ఆశ………….!

ప్రతి పరాజయం మళ్ళీ ప్రయత్నించటానికి ఒక కొత్త అవకాశం కలిపిస్తుంది.
నిన్నటి గురించి మర్చిపో.
నీకు తగిలిన గాయాలు ,అపజయాలు నీ మదిలోకి రానివ్వకు .
నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు.
ధైర్యంగా కలలు కను , ధైర్యంగా ప్రయత్నించు.
ఈ రోజు అందరికంటే గొప్పగా వుండటానికి ప్రయత్నించు.

ప్రకటనలు

ఓ వినాయకా..!

ఇంద్రాదిదేవతలచే కొలవబడుతూ
సర్వశక్తులను అందించే ఓ విఘ్నేశ్వరా
మా బ్లాగర్లకు
విజయాలను ప్రసాదించు.

త్రిమూర్తులను ప్రదమ పూజలతొ ఒప్పారే
ఓ ప్రమధగణాధిపతీ మా తెలుగు బ్లాగర్ల కు
మహొన్నతమైన యశస్సును అందించు.

మహర్షులచేత యజ్ఘ్నయాగాది ఫలాలను
అందుకునే ఓ వక్రతుండా  తెలుగు బ్లాగుల అబివ్రుద్ది కి సహకరించు
వారికి యశస్సు చేకూర్చు.

సర్వప్రాణికొటిచే నిత్యం అర్చించబడే
ఓ లక్ష్మీగణపతీ మా అబివ్రుద్దికి సహకరించు వారికి
ఐశ్వర్యాన్ని అందించు.

భక్తజనావళి శ్రేయస్సును కొరే ఓ గజముఖ
గణపతీ మా శ్రేయౌభిలాషులందరికీ
కోరిన కోరికలను ఒసగు.

వినాయకచవితి సందర్భంగా నిన్ను
కొలిచే మా పాటకదేవుళ్ళకు(బ్లాగు చదివేవారికి)  విఘ్నాలను
తొలగించి ఆయురారొగ్యాలను
అందించి అష్టైశ్వర్యాలను
ప్రసాదించవలసిందిగా ప్రార్దిస్తూ,

నీ భక్తుడు., 

విజయ కుమార్  కట్టా .

మహాప్రస్థానం–శ్రీశ్రీ

పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళులేచి,
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!
వచ్చేశాయ్, విచ్చేశాయ్,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈలోకం మీదేనండి!

నాకు నచ్చిన  కవిత ఇది..నాబ్లాగు లొ  మొదటగా మహాప్రస్థానం–శ్రీశ్రీ గారి ని స్మరించుకుంటు.. ఈకవిత.

నాకు ఎందరొ  మర్గదర్శకులు అందరికి శతకొటి వందనములు.