బ్లాగాలి

విపరీతమైన పని వత్తిడి , పక్కోడితో కూడా మాట్లాడలేని పరిస్థితి ! పొద్దునలేస్తే ఉరుకులు , పరుగులు , యాంత్రికజీవితం !!?
ఏంటో అన్నీకొత్తగా ఉన్నాయి … లేదు అలవాటుపడిపోతున్నాం ? అవును నిజమే , అందుకే మళ్లీ బ్లాగుతున్నా ! ఈసారి అడపదడపా తప్పితే రాజకీయాల గురించి రాయదలచుకోవడం లేదు .

కొన్నింటికి దూరంగా , కొంచం కొత్తగా ఇలా ఏమైనా రాద్దామని  మళ్ళీ మొదలెట్టాను , చూడాలి ఎలా వెళ్తుందొ !!

ప్రకటనలు

జబిల్లి ..ఇది నాబ్లాగు

చాలా కాలమైంది బ్లాగి , మళ్ళీచేయి బాగా దురదగాఉంది , సొ ఈ బ్లాగు ముఖంగా అందరినీ పలకరిద్దామని ఒక చిరు ప్రయత్నం. బ్లాగడం మానేసి చాలా కాలమైంది ! అమెరికా వచ్చిన కొత్తల్లొ రాద్దామని అనిపించినా కొన్ని కారణాల రీత్యా కుదరలేదు !

అందరికీ నమస్కారం

కినిగే పత్రిక …

కినిగే పత్రిక … ఇండియాలొ ఉన్నప్పుడు రొజూ పొద్దున్నే ఈనాడు పేపర్ చవందే రొజు మొదలయ్యేది కాదు ! అమెరికాకు వచ్చాక చిన్నగా ఈ-పేపర్ కు ఇప్పుడిప్పుడే అలవాటుపడిపొతున్నా ! అయినా ఇంకా ఏదొ వెలితిగా కొడుతుండేది .

ఇది నిన్నటి మాట .. నేను ఇండియాలొ ఉన్నప్పటినుంచి  కొద్దిగా ఈ బుక్స్ చదవటం అలవాటుచేసుకున్నాను , చాలా సౌకర్యంగాను ప్రశాంతంగా ఉండేది , కాని ఇక్కడి కొచ్చాక కినిగే వాళ్ళు ఒక పత్రిక ప్రారంభించారని చుసి ప్రయత్నిద్దాం ! అని అనుకున్నా ఎలాగూ ఫ్రీ ఏకదా !!! అని గూగుల్ ప్లే నుంచి ఉచిత పత్రికని దిగుమతి చేసుకున్నా , అద్భుతం  చాలా బాగుంది .మొబైల్ ఫొన్ లొ కుడా చాలా చక్కగా చదవడానికి అనుకూలంగా ఉంది ,  ఇది పత్రిక పై పలుకు .

చిత్రం

ఇక లొపలికి వెల్దాం , మొదటి ముత్యమె  శ్రీరమణ గారి వ్యాసం  ఇంకా లొపలికెలితే చాలా మంచి వ్యాసాలు ,కధలు  ఉన్నాయి . షొ చేయడానికి సరుకు దొరకని స్వాతి ని కొనుక్కొని పక్కనపడేసే బదులు  ఈ కినిగే పత్రిక ని ఫ్రీగా  డౌన్లొడ్ చేసుకొని ఆస్వాదించవచ్చు .

నావరకు ఇది ముత్యమే .. నిజం గా కినిగే వారు తెలుగు సాహిత్యానికి చేస్తున్న కృషి అభినందనీయం .

మీరు కూడా ఇక్కడ నుంచి ప్రయత్నించండి ….

http://patrika.kinige.com/

గూగుల్ ప్లే లింక్

https://play.google.com/store/books/details/Meher_B_Kinige_Patrika_December_2013_Telugu?id=woRSAgAAQBAJ

స్త్రీలను గౌరవించండి – 10tv

 

 

 

 

 

 

 

ఓ మహాత్మా , ఓ మహర్షీ !

ఏది చీకటి , ఏది వెలుతురు ?

ఏది జీవిత, మేది మృత్యువు ?

ఏది పుణ్యం , ఏది పాపం ?

ఏది నరకం , ఏది నాకం ?

ఓ మహాత్మా !

ఏది సత్యం , ఏ దసత్యం ?

ఏ దనిత్యం , ఏది నిత్యం ?

ఏది ఏకం, ఏ దనేకం ?

ఏది కారణం , మేది కార్యం ?

ఓ మహాత్మా !

ఏది తెలుపు , ఏది నలుపు ?

ఏది గానం, ఏది మౌనం ?

ఏది నాది , ఏది నీది ?

ఏది నీతి , ఏది నేతి ?

ఓ మహాత్మా !

ఏ దహింస , ఏది హింస ?

ఏది కష్టం , ఏది సౌఖ్యం ?

ఏది నష్టం , ఏది లాభం ?

ఏది మంచి , ఏది చెడుగు ?

ఓ మహాత్మా !

ఏది స్వప్నం , నేటి సత్యం –

నేటి ఖేదం , రేపు రాగం –

ఒకే కాంతి , ఒకే శాంతి –

ఓ మహర్షీ , హే మహాత్మా !

ఖడ్గసృష్టి  – మహాకవి శ్రీశ్రీ

నా మొబైల్ ఫొన్ పొయింది…సహాయం చేయగలరా

నా మొబైల్ ఫొన్ పొయింది … ఎంతొ ఇష్టపడి కొనుక్కున్న ఫొన్ అది శ్యామ్ సంగ్ గెలాక్సి నొట్ ! కొని నాలుగు నెలలే అవుతుంది ,
నేను ఎప్పుడు 2వేలు కూడా పెట్టలేదు అలాంటిది ఎంతొ ఇష్టపడి కొనుక్కున్నాను , కాని ఎలా కొట్టేశారొ కాని జేబులొనుంచి తీసేశారు ,
పొలీసు రిపొర్టు ఇఛాను కాని నాకు వాళ్ళు పట్టించుకుంటారని నమ్మకం లేదు ! వాళ్ళు మాట్లాడిన పద్దతి అది చూశాక , కాని ఎదొ తెలీని
భాధ , గుండె పిండేస్తుంది … దాని ఖరీదు నా ఒక నెల జీతం , కానీ మళ్ళీ కొనగలనా !
వేరే ఫొన్ తీసుకున్నా కాని మనసు మనసులొ లేదు తెలిసిన వాళ్ళ ద్వారా ఎదొ ప్రయత్నిస్తున్నాకాని ఎంతవరకు ఫలిస్తుందొ చెప్పలెం !

మీలొ ఎవరైనా మిత్రులు నా ద్వారా నా ఫొన్ ని వెతికి పెట్టగలరా … నాకు ఒక రింగ్ ఇవ్వండి నా ఫొన్ వివరాలిస్తాను ! 9652126789

ఇరవై కాదు రెండే !

నిన్నటి దాకా సాక్షి వాడు ఖాతాల స్థంభన వల్ల ఇరవై వేలమంది ఉద్యొగులు నష్టపొతారు అంటే నాకు ఎక్కడొ సానుభూతి కలిగింది … పాపం ఎలా సంపాదించినా అంత మందికి ఉపాధి ఉపాది కల్పిస్తున్నాడు కదా అని అనిపించింది … కాని సి.బి.ఐ అడిగిన ఒక ప్రశ్నకు సమాదానంగా జగతి పబ్లికేషన్ ఇచ్ఛిన సమాదానం ప్రకారం వాళ్లదగ్గర పని చేస్తున్న వారి సంఖ్య సుమారు 2300 మాత్రమే !

నిన్నటి నిన్న వాళ్ళ వెబ్ సైట్ లొ పెట్టు కున్న పొల్  వళ్ళ గాలే తీస్తే దాన్ని అసలు సైట్ లొనే లేకుండా తీసేశారు , ఇవేమి సాక్షి పేపర్ లొ రావు మళ్లీ వీళ్ళే చిరంజీవి కూతురు ఇంట్లొ దొరికిన డబ్బుగురించి ఏపేపర్ లొ రాలేదు ఒక్క సాక్షి లొనే వచ్ఛింది , సాక్షి … అది … సాక్షి ఇది అని డప్పుకొడతారు చెప్పేదేమో సారంగి నీతులు దూరేదేమో ____ గుడిసెలు .