నిన్న ఆ పార్టీ శ్రేణులు చేసిన హడావిడి చూస్తే నేతెలుస్తుంది , ఇది తప్పకుండా వీరికి ఇది రాయకీయ విజయమే .
కాని వీరు టీ.ఆర్.యస్ ధాటికి నిలబడగలరా ! టీ.ఆర్.యస్ తెలంగాణా వాదాన్ని వేరే ఇతర రాజకీయ పార్టీ కి ఉపయోగపడనిస్తుందా ! ఇప్పటి వరకు తెలంగాణా లొ వచ్ఛిన ఏ తెలంగాణా ఉద్యమైనా అది టీ.ఆర్.యస్ కను సన్నులలొనే జరిగింది అది జె.ఏ.సి అయినా కొదండరాం అయినా .. సకల జనుల సమ్మెఅయినా ! ఇప్పుడు బీ.జె.పీ కి మరొక రాయకీయ శత్రువు టి.ఆర్.యస్.నేను అయితే టీ.ఆర్.యస్ బీ.జె.పీ ని కలుపుకు పనిచేస్తుందని నేను అనుకొను , ఇంతకీ తెలంగాణా వాదాన్ని అడ్డంపెట్టుకుని బాగానే గెలిచారు ,ఉపఏన్నికలు తెచ్ఛి అసెంబ్లీలొ అటు టీ.ఆర్.యస్ ,బీ.జె.పి ఇటు జగన్ అసెంబ్లీ లొ సంఖ్య పెంచుకున్నారు , వీళ్ళు వీళ్ళని గెలిపించిన ప్రజలకొసం ఏంచేస్తారొ చూద్దాం.

ప్రకటనలు

నిజంగానే విశ్వతనీయతే గెలిచిందా !

 కొవూరు ఏన్నికల్లొ వై.యస్.ఆర్ కాంగ్రేస్ గెలిచింది , ఇప్పుడు నేను గెలిచింది కదా అని విమర్శించడానికి రాయడానికి రాయడంలేదు ,
 గెలవడానికి ఏన్నొ కారణాలు ఉండొచ్చు , ధనబలం బాగా ప్రభావితం చేసి ఉండొచ్చు కాని ఆ పని ఒక్క వై.యస్.ఆర్ కాంగ్రేస్ మాత్రమే
చేసిందా ! సమస్యే లేదు అన్ని పార్టీ లు అదే పని చేశాయి/చేస్తాయి కూడా మరి వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ మాత్రమే ఎందుకు గెలిచింది ?
దానికి 70కొట్లు  ఎక్కడినుంచి వచ్చాయి , ఏం ఆడబ్బులు తెలుగుదేశం దగ్గర లేవా , కాంగ్రేసు వారి దగ్గర లేవా ! ఉన్నాయి అయినా
ఎందుకు ఖర్చు పెట్టలేదు ! ఏం ఈ విజయం వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ కి తప్ప మిగతా వారందరికి ఏందుకు అవసరంలేదు !
ఈ ఎన్నికలొ గెలవటం ద్వారా జగన్ కేంద్రంలొ కాంగ్రేస్ వారికి ఏం చెప్పదలచుకున్నాడు … అరెస్ట్ నుంచి తప్పించుకొవాలని చూశాడా !
అన్ని డబ్బులు అసలు వై.యస్.ఆర్ కాంగ్రేస్ వాళ్లు ఎలా పంచగలిగారు ,అనూహ్యంగా తెలుగుదేశం వాళ్ళదగ్గర  కొట్లు ఉన్నట్లు ఎవరు సమాచారం
ఇచ్చారు అంటే కాంగ్రేస్ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ డబ్బులు మాత్రమే ఎందుకు కనిపించాయి … వై.యస్.ఆర్ కాంగ్రేస్ వాళ్ళవి ఎందుకు కనిపించలేదు !

ఇంత చేసి ఈ విజయం లొ ప్రజలు చూపిన విశ్వతనీయత ఎక్కడుంది !?

తెలంగాణా ….తిమ్మిరి

అంటే సమైఖ్యవాదం అంటారు కాని …. తెలంగాణా కు అనుకూలమన్నా తప్పే , ఏమీ మాట్లాడక పొయినా తప్పే !
అవును మరి తెలంగాణా చంద్రబాబు జేబులొ పెట్టుకు తిరుగుతున్నాడు తీసి ఇవ్వడానికి !
ఇంత చేసి కాంగ్రేస్ వాళ్లను ఏమీ అనరు … సమైఖ్యాంద్ర బొర్డ్ పట్టుకున్న జగన్ ని ఏమీ అనరు …
ఎటుచేసి ఎప్పుడు చంద్రబాబు మీద పడి ఏడవడం మటుకు మహబాగాతెలుసు ఈ మా ఎర్రి సొదరులకి ..
పొనీ చంద్రబాబు ఏమైనా అడ్డుకుంటున్నాడే అనుకుందాం .. కాసేపు , అప్పుడు తెలంగాణా చివరివరకు తరిమికొడతారట ,
సరే కొడతారు సరే ! మరి తెలుగుదేశం పార్టీ ఏంచేసిందని నాశనం అయిపొవాలి ! ఇక్కడే అర్దమవలా మాజనాల అసలు ఏడుపు
ఏమిటొ… వీళ్ళకి ఈ తిమ్మిరి ఎప్పుడు తగ్గుద్దొ ఏమిటొ … వీళ్ళతలతిక్క పనులకి నాలాంటి తెలంగాణా వాళ్లకి తెలంగాణా అని చెప్పుకొవడానికే సిగ్గుగా ఉంది .

కమీషన్లు పెంచిన కాంగ్రేస్ ప్రభుత్వం

కాంగ్రేస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలొ కాంట్రాక్టులు మొదలైన పనులకు ఇదివరకు ఉన్న 10 శాతం కమీషన్ రేటును ఏకంగా 30 శాతానికి పెంచారట !
వచ్చే సారి ఎలాగూవస్తామని నమ్మకం లేక దొరికిన కాడికి దొచేస్త్తున్నట్టున్నారు , మహాప్రభువులు.
వీళ్ళకే 30 శాతం ఇస్తే ఇక కాంట్రాక్టర్ ఏంతినాలి .. ఇక చేసిన పని నాణ్యత గురించి మాట్లాడటం కూడా అనవసరం అనుకుంటా ….

హొళీ… వెంటాడే జ్ఞాపకం

హొళీ ఇప్పటికి నాకు ఈ పండగంటే రంగులు పూసుకొవడం అనే ఉస్తాహమే తప్ప ఇంకా ఏంలేదు … నాకు ఈ పండగకు పెద్దగా చెప్పుకొదగ్గ తీపి గుర్తులు ఏంలేవు … కాని హొలీ అనగానే గుర్తుకువచ్చే సంఘటన మటుకు ఒకటి జరిగింది అది నా ఇంజనీరింగ్ చివరి సంవస్తరం లొ జరిగింది !
అప్పటివరకు ప్రతిసంవస్తరం లానే స్నేహితులతొటే బాగానే జరుపుకునే వాళ్ళం హొళీ కాని అది ఇంజనీరింగ్ చివరి సంవస్తరం ఇక ఎవరి పనులలొ వాళ్ళున్నారు ఎవరికి వారు హైదరాబాబ్ అనొ ఎటొ వెళ్ళిపొయారు … నేను ఉదయం సుమారు తొమ్మిది .. పది ఆ మధ్యలొ రూం నుంచి బయటికి వచ్చాను మా ‘మమతా’ మెస్ లొ ఒక టీ తాగి ఇల్లందు క్రాస్ రొడ్ కి వస్తున్నాను నడుచుకుంటూ , ఇల్లందు క్రాస్ రొడ్ ఇది ఆంగ్ల అక్షరం ‘టీ’ లాగా ఉంటుంది అందులొనే ఒక మూలకి రెండవ పట్టణ పొలీస్ స్టేషన్ కూడా ఉంది ,ఆరొజు  జనాలు రంగులు చల్లుకొని ఊరుకుంటారా ఎవరొ ముగ్గురు హొళీ బాగానే ఆడినట్టున్నారు తరువాత బాగా తాగి ఇల్లందు క్రాస్ రొడ్ నుంచి వస్త్తున్నారు అక్కడే పొలీస్ స్టేషన్ ఉంది కదా ఎవడైనా ఆపుతాడేమొనని మంచి స్పీడ్ మీద వస్తున్నారు బండి మీద ఒక పక్కనుంచి బస్సు వస్తుంది  వీళ్ళకి ఆ బస్సు కనిపించలేదు అందులొను ఆస్పీడ్ లొ వెళ్ళీ పొవచ్ఛనుకున్నారు కాబొలు పొయి బస్సుకింద దూరారు ఇదంతా నాకళ్ళ ముందు లీలగా జరిగింది అందరిలానే నేను వెళ్ళి చూశాను … అప్పటికే ఇద్దరు అక్కడే చనిపొయారు .. ఇంతలొ 108 వచ్చింది ఇంకొకడు కూడా అనుమానంగానే ఎక్కించారు … తెల్లారి పేపర్లొ చూశాను ఆ శాల్తి కూడా ఖతం అని !! నాకు ఎందుకొ కొన్ని రొజులు పట్టీంది ఆ భయంనుంచి బయటికి రావటానికి . ఇంకా అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది !

తెలుగుదేశం తరువాతే ఏ పార్టీ అయినా ( ప్రాంతీయ , జాతీయ ) ,ఏదైనా !!

ఏందుకొ ఈరొజు నాకు అనుకొకుండా ఒక ఆలొచన వచ్ఛింది ఏ పార్టీ వెబ్ సైట్ ర్యాంక్ ఏంత ఉందొ చూద్దామని ! అనుకున్నదే తడవుగా చూస్తే నాకు రిజల్ట్స్ చూసి ఆశ్చర్యమేసింది , ఏందుకంటే ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంది జాతీయపార్టీ అయిన కాంగ్రేస్ కి దరిదాపులలొ కూడా లేదు !
తెలుగుదేశం : 6,490 ఉండగా ప్రస్తుత పరిపాలిక పార్టీ కాంగ్రేస్ ది 61,690 కొంత మెరుగ్గా బీ.జె.పి ది 13,234 ఉండగా లొక్ సత్తాది 57 వేలు పైచిలుకుగా ఉంది !
ఈ ర్యాంకులన్ని అలెక్సా నుంచి సేకరించాను .