నా మొబైల్ ఫొన్ పొయింది…సహాయం చేయగలరా

నా మొబైల్ ఫొన్ పొయింది … ఎంతొ ఇష్టపడి కొనుక్కున్న ఫొన్ అది శ్యామ్ సంగ్ గెలాక్సి నొట్ ! కొని నాలుగు నెలలే అవుతుంది ,
నేను ఎప్పుడు 2వేలు కూడా పెట్టలేదు అలాంటిది ఎంతొ ఇష్టపడి కొనుక్కున్నాను , కాని ఎలా కొట్టేశారొ కాని జేబులొనుంచి తీసేశారు ,
పొలీసు రిపొర్టు ఇఛాను కాని నాకు వాళ్ళు పట్టించుకుంటారని నమ్మకం లేదు ! వాళ్ళు మాట్లాడిన పద్దతి అది చూశాక , కాని ఎదొ తెలీని
భాధ , గుండె పిండేస్తుంది … దాని ఖరీదు నా ఒక నెల జీతం , కానీ మళ్ళీ కొనగలనా !
వేరే ఫొన్ తీసుకున్నా కాని మనసు మనసులొ లేదు తెలిసిన వాళ్ళ ద్వారా ఎదొ ప్రయత్నిస్తున్నాకాని ఎంతవరకు ఫలిస్తుందొ చెప్పలెం !

మీలొ ఎవరైనా మిత్రులు నా ద్వారా నా ఫొన్ ని వెతికి పెట్టగలరా … నాకు ఒక రింగ్ ఇవ్వండి నా ఫొన్ వివరాలిస్తాను ! 9652126789

ప్రకటనలు

ఇరవై కాదు రెండే !

నిన్నటి దాకా సాక్షి వాడు ఖాతాల స్థంభన వల్ల ఇరవై వేలమంది ఉద్యొగులు నష్టపొతారు అంటే నాకు ఎక్కడొ సానుభూతి కలిగింది … పాపం ఎలా సంపాదించినా అంత మందికి ఉపాధి ఉపాది కల్పిస్తున్నాడు కదా అని అనిపించింది … కాని సి.బి.ఐ అడిగిన ఒక ప్రశ్నకు సమాదానంగా జగతి పబ్లికేషన్ ఇచ్ఛిన సమాదానం ప్రకారం వాళ్లదగ్గర పని చేస్తున్న వారి సంఖ్య సుమారు 2300 మాత్రమే !

నిన్నటి నిన్న వాళ్ళ వెబ్ సైట్ లొ పెట్టు కున్న పొల్  వళ్ళ గాలే తీస్తే దాన్ని అసలు సైట్ లొనే లేకుండా తీసేశారు , ఇవేమి సాక్షి పేపర్ లొ రావు మళ్లీ వీళ్ళే చిరంజీవి కూతురు ఇంట్లొ దొరికిన డబ్బుగురించి ఏపేపర్ లొ రాలేదు ఒక్క సాక్షి లొనే వచ్ఛింది , సాక్షి … అది … సాక్షి ఇది అని డప్పుకొడతారు చెప్పేదేమో సారంగి నీతులు దూరేదేమో ____ గుడిసెలు .

ఒక్క ఒరలొ రెండు కత్తులు

గెలిచింది ఒక్క స్థానమే అయినా రాష్ట్ర నాయకత్వం మొత్తం హడావిడి ఇంతా అంతాకాదు ! ఇది ఉపఎన్నికల్లొ బీ.జె.పి సాధించిన విజయం.ఈ విజయం ఏం అంత సామాన్యమైనది ఏమీ కాదు ..ఇది బీ.జె.పి కి కొఉస్తాహాన్ని ఇచ్ఛింది ఇప్పుడు బీ.జె.పి రాయకీయ వ్యూహాలు మారాయి.తెలంగాణా వాదం దాని మీద నెట్టు కొచ్చే ఏకైన పార్టీ టి.ఆర్.యస్ ని కాదని అక్కడ పాగావేయడం నిజంగా అభినందించ దగిన విషయమే !
రాజకీయం గా ఇప్పుడు తెలంగాణా వాదాన్ని బలంగా ప్రజలలొకి తీసుకొని వెల్తూ టి.ఆర్.యస్ కి తెలంగాణా లొ మరొక ప్రత్యమ్నాయం గా మారుతుంది ఇప్పుడు తెలంగాణా ప్రజలు బీ.జె.పీ ని కుడా తెలంగాణా కు బీ.జె.పీ ఛిత్తశుద్దితొ ఉందని విశ్వశిస్తారు అని నా నమ్మకం.ఇప్పటికే తెలంగాణా ప్రజలు టి.ఆర్.యస్ మీద చాలా అసహనం గా ఉన్నా వేరే గత్యంతరం లేక ఆ పార్టీ నే నమ్ముకున్నారు ,  ఇప్పుడు వాళ్ళకు బీ.జె.పీ ఒక ప్రత్యమ్నాయం ..అందులొనూ ఈ విజయం బీ.జె.పీ కి ఎంత  ఉత్సాహాన్ని ఇచ్చిందొ నిన్న ఆ పార్టీ శ్రేణులు చేసిన హడావిడి చూస్తే నేతెలుస్తుంది , ఇది తప్పకుండా వీరికి ఇది రాయకీయ విజయమే .
కాని వీరు టీ.ఆర్.యస్ ధాటికి నిలబడగలరా ! టీ.ఆర్.యస్ తెలంగాణా వాదాన్ని వేరే ఇతర రాజకీయ పార్టీ కి ఉపయోగపడనిస్తుందా ! ఇప్పటి వరకు తెలంగాణా లొ వచ్ఛిన ఏ తెలంగాణా ఉద్యమైనా అది టీ.ఆర్.యస్ కను సన్నులలొనే జరిగింది అది జె.ఏ.సి అయినా కొదండరాం అయినా .. సకల జనుల సమ్మెఅయినా ! ఇప్పుడు బీ.జె.పీ కి మరొక రాయకీయ శత్రువు టి.ఆర్.యస్.నేను అయితే టీ.ఆర్.యస్ బీ.జె.పీ ని కలుపుకు పనిచేస్తుందని నేను అనుకొను , ఇంతకీ తెలంగాణా వాదాన్ని అడ్డంపెట్టుకుని బాగానే గెలిచారు ,ఉపఏన్నికలు తెచ్ఛి అసెంబ్లీలొ అటు టీ.ఆర్.యస్ ,బీ.జె.పి ఇటు జగన్ అసెంబ్లీ లొ సంఖ్య పెంచుకున్నారు , వీళ్ళు వీళ్ళని గెలిపించిన ప్రజలకొసం ఏంచేస్తారొ చూద్దాం.

నిజంగానే విశ్వతనీయతే గెలిచిందా !

 కొవూరు ఏన్నికల్లొ వై.యస్.ఆర్ కాంగ్రేస్ గెలిచింది , ఇప్పుడు నేను గెలిచింది కదా అని విమర్శించడానికి రాయడానికి రాయడంలేదు ,
 గెలవడానికి ఏన్నొ కారణాలు ఉండొచ్చు , ధనబలం బాగా ప్రభావితం చేసి ఉండొచ్చు కాని ఆ పని ఒక్క వై.యస్.ఆర్ కాంగ్రేస్ మాత్రమే
చేసిందా ! సమస్యే లేదు అన్ని పార్టీ లు అదే పని చేశాయి/చేస్తాయి కూడా మరి వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ మాత్రమే ఎందుకు గెలిచింది ?
దానికి 70కొట్లు  ఎక్కడినుంచి వచ్చాయి , ఏం ఆడబ్బులు తెలుగుదేశం దగ్గర లేవా , కాంగ్రేసు వారి దగ్గర లేవా ! ఉన్నాయి అయినా
ఎందుకు ఖర్చు పెట్టలేదు ! ఏం ఈ విజయం వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ కి తప్ప మిగతా వారందరికి ఏందుకు అవసరంలేదు !
ఈ ఎన్నికలొ గెలవటం ద్వారా జగన్ కేంద్రంలొ కాంగ్రేస్ వారికి ఏం చెప్పదలచుకున్నాడు … అరెస్ట్ నుంచి తప్పించుకొవాలని చూశాడా !
అన్ని డబ్బులు అసలు వై.యస్.ఆర్ కాంగ్రేస్ వాళ్లు ఎలా పంచగలిగారు ,అనూహ్యంగా తెలుగుదేశం వాళ్ళదగ్గర  కొట్లు ఉన్నట్లు ఎవరు సమాచారం
ఇచ్చారు అంటే కాంగ్రేస్ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ డబ్బులు మాత్రమే ఎందుకు కనిపించాయి … వై.యస్.ఆర్ కాంగ్రేస్ వాళ్ళవి ఎందుకు కనిపించలేదు !

ఇంత చేసి ఈ విజయం లొ ప్రజలు చూపిన విశ్వతనీయత ఎక్కడుంది !?

తెలంగాణా ….తిమ్మిరి

అంటే సమైఖ్యవాదం అంటారు కాని …. తెలంగాణా కు అనుకూలమన్నా తప్పే , ఏమీ మాట్లాడక పొయినా తప్పే !
అవును మరి తెలంగాణా చంద్రబాబు జేబులొ పెట్టుకు తిరుగుతున్నాడు తీసి ఇవ్వడానికి !
ఇంత చేసి కాంగ్రేస్ వాళ్లను ఏమీ అనరు … సమైఖ్యాంద్ర బొర్డ్ పట్టుకున్న జగన్ ని ఏమీ అనరు …
ఎటుచేసి ఎప్పుడు చంద్రబాబు మీద పడి ఏడవడం మటుకు మహబాగాతెలుసు ఈ మా ఎర్రి సొదరులకి ..
పొనీ చంద్రబాబు ఏమైనా అడ్డుకుంటున్నాడే అనుకుందాం .. కాసేపు , అప్పుడు తెలంగాణా చివరివరకు తరిమికొడతారట ,
సరే కొడతారు సరే ! మరి తెలుగుదేశం పార్టీ ఏంచేసిందని నాశనం అయిపొవాలి ! ఇక్కడే అర్దమవలా మాజనాల అసలు ఏడుపు
ఏమిటొ… వీళ్ళకి ఈ తిమ్మిరి ఎప్పుడు తగ్గుద్దొ ఏమిటొ … వీళ్ళతలతిక్క పనులకి నాలాంటి తెలంగాణా వాళ్లకి తెలంగాణా అని చెప్పుకొవడానికే సిగ్గుగా ఉంది .

కమీషన్లు పెంచిన కాంగ్రేస్ ప్రభుత్వం

కాంగ్రేస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలొ కాంట్రాక్టులు మొదలైన పనులకు ఇదివరకు ఉన్న 10 శాతం కమీషన్ రేటును ఏకంగా 30 శాతానికి పెంచారట !
వచ్చే సారి ఎలాగూవస్తామని నమ్మకం లేక దొరికిన కాడికి దొచేస్త్తున్నట్టున్నారు , మహాప్రభువులు.
వీళ్ళకే 30 శాతం ఇస్తే ఇక కాంట్రాక్టర్ ఏంతినాలి .. ఇక చేసిన పని నాణ్యత గురించి మాట్లాడటం కూడా అనవసరం అనుకుంటా ….