మహాప్రస్థానం–శ్రీశ్రీ

పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళులేచి,
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!
వచ్చేశాయ్, విచ్చేశాయ్,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈలోకం మీదేనండి!

నాకు నచ్చిన  కవిత ఇది..నాబ్లాగు లొ  మొదటగా మహాప్రస్థానం–శ్రీశ్రీ గారి ని స్మరించుకుంటు.. ఈకవిత.

నాకు ఎందరొ  మర్గదర్శకులు అందరికి శతకొటి వందనములు.

1 thoughts on “మహాప్రస్థానం–శ్రీశ్రీ

వ్యాఖ్యానించండి