భార్గవి హత్యొధంతం పై tv9 వార్తా కధనశైలి

…ఒక సినీనటి భార్గవి  హత్య..మీడియా కవరేజీ….పొద్దుటినుంచి ఇదే మన తెలుగు మీడియా లొ ప్రదాన వార్త !

అన్ని  చానళ్ళకు ఈరొజు ఇదే ప్రదాన వార్త ! ఒక్కొకరిది ఒకొక్క శైలి, ఇప్పుడు నేను ఇక్కడ టి.వి 9 గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను.ఎందుకంటే వాళ్ళు చేసినహడావిడి అందరూచేశారు(tvల వాళ్ళు) కాక పొతే వీళ్ళు  తేడా కదా! నాకు అని పించినతేడాలేంటి అంటే..

వెనుక భాగం లొ ఒక చాయాచిత్రం పెట్టి దానికి ఒక దండ వేసి …హత్య పై తమదైన శైలిలొ విశ్లేషణలు …

ఇక వార్తకి వద్దాం ..

–>నగరం లొ ప్రముఖ సినీనటి దారుణ హత్యతొ సినీపరిశ్రమ ఉలిక్కిపడింది?(ఇక్కడ ప్రముఖ నటి ఎవరొ, దీనితొ పరిశ్రమ ఎలా ఉలిక్కిపడ్డ  దొ నాకు అర్దం కాలేదు?) అసలు సినీపరిశ్రమ ఉలిక్కిపడేంత సంఘటన అక్కడ ఏం జరిగిందని !!

–>ఇక రెండవది ఇది మన తెలుగువారందరికి మండే విషయం….ఆ మహాతల్లి  ఎవరొకాని , భార్గవి గురించి చెబుతూ ” ఈమె మంచి ప్రవర్తనతొ ఇప్పుడిప్పుడే పరిశ్రమలొ ఎదుగుతున్న ఆరు అణాల ….పదహారు అణాల తెలుగమ్మాయి” అని అంది!

–>ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందొ అక్కడ మావిలేఖరిని అడిగితెలుసుకుందాం అని వాళ్ళ విలేఖరిని  చూపించారు..ఇక పిచ్చొడి చేతికి రాయిచ్చినట్టుంది  అప్పుడు పరిస్థితి…అసలు సంభందమేలేని విషయాలు  చెబుతూ అసలు విషయాన్ని ఎటుంచి ఎటొ తీసుకెళ్ళింది వాళ్ళ ప్రతినిధి! ఇక్కడ చిన్న కొసమెరుపేంటంటే…ఒక సుమారుగా 3 నుంచి 4 నిమిషాలు విడివిగల చిత్రాన్ని(విలేఖరి మాట్లాడి నది) అదే మళ్ళీమళ్ళీ తిప్పుతూ వెనుకాలా వాయిస్ ని మార్చి అప్పుడు అక్కడ జరుగుతున్నదే చుపిస్తున్నట్టు  నమ్మించేప్రయత్నం  చేశారు ?

ఇక నాకు అప్పుడు అని పించిందేమిటంటే నిన్న పంది….ఈ రోజు ఈసంఘటన చాలు ఒక రేండు రొజులు పండగ చేసుకొవడానికి  …

ప్రకటనలు